అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి.. అలా కాంప్రమైజ్.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
దాదాపు 12 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచుతోంది జబర్దస్త్. తెలుగులో టాప్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా సరికొత్తగా సిద్ధమై అలరిస్తోంది. ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా బిగ్‌బాస్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మరి ఈసారి ఎవరు ఎలాంటి స్కిట్స్ చేశారు? ఎవరు నవ్వించే ప్రయత్నం చేశారు? ఈ వివరాల్లోకి వెళితే..
ఈ వారం జబర్దస్త్ కార్యక్రమంలో శంబాల యూనిట్ సందడి చేసింది. హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్‌లు వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడంతో పాటు పడిపడి నవ్వుకున్నారు. రావడం రావడంతోనే తన తండ్రి సాయికుమార్ ఫేమస్ డైలాగ్.. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహామేరా ఈ పోలీస్ అంటూ చెప్పి అలరించాడు. ఆ వెంటనే విజయవాడలో ట్రాఫిక్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఒక ఆఫీసర్‌తో స్కిట్ చేయించారు.

ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్ వచ్చి.. ఏయే బళ్లు ఆపమంటారు అని అడగ్గా ఆ ఆఫీసర్ ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేనివి అని చెబుతాడు. ఇంతలో హీరోయిన్ అర్చనకి బైక్ నేర్పిస్తూ హీరో ఆది వస్తాడు. మీ దగ్గర లైసెన్స్ ఉందా అని ఆ ఆఫీసర్ అడగ్గా.. లైసెన్స్ నా దగ్గర ఉందంటూ ఆటో రాంప్రసాద్ పంచ్ వేయడంతో అంతా నవ్వుకుంటారు. ఆ తర్వాత అప్పారావు రావడంతో అతనిని ఆపుతారు. నేనెవరో మీకు తెలుసా? ఒకసారి ఫోన్ మాట్లాడండి అని ఫోన్ ఇస్తాడు. ఎవరూ మాట్లాడటం లేదని భాస్కర్ చెప్పగా.. నువ్వు మాట్లాడమని చెప్పి అప్పూ పంచ్ వేస్తాడు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో పోలీసులు ఇలాగే ఆపితే నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా అని నేను కూడా చెప్పానని ఆది గుర్తుచేసుకున్నాడు.
ఇక సుధాకర్, కొమరం, నూకరాజులు చేసిన స్కిట్ కూడా బాగా నవ్వించింది. అలాగే హీరోయిన్ అర్చనకు స్టేజ్ మీదే ప్రపోజ్ చేస్తాడు నూకరాజు. దాంతో దిస్ కస్టమర్ ఔట్ ఆఫ్ నెట్‌వర్క్ అని అర్చన చెప్పడంతో అంతా పడిపడి నవ్వుతారు. దొరబాబు, రాంప్రసాద్ వేసిన స్కిట్‌లో హీరో ఆది, హీరోయిన్ అర్చన కూడా పాలు పంచుకున్నాడు. నీకు, నీ గర్ల్ ఫ్రెండ్‌కి గొడవ అయ్యిందనుకో.. నువ్వెలా కాంప్రమైజ్ చేస్తావని దొరబాబుని ఆది అడుగుతాడు. ఏముంది ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి గడ పెట్టేస్తానని కాంప్రమైజ్ అయిపోతుందని దొరబాబు చెప్పడంతో అంతా నవ్వేస్తారు. అలా కాదు... నీకు, నీ గర్ల్ ఫ్రెండ్‌కి గొడవ జరిగి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోతే నువ్వెలా కాంప్రమైజ్ చేస్తావు అని ఆది అడుగుతాడు. నేనే వాళ్లింటికి వెళ్లి గదిలోకి తీసుకెళ్లి గడ పెట్టేస్తాను కాంప్రమైజ్ అయిపోతుందని దొరబాబు చెప్పడంతో ఆది దండం పెట్టేస్తాడు.
మరో స్కిట్‌లో డిసెంబర్ 31వ తేదీ పార్టీ చేసుకోవడం, ఇంటి ఓనర్ క్లాస్ పీకడంతో కాన్సెప్ట్‌తో రాకెట్ రాఘవ వెరైటీగా ట్రై చేశాడు. నా ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ వద్దు, మేం ఇళ్లల్లో ఉండక్కర్లేదా అని ఓనర్ గెటప్‌లో ఉన్న అప్పారావు సీరియస్ అవుతాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది.. పార్టీ వద్దని చెప్పాడు కదా, వాడితోనే ఇక్కడ పార్టీ చేయిద్దామని అంటాడు రాఘవ. వెంటనే వెళ్లి తలుపుకొట్టి అప్పారావుని పిలుస్తాడు రాఘవ. మందాకిని అనే అమ్మాయి చాలా అందంగా ఉంది.. గ్రీటింగ్ కార్డ్ ఇవ్వమని చెప్పిందని అంటాడు.
మందాకిని ఎవరో నాకు గుర్తురావడం లేదని అప్పారావు చెప్పగా.. రాఘవ ఆ అమ్మాయికి కాల్ చేసినట్లు నటిస్తాడు. మీరెవరో ఆయనకి గుర్తురావడం లేదని చెబుతాడు. దాంతో ఆ అమ్మాయి నాకు తెలుసు.. ఇక్కడికి రమ్మను అని అంటాడు అప్పారావు. అయితే ఆటోకి 50 వేలు కొట్టమని చెబుతున్నారని అప్పారావు అనగా.. ఆటో కొనడానికా? ఎక్కడానికా? అని అప్పారావు షాక్ అవుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దొరబాబు ప్రాబ్లమ్‌ని ఆది ఎలా సాల్వ్ చేశాడు? అప్పారావుని రాకెట్ రాఘవ బకరాని చేశాడా? లేదా తెలియాలంటే డిసెంబర్ 26, 27 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











