Jabardasth: షేకింగ్ శేషు ఒక గాడిద.. 20 లక్షల మోసం కాదు 70 లక్షలు ఖర్చు: కిర్రాక్ ఆర్పీ

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు ప్రస్తుతం అదే షోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షోలో చాలా మోసం జరుగుతోంది అని అక్కడ యాజమాన్యం తీరు ఏ మాత్రం బాగోలేదు అని కొంతమంది ఇన్ డైరెక్ట్ గానే కామెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇటీవల కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. మేము కష్టపడితేనె జబర్దస్త్ కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది అని కిరాక్ ఆర్పీ అనేక విషయాలపై కఠినంగా స్పందించడంతో ఓ వర్గం వారు అతనికి మద్దతు పలుకుతూ ఉన్నారు.

మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. అదేవిధంగా ఆర్పీ కొన్ని మోసాలు కూడా చేసినట్లు కమెడియన్ షేకింగ్ శేషు కూడా ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. అందుకు కిర్రాక్ ఆర్పీ మరొక వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

విబేధాల కారణంగా..

విబేధాల కారణంగా..

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు అందుకున్న వారిలో ప్రస్తుతం కొంతమంది సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారుతున్నారు. అయితే మరి కొంత మంది విభేదాలు కారణంగా బయటకు వచ్చినట్లుగా కూడా అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా నాగబాబు జడ్జీగా చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కూడా అక్కడ నిర్వాహకులపై అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు ఓపెన్ గానే తెలియజేశారు.

చేదు అనుభవం

చేదు అనుభవం

నాగ బాబు వెళ్లిపోయిన తర్వాత మరి కొంతమంది కమెడియన్స్ కూడా అక్కడ నిర్వాహకుల తీరు నచ్చక వెళ్లిపోయినట్లుగా వివరణ ఇవ్వడంతో జబర్దస్త్ షోలో ఎప్పుడు లేనంత నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ మధ్య బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు కూడా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లో ఎన్ఓసి కోసం సంస్థ చుట్టూ తిరగాల్సి వచ్చింది అని 10 లక్షలు కట్టించుకుని ఎన్ఓసి ఇచ్చారు అని ముక్కు అవినాష్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్

కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్

ఇక రీసెంట్ గా కిరాక్ ఆర్పీ సైతం జబర్దస్త్ యాజమాన్యం తీరుపై మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అక్కడ కనీసం ఒక ఫుడ్ కూడా సరిగా ఉండదు అని యాజమాన్యం తీరు ఏమాత్రం బాగోలేదు అని అక్కడ రాజకీయాలు అలాగే ఇతర కారణాల వలన అందరూ వెళ్ళిపోతున్నారు అని అన్నారు.

షేకింక్ శేషు కౌంటర్

షేకింక్ శేషు కౌంటర్

ఇక కిర్రాక్ ఆర్పీ ఆ విధంగా మాట్లాడిన తర్వాత అతను చేసిన వ్యాఖ్యలపై మరి కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ తీవ్రంగా ఖండించారు. జబర్దస్త్ ద్వారానే అందరూ కూడా ఈ స్థాయికి వచ్చారు అని ఇప్పుడు అన్నం పెట్టిన సంస్థలపై అతను చేస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఇక షేకింగ్ శేషు అయితే కిరాక్ ఆర్పి కొన్ని మోసాలు కూడా చేశాడు అని అతనికి సొంత ఇల్లు ఉన్నట్లు యూట్యూబ్లో హోమ్ టూర్ చేయడం కూడా ఫేక్ అని అన్నారు. అంతే కాకుండా అతను ఒక నిర్మాతకు 20 లక్షల టోపీ పెట్టాడు అని ఆ విషయం మీడియాలో కూడా వైరల్ అయింది అని అన్నారు.

వాడు ఒక గాడిద

వాడు ఒక గాడిద

ఇక షేకింగ్ శేషు చేసిన కామెంట్స్ పై కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అతను చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం నిజం కాదు అని వాడు ఒక గాడిద అంటూ ఒక విధంగా నేను సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రొడ్యూస్ చేస్తాను అని తనంతట తానే నన్ను సంప్రదించాడు అని ఆర్పీ అన్నాడు. ఆ క్రమంలో 20 లక్షల కాదు 70 లక్షలు ఖర్చు అయినట్లు చెబుతూ ఆధారాలతో సహా తన దగ్గర అన్ని ఉన్నాయని ఆర్పీ అన్నారు.

అసలు విషయం ఇదే..

అసలు విషయం ఇదే..

ముందుగా ఒక సినిమాను నిర్మించడానికి ఆఫీస్ కావాలి. అయితే దాని కోసం మాత్రమే ప్రత్యేకంగా ఒక ఆఫీస్ నిర్మించుకున్నట్లుగా తెలియజేశాను. అందుకు సంబంధించిన బిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి.. అయితే ఆ తర్వాత సినిమా కోసం 70 లక్షల వరకు ఖర్చు పెట్టగా ఆ తర్వాత ఇంకా ఖర్చు పెట్టలేను అని అతను అన్నాడు.

దీంతో ఇద్దరం కూడా మాట్లాడుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాము. ఒకవేళ భవిష్యత్తులో ఇదే కథతో సినిమా తీయాల్సి వస్తే నేను వేరే నిర్మాతతో చేసుకుంటాను.. అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని కూడా చెప్పినట్లుగా కిరాక్ పార్టీ వివరణ ఇచ్చాడు. అంతా హ్యాపీగా సాగుతున్న సమయంలో షేకింగ్ శేషు తనపై ఆరోపణలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని అందులో ఎలాంటి నిజం లేదని కూడా ఆర్పి వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X