వైసీపీని తిట్టానని .. గుట్కా నాయాళ్లు కత్తులు పట్టుకొని వెంటాడారు.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపు 164 సీట్లు గెలుచుకుని బంప్ విక్టరీ కొట్టింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లను ఇచ్చిన అదే ఓటర్లు నేడు 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను కట్టబెట్టి షాకిచ్చారు. ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఫలితాల అనంతరం వైఎస్ జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంతా మంచే చేశానని, కానీ ఎందుకు తనను ఓడించారో అర్ధం కావడం లేదన్నారు.

మరోవైపు.. వైసీపీపై నెటిజన్ల ట్రోలింగ్‌ మాత్రం ఆగడం లేదు. మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర వైసీపీ కీలక నేతలు ఓటమి బాటపట్టడంతో వారే టార్గెట్‌గా మీమ్స్ వదులుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను గతంలో అసభ్యపదజాలంతో దూషించిన వారు ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు. వీరిని ఆన్‌లైన్‌లో జనసైనికులు ఓ ఆట ఆడుకుంటున్నారు. వారికి వైసీపీ కేడర్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.

jabardasth kiraak RP made sensational comments on ysrcp leaders video goes viral

ఇదిలావుండగా.. ఏపీలో కూటమి అధికారం రావడంపై హర్షం వ్యక్తం చేశారు జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ. అంతేకాదు.. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరించిన విషయాలను ఆయన బయటపెట్టారు. అర్ధరాత్రుళ్లు తన ఇంటి డోర్లు కొట్టేవారని, తన వెనుక కత్తులతో ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయని కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారానికి కూడా ఇబ్బందులు కలిగించేలా.. తనకు వచ్చిన ఫ్రాంచైజీలను అడ్డుకున్నారని , రేపు అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటే ఇవాళే వారిని ఆపేసేవారని కిరాక్ ఆర్పీ ఆరోపించారు.

జూన్ 4న జగన్ గెలిస్తే నీ పరిస్ధితి ఏంటని కొందరు వైసీపీ నాయకులు హెచ్చరించారంటూ .. మరి ఇప్పుడు మీ పరిస్ధితి ఏంటని ఆర్పీ ప్రశ్నించారు. కిరాక్ ఆర్పీ అనేవాడు అన్ని వదులుకుని రోడ్డుపై నిలబడి ఆరోజున ప్రెస్‌మీట్ పెట్టాడని.. మీలో ఒక్కడికైనా ఆర్పీలా మాట్లాడే దమ్ముందా అని ఆయన నిలదీశాడు.

164 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో కిరాక్ ఆర్పీ నిలబడ్డాడని.. వాడొక కమెడియన్ , ఒక చేపల పులుసు పెట్టుకునేవాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల్లో ఎంతమందికి చదవడం తెలుసు.. గుట్కాలు నమలడం, గుండాగిరి చేయడమే తెలుసంటూ ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరాక్ ఆర్పీ ఇంటి తలుపులను అర్ధరాత్రి కొట్టిందెవరు, ఆయనను కత్తులతో ఫాలో అయింది ఎవరు అంటూ పెద్ద చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X