Bigg Boss 8 Telugu : నా జోలికొస్తే పగులుద్ది .. బిగ్‌బాస్‌ షోపై కిరాక్ ఆర్పీ హాట్ కామెంట్స్

మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభం కానుండటంతో తెలుగు నాట బిగ్‌బాస్ ఫీవర్ పట్టుకుంది. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. బిగ్‌బాస్ ఎన్ని గంటలకు ప్రసారమవుతుంది, ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారు, లాంచింగ్ రోజున ప్రేక్షకులకు ఎంట్రీ ఉందా లేదా, స్టార్టిండ్ డే గెస్ట్‌లుగా ఎవరొస్తున్నారు. ఇలా ప్రేక్షకుల బుర్రలను అనేక సందేహాలు తొలిచేస్తున్నాయి.

ఇప్పటికే బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్ అవ్వగా.. షో ఎలా ఉండబోతుందన్న దానిపై హోస్ట్ నాగార్జున ఆల్రెడీ బోల్డన్నీ లీకులిచ్చేశారు. ఏం కావాలన్నా లిమిట్‌ లెస్‌గా ఇస్తాననని.. కానీ అడిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నాగ్ కండీషన్ పెడతారు. ఆయన మాటల వెనుక ఏదో తిరకాసు ఉందని హౌస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్, ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాగే ఎప్పటిలాగే .. బిగ్‌బాస్ హౌస్‌లో ఏమేం వివాదాలు జరుగుతాయో.. వాటిని ఎలా వాడుకుని పాపులర్ అవుదామా అని పుకారు రాయుళ్లు రెడీగా ఉన్నారు.

jabardasth kiraak rp made sensational comments on bigg boss telugu 8 here s the details

బిగ్‌బాస్ నుంచి ఆడియన్స్ ఎప్పటికప్పుడు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుకు తగినట్లుగా కంటెంట్ ఇచ్చేవాళ్లు లేకుంటే షో తేడా కొట్టేస్తుంది. గతంలో కొన్ని సీజన్లలో ఇలాంటి కొన్ని తప్పులు జరిగి షో పండలేదు. అయితే గతేడాది ఉల్టాపల్టా అంటూ కొత్తగా డిజైన్ చేసి సామాన్యులు, సెలబ్రెటీలతో హౌస్‌ను నింపేశారు. ఆ సీజన్ ప్రేక్షకులకు మంచి మజాను అందించింది.

ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయ్యిందని, త్వరలోనే వీరిని క్వారంటైన్‌కు పంపి మెడికల్ టెస్టులు చేయనున్నారు. ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే వారి ప్లేస్‌లో మరొకరిని తీసుకునేందుకు రిజర్వ్ బెంచ్‌ను సైతం సిద్ధం చేశారు. బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ రోజుకొక కొత్త పేరు నెట్టింట వైరల్ అవుతోంది. 14 మంది పేర్లు కన్ఫర్మ్ అయ్యాయంటూ జబర్దస్త్ పవిత్ర, నిఖిల్, బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, శేఖర్ భాషా, నైనికలతో పాటు మాజీ కంటెస్టెంట్స్ యాంకర్ శివ, శోభాశెట్టి, హరితేజ, పునర్నవి కన్‌ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

లిస్ట్‌లో వినిపిస్తున్న మరో పేరు జబర్దస్త్ కిరాక్ ఆర్పీ. ఏపీ ఎన్నికల నుంచి వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు ఆర్పీ. ఘాటు పదజాలంలో ఎవరినైనా లెక్క చేయకుండా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. అలాంటి వ్యక్తి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడితే ఆడియన్స్‌కి మంచి ఫన్ గ్యారెంటీ. అందుకే చాలా మంది యూట్యూబర్లు ఆర్పీ పేరును ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 8 ఆఫర్‌పై ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్స్ చేయమని అడిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడే కాదు చాలా సీజన్‌ల నుంచి సంప్రదిస్తున్నారని కిరాక్ ఆర్పీ వెల్లడించారు. కానీ తానేమీ బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్పీ క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఆయన బిగ్‌బాస్‌కి వెళ్తారన్న ఊహాగానాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X