Jabardasth: కాబోయే భర్తను పరిచయం చేసిన రీతూ చౌదరి.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో లేడి కమెడియన్స్ కూడా అన్నారు. ఇక అందులో హైపర్ ఆది టీమ్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కామెడీ స్కిట్స్ తో ఆమె బాగానే పాపులర్ అయ్యింది. ఇక రీసెంట్ గా రీతూ తనకు కాబోయే భర్త గురించి ఒక క్లారిటి ఇచ్చింది. ఇక ఆమె భర్త గురించి ప్రస్తుతం మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

హైపర్ ఆది టీమ్ ద్వారా..
జబర్దస్త్ స్కిట్స్ లో టీమ్ లీడర్స్ మాత్రమే కాకుండా టీమ్ లో ఉండే కమెడియన్స్ కొందరు హై రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక కాంబినేషన్స్ కూడా ఆ కామెడీ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. హైపర్ ఆది టీమ్ లో కూడా రీతూ చౌదరి మంచి క్రేజ్ అయితే అందుకుంది. అజార్, రీతూ ఇద్దరు కూడా మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ వస్తున్నారు.

అప్పట్లో షాక్ ఇచ్చిన రీతూ
ఇక రీతూ శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే కొన్నిసార్లు చాలా ఎమోషనల్ అయ్యింది కూడా. అదే విధంగా ఆమె హైపర్ ఆదికి కొన్నిసార్లు డైరెక్ట్ గా ఐ లవ్యూ చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక అజార్ కూడా అదే తరహాలో ఆమెకు కనెక్ట్ అయినట్లే అనిపించింది. వీరిద్దరిపై సోషల్ మీడియాలో ఆ మధ్య అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ వాళ్ళు ఎం చేసినా కూడా అవన్నీ రియాల్టీ షోలో భాగమే అని తెలుస్తోంది.

కామెడీ మాత్రమే కాకుండా..
రీతు చౌదరి ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఫెస్టివల్ సందర్భంగా ప్రసరమవుతున్న కొన్ని ప్రత్యేకమైన షోలలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కామెడీతో పాటు అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేస్తోంది. రీతూ చౌదరి ఏం చేసినా కూడా ప్రేక్షకులను తన వైపు ఆకర్షించే విధంగా ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది.

పెళ్లి ఫిక్స్..
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ముఖ్యంగా గ్లామరస్ ఫోటోలతో కూడా ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా మారుతున్న ఈ బ్యూటీ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో తనకు కాబోయే భర్త ఫోటో కూడా పోస్ట్ చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా ఆమె అధికారికంగా చెప్పలేదు కానీ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే దాదాపు పెళ్లి కాయమైనట్లుగా తెలుస్తోంది.

అతను ఎవరంటే?
మా బంధం కంటే ఏది ఎక్కువ కాదు.. అంటూ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తితో దిగిన ఫోటోను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అతను ఎవరు అనే వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రాజకీయాల్లో కూడా శ్రీకాంత్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు వ్యాపారులతో అతను సంపన్నుడు అని కూడా సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే రీతూ చౌదరి క్లారిటీ ఇవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











