Jabardasth: బ్లాక్మెయిల్ చేసి జబర్దస్త్ వరకు రావాల్సి వచ్చింది.. లేడి కమెడియన్ ఎమోషనల్ స్టోరీ

జబర్దస్త్ షో లో చాలా మంది కమెడియన్స్ ఎంతగానో నవ్విస్తూ వారి టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. అయితే పైకి ఎంతగా నవ్వించినా కూడా కొందరు మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు ఇక్కడి వరకు వచ్చారు అని అర్థమవుతొంది. ఇక కొంతమంది తెరవెనుక కష్టాలు అయితే చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఇటీవల కాలంలో జబర్దస్త్ లో అబ్బాయిలతో పోటీ పడుతూ మంచి టాలెంట్ తో ఆకట్టుకుంటున్న ఫైమా కూడా చాలా కష్టాలు ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె ఒకసారి బ్లాక్మెయిల్ చేసి జబర్దస్త్ వరకు రావాల్సి వచ్చినట్లు ఫైమా తెలియజేసింది.

అబ్బాయిలతో పోటీ పడుతూ

అబ్బాయిలతో పోటీ పడుతూ

ప్రస్తుతం జబర్దస్త్ షో లో బుల్లెట్ భాస్కర్ గ్రూప్ లో స్కిట్స్ చేస్తున్న ఫైమా మొదట పటాస్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. అమ్మాయిలలో చాలా మంది జబర్దస్త్ షోలో అలాగే పటాస్ లో కూడా గుర్తింపు అందుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారి అందరికంటే ఎక్కువగా అబ్బాయిలతో పోటీ పడుతూ ఫైమా షేక్ విభిన్నమైన మాట తీరుతో చాలా మంచి కామెడీ ని అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకునే.

మొదట అలా పటాస్ షోకు

మొదట అలా పటాస్ షోకు

ఇక బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్న ఫైమా ఇక్కడి వరకు రావడానికి ఎన్నో ఒడిదుడుకులను దాటి వచ్చిందట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని విషయాలను కూడా తేలియజేసింది. మొదట తన కాలేజ్ టైం లో పటాస్ షో కు వచ్చాను అని అప్పుడు కేవలం చూసేందుకు ఆడియెన్స్ తరహాలోనే వచ్చినట్లుగా ఫైమా తెలియజేసింది.

ఆఫర్ ఇవ్వడంతో..

ఆఫర్ ఇవ్వడంతో..


పటాస్ షోకి వచ్చినప్పుడు అక్కడ అనుకోకుండా నేను మాట్లాడగానే నా యాస అలాగే డైలాగ్ టైమింగ్ పటాస్ షో దర్శకులకు బాగా నచ్చింది. ఇక వాళ్ళు ఆఫర్ ఇవ్వడంతో ఎంతగానో హ్యాపీగా మంచి కామెడీతో ఒప్పించాలి అని అనుకున్నాను. కానీ షో కోసం వెళ్ళడానికి మా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మా అమ్మ నాన్న ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో కొంత అప్సెట్ అయ్యాను.

బ్లాక్మెయిల్ చేశా..

బ్లాక్మెయిల్ చేశా..

ఇక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వేరే దారిలేక బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. చచ్చిపోతాను అని చెప్పడంతో మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనలేక నన్ను మొదట అయిష్టంగానే షో కు పంపారు. ఇక అక్కడి నుంచి నా కెరీర్ ఒక ఊహించని మలుపు తిరిగింది. నేను ఊరికి వెళ్లగానే నాతో ఫోటోలు దిగేందుకు అక్కడి జనాలు ఎంతగానో ఎగబడుతున్నారు. ఒకప్పుడు నేను అలా చేస్తే.. ఇప్పుడు నా కోసం అందరూ వస్తున్నారు అని ప్రేమ తెలియజేసింది.

సినిమాల్లో అవకాశాలు

సినిమాల్లో అవకాశాలు

ఇక పటాస్ తర్వాత బుల్లెట్ భాస్కర్ అన్న టీం లో చేరడం నా అదృష్టమనే చెప్పాలి. ఆయన ప్రోత్సాహంతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఒక అన్న లాగా తండ్రి లాగా నన్ను ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. మొదట జీవన్ అన్న టీమ్ లో చేసినప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే భాస్కర్ అన్న టీం లోకి వచ్చానో అప్పటి నుంచి నాకు మంచి గుర్తింపు లభించింది. సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ జబర్దస్త్ లో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో కూడా నటిస్తాను అని తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X