Jabardasth లో చమ్మక చంద్రతో ఎఫైర్ టాక్.. అతని భార్య ఏమన్నారంటే?: లేడి కమెడియన్ సత్య

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతమంది కొత్త వారికి అవకాశాలు దొరికాయి. ఇండస్ట్రీలో అంతకుముందు అవకాశాల కోసం ఎంతగానో కష్టపడిన వారికి జబర్దస్త్ ఒక మంచి ఫ్లాట్ ఫార్మ్ గా నిలిచింది. ఇక తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఆ తరహాలో లేడీ కమెడియన్స్ కు కూడా మంచి క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి. ఇక చమ్మక్ చంద్ర టీమ్ లో కొన్నాళ్ల వరకు కొనసాగిన లేడీ కమెడియన్ సత్యకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఒకానొక సందర్భంలో సత్య చమ్మక్ చంద్ర మధ్యలో కూడా ఎన్నో రకాల నెగిటివ్ వార్తలు వచ్చాయి. అయితే అలాంటి వార్తలు వచ్చినప్పుడు చమ్మక్ చంద్ర భార్య ఏ విధంగా స్పందించింది అనే విషయంపై సత్య ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తక్కువ రేటింగ్స్

తక్కువ రేటింగ్స్

జబర్దస్త్ షోలో మొదట కొనసాగిన సీనియర్ కమెడియన్స్ చాలావరకు మంచి రేటింగ్స్ అందిస్తూ వచ్చారు. వారు ఉండడం వల్లనే జనాలు రెగ్యులర్ గా జబర్దస్త్ షోను ఫాలో అవుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే సీనీయర్స్ వెళ్ళిపోయారో జబర్దస్త్ షోకు గతంలో మాదిరిగా అనుకున్నంత స్థాయిలో అయితే రేటింగ్స్ దక్కడం లేదు. అప్పట్లో 18 వరకు రేటింగ్ అందుకున్న ఈ కామెడీ షో ఇప్పుడు మాత్రం 10 కంటే తక్కువ స్థాయిలోనే రేటింగ్ అందుకుంటున్నట్లుగా పలువురు సీనియర్ కమెడియన్స్ వివరణ ఇస్తున్నారు.

అందుకే వెళ్లిపోయారు

అందుకే వెళ్లిపోయారు

గత కొంతకాలంగా యాజమాన్యం తీరు జబర్దస్త్ లో ఏమాత్రం బాగోలేదు అని కొందరు అసంతృప్తితోనే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్లుగా సీనియర్ కమెడియన్స్ వివరణ ఇస్తున్నారు. జబర్దస్త్ లో కష్టపడిన వారికి పెద్దగా ఆదాయం కూడా రావడం లేదు అని ఆ విషయంలో మాట్లాడినందుకే నాగబాబును కూడా లెక్క చేయలేదు అని కామెంట్స్ కూడా వచ్చాయి. విభేదాలు రావడంతోనే నాగబాబు అక్కడ నుంచి వెళ్లిపోయినట్లుగా టాక్ వచ్చింది.

నాగబాబు హఠాత్తుగా వెళ్లిపోవడంతో..

నాగబాబు హఠాత్తుగా వెళ్లిపోవడంతో..

అయితే జబర్దస్త్ జడ్జిగా ఎంతో కాలంగా కొనసాగిన నాగబాబు హఠాత్తుగా వెళ్లిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత మరి కొంతమంది సీనియర్ కమెడియన్స్ కూడా అక్కడ ఉండలేక బయటకు వచ్చేశారు. అందులో చమ్మక్ చంద్ర ఒకరు. చమ్మక్ చంద్ర తో పాటు అతని దగ్గర ఉన్న కొంతమంది టీం సభ్యులు కూడా జబర్దస్త్ షో నుంచి తెగదెంపులు చేసుకొని మరొక కామెడీ షోలో అవకాశాలు అందుకున్నారు.

చమ్మక చంద్ర టీమ్

చమ్మక చంద్ర టీమ్

అయితే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో చమ్మక్ చంద్ర టాప్ లిస్టులో ఉంటాడు అనే చెప్పాలి. అప్పట్లో అతనే జబర్దస్త్ లో అత్యధిక పారితోషికం అందుకుంటూ వచ్చాడు. చమ్మక్ చంద్ర టీమ్ ఉన్న వారు కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. ముఖ్యంగా లేడీ కమెడియన్ సత్య కూడా చమ్మక్ చంద్ర తో మంచి టైమింగ్ తో కామెడీ చేస్తూ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది.

ఆయన ఒక గురువు

ఆయన ఒక గురువు

ఆ మధ్యకాలంలో చమ్మక్ చంద్ర తో సత్యకు ఏదో సంబంధం ఉంది అని సోషల్ మీడియాలో ఎఫైర్ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత మరికొందరు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా వార్తల్లో డోస్ తగ్గలేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. చమ్మక్ చంద్ర తనకు లైఫ్ ఇచ్చిన ఒక గురువు లాంటి వారు అని చాలా పాజిటివ్ గా స్పందించే ప్రయత్నం చేసింది.

చమ్మక్ చంద్ర భార్య నుంచి మద్దతు

చమ్మక్ చంద్ర భార్య నుంచి మద్దతు

అయితే సోషల్ మీడియాలో అలాంటి వార్తలు వచ్చినప్పుడు చమ్మక్ చంద్ర భార్య ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయంపై కూడా సత్యా క్లారిటీ ఇచ్చారు. చమ్మక్ చంద్రతో ఎలాంటి స్కిట్ చేసినా కూడా వాళ్ళ ఇంట్లో నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది అని ఆ విషయంలో వారి భార్య మద్దతు ఉండేది అని కూడా సత్య తెలియజేసింది. అలాంటి తప్పుడు వార్తలను చంద్ర భార్య అసలు ప్రస్తావనకు కూడా తీసుకురాలేదు అని ఆమె వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X