తల్లి కాబోతున్న జబర్ధస్త్ కమెడియన్.. సీక్రెట్ లీక్ చేసిన గెటప్ శ్రీను భార్య
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా, బుల్లితెర పరిశ్రమల్లోకి ఎంతో మంది అమ్మాయిలు నటీమణులుగానో, యాంకర్లుగానో ఎంట్రీ ఇస్తున్నారు. అలా వచ్చి ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న వారిలో టాలెంటెడ్ లేడీ జోర్దార్ సుజాత ఒకరు.
న్యూస్ రీడర్‌గా పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత జబర్ధస్త్ కమెడియన్‌గా, నటిగా యమా సందడి చేసింది. ఈ మధ్య కాలంలోనే కమెడియన్ రాకింగ్ రాకేష్‌ను వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుజాత తల్లి కాబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. బిగ్ బాస్‌తో
తెలంగాణకు చెందిన సుజాత ఓ న్యూస్ ఛానెల్‌లో 'జోర్దార్' వార్తలు చెప్పేది. దీంతో ఆమె జోర్దార్ సుజాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. దీని తర్వాత బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన రీతిలో ఆడుతూ, మాట్లాడుతూ మరింత పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి జోర్దార్ సుజాత క్రేజ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది.

జబర్ధస్త్‌లో వచ్చి ఫేమస్
న్యూస్ రీడర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుజాత.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన రీతిలో కామెడీని పంచుతూ హైలైట్ అయింది. అప్పటి నుంచి అదే షోలో కంటిన్యూ అవుతోంది. తద్వారా బుల్లితెరపై ఎన్నో అవకాశాలను కూడా సొంతం చేసుకుంటోంది. ఇలా చాలా షోలలో భాగం అయిపోతోంది.

రాకింగ్ రాకేష్‌తో వివాహం
జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జోర్దార్ సుజాత.. ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేష్‌తో ప్రేమలో పడింది. ఇలా వీళ్లిద్దరూ చాలా కాలం పాటు లవ్ ట్రాక్‌ను నడిపారు. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి జంటగా సందడి చేస్తున్నారు. అదే సమయంలో తమదైన రంగాల్లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోన్నారు.

ఆ వెబ్ సిరీస్‌లో సూపర్
చాలా కాలంగా బుల్లితెరపై తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తోన్న జోర్దార్ సుజాత గత ఏడాది 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో అలరించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా వచ్చింది. ఇది కూడా సక్సెస్ అయింది. అంతేకాదు, సుజాత 'కిస్మత్' అనే సినిమాలో కూడా మంచి పాత్రను పోషించింది.

తల్లి కాబోతున్న సుజాత
జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ వివాహం తర్వాత కూడా తమ కెరీర్‌లను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ పలు చిత్రాలను, షోలను కూడా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్ధస్త్‌లోనూ జంటగా కనిపిస్తున్నారు. ఇలా కెరీర్ పరంగా సక్సెస్ అయిన సుజాత, రాకేష్ పర్సనల్ లైఫ్‌నూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు.

లీక్ చేసేసిన శ్రీను భార్య
జోర్దార్ సుజాత తల్లి కాబోతుందన్న వార్తను ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను భార్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఆమెకు జరిపిన సీమంతం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి సుజాత తల్లి కాబోతుండడంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











