జబర్దస్త్‌కు షాక్.. అంతలా దిగజారి పోయిందేమిటి?
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇంటికి పరిమితమయ్యారు. రెండు నెలలుగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న ప్రజలకు టెలివిజన్ కార్యక్రమాలే వినోదంగా మారాయి. దీంతో బుల్లితెరకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో రికార్డు స్థాయిలో టెలివిజన్ రేటింగ్‌లు నమోదు అవుతున్నాయి. అయితే తాజా వారానికి సంబంధించిన టీఆర్సీలలో కొన్ని అంశాలు షాకింగ్‌గా కనిపించాయి. అవేమింటంటే..

లాక్‌డౌన్‌తో పున: ప్రసారాలు
బుల్లితెరకు సంబంధించిన కార్యక్రమాల షూటింగులు ఆగిపోవడంతో గతంలో కొనసాగిన, ప్రసారమైన కార్యక్రమాలను, ఎపిసోడ్స్‌ను పున: ప్రసారం చేస్తున్నాయి. టాప్ రేటింగ్ కలిగిన సీరియల్స్, రియాలిటీ షోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో పలు కార్యక్రమాలను రీరన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

టాప్ నుంచి కిందకు
గతంలో టీఆర్పీ రేటింగ్‌లో కార్తీకదీపం, జబర్దస్త్ ఎక్స్‌ట్రా డోస్ ఎపిసోడ్స్ టాప్ స్థానాల్లో కొనసాగాయాయి. అయితే తాజా రేటింగుల ప్రకారం చూస్తే ఇవి తమ స్థానాలను కోల్పోయి కిందకు దిగజారాయి. కార్తీకదీపం సీరియల్ మూడో స్థానానికి, జబర్దస్త్ ఐదో స్థానానికి పడిపోయినట్టు టీఆర్పీ రిపోర్టులో వెల్లడైంది. గతంలో కార్తీకదీపం రెండోస్థానంలో, జబర్దస్త్ రెండో స్థానంలో ఉన్నాయి.

కార్తీకేయ 90ml టాప్
గతవారం టీఆర్పీ రేటింగ్‌లో న్యూస్‌కు సంబంధించిన కార్యక్రమాలు టాప్ స్థానాన్ని దక్కించుకొన్నాయి. ఇక వెండితెర మీద ఆకట్టుకొలేకపోయిన 90ఎంఎల్ చిత్రం బుల్లితెర మీద భారీ టీఆర్పీని సాధించింది. 90ml చిత్రం రెండోస్థానాన్ని సొంతం చేసుకొన్నది. ఇక అల్లు అర్జున్ సరైనోడు చిత్రం 5 స్థానంలో నిలిచింది.
Recommended Video

న్యూస్‌కు ప్రేక్షకుల బ్రహ్మరథం
కరోనావైరస్ కారణంగా న్యూస్‌పై బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఇంటిలోనే ఉంటున్న వారంతా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పుటికప్పుడు వార్తల ద్వారా తెలుసుకొన్నారు. ఇక సీరియల్స్ కాకుండా, అహ నా పెళ్లంట, దసరా మహోత్సవం లాంటి ప్రత్యేక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమైందని రిపోర్టు వెల్లడించింది.


Click it and Unblock the Notifications











