Roja: రోజా అరెస్ట్ అక్కడే.. కిర్రాక్ ఆర్పీ జోస్యం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరెస్టుల పర్వంగా భారీగా కొనసాగుతున్నది. వైసీపీ ప్రభుత్వ హాయంలో అక్రమాలకు పాల్పడిన నేతలను, అలాగే అభ్యంతకరకమైన పదాలతో దూషించిన పొలిటిషియన్స్‌ను వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని లెక్కకు మంచి కేసులు నమోదు చేస్తూ ఉన్నపళంగా వారిని రిమాండ్‌పై జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్ట్‌ల నుంచి తప్పించుకోవడానికి ఏపీ నేతలంతా హైదరాబాద్‌లోని అత్యాధునిక భవనాల్లో తలదాచుకొంటున్నారు అని జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ ఆరోపించారు. ఆయన వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
గత ప్రభుత్వం హాయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లాంటి నేతలపై నోరుపారేసుకొన్న నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఏకంగా చంద్రబాబు సతీమణిపై కూడా తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేశారు. నోటితో చెప్పలేని విధంగా వారిపై విమర్శలు చేశారు. ఏపీలో ఆయనపై నమోదైన కేసుల తర్వాత హైదరాబాద్‌లోని మై హోం భుజా అపార్ట్‌మెంట్ నుంచి ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఇక వల్లభనేని వంశీ, ఇతర నేతల అరెస్ట్ తర్వాత రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీని కూడా బలవంతంగా అదుపులోకి తీసుకొని ఏపీలోని రాజంపేట, కడప ప్రాంతాలకు తరలించారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత 14 రోజుల రిమాండ్‌పై ఆయనను కడప జైలుకు తరలించారు. ఆయన బెయిల్ కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ అరెస్ట్‌లపై మీడియాలో కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియా వాళ్లంతా మై హోం భుజా వద్ద ఓ టెంట్ వేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ అక్కడే దొరికాడు. పోసాని కృష్ణమురళి అక్కడే అదుపులో తీసుకొన్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అదే. ఆధునిక హంగులు, సౌకర్యాలతో ఉంటుంది. రానున్న రోజులకు సరితూగే టెక్నాలజీతో ఆ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు అని కిర్రాక్ ఆర్పీ తెలిపారు.
2024 సంవత్సరంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అయోమయంలో ఉన్న వైసీపీ నేతలందరూ మై హోం భుజాలోనే ఫ్లాట్స్ కొన్నారు. వల్లభనేని వంశీ, పోసాని తర్వాత రోజా కూడా ఆ అపార్ట్‌మెంట్‌లోనే దొరుకుతుంది. అంబటి రాంబాబు కూడా అక్కడే దొరుకుతాడు. వారితోపాటు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి రాజకీయ నేతలకు అక్కడే ఫ్లాట్స్ కొన్నారు. అక్రమంగా సంపాదించే డబ్బుతో అక్కడే అత్యాధునిక వసతులున్న ఫ్లాట్స్ కొన్నారు అని కిర్రాక్ ఆర్పీ అన్నారు.
పోసాని అరెస్ట్ తర్వాత ఏపీలో రోజా, శ్రీరెడ్డి అరెస్టులు జరుగుతాయని వార్తలు వెలువడుతున్నాయి. మరికొందరి నేతల పేర్లు కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. చిన్న నేతల కాకుండా వైసీపీలో కీలక నేతలను కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు బలంగా ప్రచారం అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే విషయంపై నేతలు కంగారు పడుతున్నారని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











