చీకట్లో కొవ్వొత్తి ఆర్పేశా... పెళ్లి కాకుండానే ఆమె అలా గర్భవతిగా

Photo Courtesy: ETV Jabardasth

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

గత కొన్నిరోజులుగా కంటెస్టెంట్స్‌కు బంపరాఫర్లు ఇస్తున్న నాగబాబు.. మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి 10 స్కిట్‌లలో హయ్యెస్ట్ ఎవరు కొడతారో వారికి 50 వేలు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దొరబాబు, రాంప్రసాద్, సన్నీలు చేతికి ఉంగరాలు, మెడలో గోల్డ్ చైన్‌లతో ఎంట్రీ ఇస్తారు. మా తాత జమీందార్ గారింట్లో పనిచేశాడు. ఒకసారి జమీందార్ గారు పని మీద వెళితే.. అప్పుడు మా తాత వాళ్లవిడని గట్టిగా పట్టుకున్నాడు గోల్డ్ ఫ్యామిలీ అయిపోయిందని దొరబాబు చెప్పడంతో అంతా నవ్వేశారు. మా షూ లేస్‌లు కూడా నెక్లెస్‌లే, వాడి డ్రాయర్ కూడా గోల్డేనని తన గురించి తన ఫ్రెండ్స్ గురించి గొప్పలు చెబుతాడు రాంప్రసాద్. వీళ్ల గుట్టువిప్పడానికి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చిన ధనరాజ్.. ఒక్కొక్కడిని చితకబాదడంతో అంతా నవ్వేశారు.

Jabardasth Latest Promo Dhanraj Comedy Ramprasad Gold Scam Skit amp amp Bullet Bhaskar Punches Go Viral

Photo Courtesy: ETV Jabardasth

అనంతరం అప్పారావు, రాఘవ, మోహనలు వస్తారు. మోహనని చూసి పారు నీకు పెళ్లయిపోయిందా అని షాక్ అవుతాడు. ఈ మధ్యే చేసుకున్నానని మోహన చెబుతుంది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తన బర్త్ డేకి ఒకసారి కొవ్వొత్తి గుచ్చాం.. ఒక్కసారిగా ఊదేసింది, దాంతో ఇల్లంతా చీకటి. వీరి మాటలు వింటూ చీకటిలో ఏదో అయ్యిందని నాది 6 వేలు పందెం, వాడికి అంతసీన్ లేదని నాది 7 వేలు పందెం, ఉందని చెప్పి 8 వేలు పందెమని పందాలు కాస్తుండటంతో వాళ్లపై అప్పారావు మండిపడతాడు.

ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్- పొట్టి నరేష్‌లు 1980ల నాటి గెటప్స్‌తో వస్తారు. ప్రేమలు కాఫీ షాపులో చిగురిస్తాయి.. వైన్ షాపులో ఎండ్ అవుతాయని భాస్కర్ అంటాడు. పొట్టి నరేష్ ఒకమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండగా.. పోలీసులు వచ్చి యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. జైలు నుంచి విడుదలైన పొట్టి నరేష్.. మనం పెళ్లి చేసుకుందామని రోజాని అడుగుతాడు. నేను రాలేనని చెప్పి ఆమె కూతురిని పిలవంతో నరేష్ షాక్ అవుతాడు. తన బాధని భాస్కర్‌తో చెబుదామని వస్తుండగా అతనిని డాడీ అని పాప పిలవడంతో నరేష్‌కు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఫైమాతో నరేష్ చెప్పగా.. ఆమె తన కొడుకుని పిలుస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా అని నరేష్ అడగ్గా.. పెళ్లి ఒక్కటే చేసుకోలేదని భాస్కర్‌తో ఏం జరిగిందో చెబుతుంది.

తర్వాత రాకింగ్ రాకేష్, రోహిణిలు వస్తారు. ఒక్కసారి మావయ్య అని పిలవమని బాలకృష్ణ స్టైల్‌లో ప్రసాద్ అడగ్గా.. రోహిణి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నవ్వు తెప్పించాయి. ఇంతలో రాకేష్ వచ్చి రోహిణిని కొడతాడు. నీ కంటే ఆ అమ్మాయి బాగా పర్ఫార్మెన్స్ చేసిందని కొట్టేస్తావా? నాకు కూడా కొట్టాలని అనిపించింది నేను కొట్టేశానా అనడంతో అంతా నవ్వేస్తారు. మరో స్కిట్‌లో 20 పైసలు ఇస్తేనే ఫుల్ బాటిల్ ఇస్తానని వైన్ షాప్ వాడు చెప్పడంతో దాని కోసం ధనరాజ్ తలబాదుకుంటాడు. నాకు ఓ అమ్మాయిని సెట్ చేస్తే నీకు 20 పైసలు ఇస్తానిన ఒకతను చెప్పడంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి అడగ్గా.. నాకు పెళ్లయిపోయిందని ఆ అమ్మాయి చెప్పడంతో ధనరాజ్ షాక్ అవుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. రాంప్రసాద్ అండ్ గ్యాంగ్ గోల్డ్ మోసాన్ని ధనరాజ్ ఎలా బయటపెట్టాడు? రాకేష్ చిన్నప్పటి లవ్ స్టోరీ బయటపడిందా? బుల్లెట్ భాస్కర్‌కి పొట్టి నరేష్ బుద్ధి చెప్పాడా? ధనరాజ్ తనకు కావాల్సిన 20న పైసలు సంపాదించాడా? లేదా తెలియాలంటే ఈ నెల 15, 16 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Read more about: jabardasth nagababu rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X