Roja: రోజా.. నీవు ఒక్కదానివే ఆడదానివా? నిప్పులు చెరిగిన కిర్రాక్ ఆర్పీ
ఏపీలో సోషల్ మీడియాలో గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లందరనీ అరెస్ట్ చేస్తున్నారు. తనను టార్గెట్ చేయడంపై రోజా ఆవేదన వ్యక్తం చేసింది. తనను తన కుటుంబాన్ని బూతులు తిడుతున్నారంటూ వీడియోను రిలీజ్ చేసి.. కంటతడి పెట్టింది. అయితే రోజా వీడియోపై కిర్రాక్ ఆర్పీ స్పందిస్తూ.. గతంలో మీరు పవన్ కల్యాణ్, భువనేశ్వరిని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేశారో తెలియదా? అంటూ కిర్రాక్ ఆర్పీ కౌంటర్ ఇచ్చారు. కిర్రాక్ ఆర్పీ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
అసెంబ్లీలో కొందరు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు. అదే అసెంబ్లీలో ఉన్న నీవు ఎందుకు ప్రశ్నించలేదు? నీవు ఒక్కదానివే ఆడదానివా? నీ కుటుంబంలో ఉండే ఆడవాళ్లు కాదా? స్వర్గీయ ఎన్టీఆర్ కూతురుకు ఆ బాధ ఉండదా? వాళ్ల ఫ్యామిలీకి ఆ బాధ ఉండదా? చట్టం చేతిలో ఉందని, 151 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నారని మహిళలను చిత్ర విచిత్రంగా అవమానిస్తుంటే నీకు ఏమొచ్చింది అని కిర్రాక్ ఆర్పీ నిలదీశాడు.

రోజా కుటుంబంలో ఉండే వాళ్ల ఆడవాళ్లా? రోజాను అనకూడదు, రోజా పిల్లల్ని ఏమీ అనకూడదు. నిన్ను అమ్మ అనడానికి కూడా సిగ్గుపోతున్నది. నీ ఒక్కదానికే ఏడుపు వస్తుందా? నీకే కన్నీళ్లు వస్తున్నాయా? రోజాను పంది అనడం తప్పు అంటున్న అంబటికి ఒకటే విషయం చెబుతున్నా. ఆమె పవన్ కల్యాణ్‌ను గాడిద అంటే అప్పుడు మాట్లాడలేదేంటి? నీవు ఒక జంతువును వాడితే.. నేను ఒక జంతువుతో పోల్చకూడదా? అని కిర్రాక్ ఆర్పీ తెలిపాడు.
ఎమ్మెల్యే9గా రోజాకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. నన్ను ఎవరూ రేప్ చేయలేరు. ఎస్సీ, ఎస్టీలో పుట్టాలని కోరుకొంటారా? పోలవరంపై జబర్దస్త్‌పై రోజాతో కలిసి మేము జోకులు వేశాం. అలాంటి రోజా ఇప్పుడు నీతులు మాట్లాడుతుందా? అందుకే వైసీపీ నేతలను ప్రజలు ఓడించారు. అందుకే 11 సీట్లు వచ్చాయి అని కిర్రాక్ ఆర్పీ ఘాటుగా స్పందించారు.

నేను టీడీపీ కార్యకర్తను. ఈ మధ్య రెండుసార్లు లోకేష్‌ను కలిశాను. ఏనాడు కూడా ఆయన నన్ను బూతులు తిట్టమనలేదు. బూతుల జోలికే వెళ్లకూడదని చెప్పారు. ఫలానా తల్లిని, ఫలానా చెల్లిని తిట్టమని చెప్పరు. జబర్దస్త్‌లో చాలా స్కిట్ చేశాను. చేపల పులుసు హోటల్ పెట్టుకొన్నాను. నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు కోసం ఎవరినీ తిట్టను అని కిర్రాక్ ఆర్పీ అన్నారు.
మీరు అధికారంలో ఉన్నప్పుడే నేను మీపై విమర్శలు చేశాను. చంపేస్తామని బెదిరింపులు వచ్చినా నేను వెనుకాడలేదు. మీరు పవర్‌లో ఉన్నప్పుడే మీకు ముచ్చెమటలు పట్టించాను. మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానిని. ఎప్పటికీ అలానే ఉంటాను అని కిర్రాక్ ఆర్పీ అన్నారు.


Click it and Unblock the Notifications











