నా జీవితంపై మీ పెత్తనమేంటీ? నటిపై యాంకర్ రష్మీ గౌతమ్ సీరియస్

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

తొలుత బుల్లెట్ భాస్కర్, ఫైమా, షేకింగ్ శేషులు ఎంట్రీ ఇచ్చారు. ఫైమాతో భాస్కర్ రొమాన్స్ చేస్తుండగా అతని భార్య చూసి కేకలు వేస్తుంది. మీరు మీరు లేడీస్ కాబట్టి మీరే చూసుకోండి అని తప్పించుకుంటాడు భాస్కర్. దాంతో ఫైమా వెళ్లి నీ మొగుడిని నేను కొనుక్కుంటున్నానని సెటిల్ చేసుకుంటుంది. ఆ తర్వాత పొట్టి నరేష్ వచ్చి... నీ మాజీ భార్యకి ఫ్రెష్ హజ్బెండ్‌నని చెప్పి నెల రోజుల కింద చీర పిన్ను ఎక్కడో పెట్టారంట అని అడుగుతాడు. డ్రాయర్‌లో ఉంది వెళ్లి తీసుకోమని భాస్కర్ చెప్పగా.. గుచ్చుకోవడం లేదా అని పంచ్ వేస్తాడు నరేష్. నా తలలో క్లిప్ ఎక్కడుందని ఫైమా అడగ్గా.. నాకు గుర్తులేదని భాస్కర్ చెప్పడంతో అతనికి బడిత పూజ చేస్తుంది.

Jabardasth Latest Promo Bullet Bhaskar Faima Rashmi Gautam Comedy Skits Go Viral

మరో స్కిట్‌లో కమెడియన్ వచ్చి రష్మి గౌతమ్‌ని బేబీ అని పిలుస్తాడు. నన్ను బేబీ అంటావా? నువ్వే 9 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నట్లుగా ఉన్నావని పంచ్ విసురుతుంది. మా పొలాల్లో లేడీస్ మాట్లాడుకునే ముచ్చట్లు సరదాగా ఉంటాయని ఆ వ్యక్తి చెబుతాడు. ముగ్గురు మహిళలు పొలంలో నాట్లు వేస్తూ.. రష్మి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మా కుర్రాడు ఉన్నాడు.. వాడిని చేసుకో ఏం పని చేయనక్కర్లేదు. పొద్దున్నే పేడ తీసి పిడకలు కొట్టి బర్రెపాలు పిండితే చాలని చెబుతుంది ఆ అమ్మాయి. దాంతో రష్మి ఆ కమెడియన్‌పై సీరియస్ అవుతూ.. మీరు కింద ఉన్నది పీకండి అంటూ వార్నింగ్ ఇస్తుంది.

తర్వాత రాకింగ్ రాకేష్- రోహిణి రెడ్డిలు భార్యాభర్తలుగా ఎంట్రీ ఇచ్చారు. మీరు నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.. నన్ను కూడా మీ అంత గొప్ప నటిని చేయమని రోహిణి అడుగుతుంది. నటనలో నవరసాలు ఉంటాయని రాకేష్ చెప్పగా.. మీలో ఒక్క నీరసం మాత్రమే ఉందని సెటైర్లు వేస్తుంది. ఓ వ్యక్తి చనిపోవడంతో ఇద్దరూ పరామర్శించడానికి వెళ్తారు.. శవం దగ్గర దు:ఖం కాకుండా శృంగార రసం పలికించడంతో అంతా నవ్వేస్తారు. రోహిణి బలహీనతను అడ్డుపెట్టుకుని ఓ బిచ్చగాడు ఆడుకుంటాడు.

మరో స్కిట్‌లో చలాకీ చంటి, సుధాకర్, పటాస్ ప్రవీణ్‌లు బ్యాంక్ ఎంప్లాయిస్- లోన్ స్కిట్‌తో నవ్వించారు. ఆ వెంటనే సన్నీ, పొట్టి నరేష్‌, బుల్లెట్ భాస్కర్‌, ఆటో రాంప్రసాద్‌లతో కలిసి జడ్జి ఖుష్బూ ఓ స్కిట్‌లో పాల్గొన్నారు. ఖుష్బూ తమిళంలో చెప్పే డైలాగ్స్ అర్ధంకాక భాస్కర్ ఏవేవో తమిళ మాటలు మాట్లాడటంతో ఖుష్బూ సహా అంతా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఫైమా బారి నుంచి బుల్లెట్ భాస్కర్ ఎలా తప్పించుకున్నాడు? రష్మి గౌతమ్ వార్నింగ్‌కి ఆ లేడీ కమెడియన్ ఎలాంటి రిప్లయ్ ఇచ్చింది? రోహిణి నవరసాలతో అద్భుతమైన నటిగా మారిందా? సుధాకర్‌ను చలాకీ చంటి ఎలా ఆడుకున్నాడు? ఖుష్బూ స్కిట్ ఎలా ఉంది? అనేది తెలియాలంటే ఏప్రిల్ 10, 11 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం చూడాల్సిందే.

Read more about: jabardasth rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X