రష్మిని 13 ఏళ్లుగా అందుకే భరిస్తున్నాం... స్టార్ యాంకర్‌పై జబర్దస్త్ కమెడియన్ దారుణంగా..

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

తొలుత ఆటో రాంప్రసాద్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఏం చేస్తుంటావని గర్ల్‌ఫ్రెండ్ అడగ్గా.. యాపిల్ ఫోన్ బ్యాక్‌సైడ్ యాపిల్ ఉంటుంది కదా.. దానికొక ముక్క ఉండదు, ఆ ముక్కలన్నీ కలెక్ట్ చేసి ఒక యాపిల్ తయారు చేస్తుంటానని బిస్కెట్స్ వేస్తాడు రాంప్రసాద్. ఆ వెంటనే మరో అమ్మాయిని కలిసిన రాంప్రసాద్.. నా మొబైల్‌కి యాపిల్ సింబల్ ఉంది, దీనికి వేరే సింబల్ ఉందని అడుగుతాడు. నీదంటే యాపిల్ ఫోన్.. ఇప్పుడేమో మామిడికాయల సీజన్ కదా? అందుకే నేను మ్యాంగో ఫోన్ కొన్నానని కౌంటర్ వేస్తుంది. నెక్ట్స్ హోటల్‌లో సర్వర్‌గా తన నిజ స్వరూపాన్ని బయటపెడతాడు రాంప్రసాద్. నా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఇబ్బందిగా ఉంది.. వీళ్లద్దరిలో ఒకరిని సెట్ చేసుకోవాలని చెబుతాడు. ఇంతలో అతని ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అదే హోటల్‌కి వచ్చి క్యాప్సినో ఆర్డర్ చేస్తుంది. గర్ల్‌ఫ్రెండ్‌ని చూసిన రాంప్రసాద్ కుంటివాడిలా నటిస్తాడు. అయితే అదే హోటల్‌కి గర్ల్‌ఫ్రెండ్‌కి ఉన్న మరో లవర్ రావడంతో ఆమె నాటకం బయటపడుతుంది. ఆ వెంటనే అందరూ ఫేక్ లవర్స్ అని తేలడంతో అంతా కడుపుబ్బా నవ్వేస్తారు.

Jabardasth Latest Promo Auto Ramprasad Comedy Faima Punches and Fun-Filled Skits This Week

మరో స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్, ఫైమా, శాంతి స్వరూప్‌లు ఎంట్రీ ఇస్తారు. మీ నాన్నకి కంట్లో శుక్లాలు వచ్చాయట.. వెంటనే ఆపరేషన్ చేయాలి, దానికి 2 లక్షలు అవుతుందట అని భాస్కర్‌తో తల్లి గెటప్‌లో ఉన్న శాంతి స్వరూప్ చెబుతుంది. ఆ మాటలు విన్న ఫైమా.. కొడుకుని చితకబాదుతుంది. వీడికి తెలుగు మీడియా వద్దంట.. ఇంగ్లీష్ మీడియం కావాలట, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శాంతి స్వరూప్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పొట్టి నరేష్ అన్నయ్య అంటూ వచ్చి నాకు హైదరాబాద్‌ ట్రాన్స్‌‌ఫర్ అయ్యింది, సంవత్సరం పాటు ఇక్కడే ఉంటానని చెబుతాడు. ఆ మాటలు విన్న ఫైమా.. మళ్లీ కొడుకుని కొడుతుంది. నాకు స్కిన్ కేర్ ఐటెమ్స్ కావాలని పొట్టి నరేష్ భార్య అడగటంతో మళ్లీ కొడుకుని చితకబాదుతుంది ఫైమా.

కొత్త టీమ్‌కి చెందిన ఒక అమ్మాయి.. ఇదిగోండి మేడమ్.. నా మొగుడిని పాపం అన్నావు అనుకో నీకు దీపం పెడతాడు, కొంచెం డిస్టబెన్స్ మెయింటైన్ చేయమని యాంకర్ రష్మికి వార్నింగ్ ఇస్తుంది. అది డిస్టబెన్స్ కాదు.. డిస్టెన్స్ అని రష్మి చెబుతుంది. 13 సంవత్సరాల నుంచి వచ్చీ రాని తెలుగు మాట్లాడుతున్న నిన్నే భరిస్తున్నాం.. ఇదో లెక్క అని సెటైర్లు వేస్తుంది ఆ అమ్మాయి. దాంతో రష్మి నవ్వేస్తుంది. ఆ తర్వాత రాకింగ్ రాకేష్- రోహిణిలు వస్తారు. మా టెన్త్ క్లాస్‌మేట్స్ అందరం గెట్ టూ గెదర్‌కి వెళ్తున్నామని రోహిణి చెప్పడంతో రాకేష్ నేను కూడా వస్తానని చెబుతాడు. అక్కడ అందరూ రోహిణితో క్లోజ్‌గా ఉండం చూసిన రాకేష్ మండిపడతాడు.

మరో స్కిట్‌లో సుధాకర్- చంటిలు ఎంట్రీ ఇస్తారు. ఔను వాళ్లిద్దరూ సినిమా కాన్సెప్ట్ మాదిరిగా ఒకే రూమ్‌ని రాత్రి ఒకరికి, పగలు మరొకరికి అద్దెకు ఇచ్చి ప్రవీణ్‌ని, చంటిని మోసం చేస్తాడు చంటి. ఆ వెంటనే పండు- వర్షలు మంచి పాటతో వస్తారు. ఇంతలో అజహర్ వచ్చి నాకొక అమ్మాయి బాగా నచ్చిందని ఇంటికి తీసుకొచ్చి చెబుతాడు. ఆ అమ్మాయి ముఖం చూడగానే కాంతం అని గట్టిగా అరుస్తాడు పండు. ఆవిడ నీ పిన్ని అని పండు చెప్పడంతో పండు షాక్ అవుతాడు. ఇదంతా చూసిన వర్ష.. ఎవరది అంటూ మండిపడుతుంది. ఇది అన్ ఫెయిర్ అని వర్ష చెప్పగా.. అది అన్‌ఫెయిర్ కాదు, అఫైర్ అని అజహర్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఫేక్ లవర్‌ని ఆటో రాంప్రసాద్ ఎలా పట్టుకున్నాడు? ఇంట్లో తిష్టవేసిన చుట్టాల్ని ఫైమా ఎలా బయటికి పంపేసింది? రోహిణి క్లాస్‌మేట్స్ వల్ల రాకేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చంటి చేసిన మోసానికి ప్రవీణ్, సుధాకర్‌లు ఎలా బుద్ధి చెప్పారు? పండు అఫైర్ల గురించి వర్షకి తెలిశాయా? లేదా అన్నది తెలియాలంటే మార్చి 20, 21వ తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ను చూడాల్సిందే.

Read more about: jabardasth rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X