రష్మి లవ్ ఫెయిల్యూర్... అతని ట్రాప్‌లో అలా ఇరుక్కున్న స్టార్ యాంకర్

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

భర్తల సేఫ్టీ హాస్టల్ అంటూ ఆటో రాంప్రసాద్ ముందుగా ఎంట్రీ ఇస్తాడు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. కానీ కరెంట్ బిల్ కట్టేది మాత్రం మనం నాకు అర్ధం కావడం లేదు అంటాడు రాంప్రసాద్. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు.. మరి వీడు పచ్చి తాగుబోతు అయిపోయాడు. మరి అదెందుకు తీసుకోవడం లేదని అడుగుతాడు ప్రసాద్. ఇంతలో ఒకామె వచ్చి వాళ్ల భర్తను కొడుతుంటే భర్తలంతా కలిసి ఆమెను చితకబాదుతారు. ఆ వెంటనే రోహిణి రెడ్డి వచ్చి.. ఇక్కడ భర్తల హాస్టల్ పెట్టిందెవరు? ఆడాళ్ల సంగతి మీకు తెలియదు? ఆడాళ్లంటే భర్తలో సగమని అంటుంది. మరి నువ్వేంటీ ఫుల్‌గా ఉన్నావని రాంప్రసాద్ సెటైర్లు వేయడంతో అంతా నవ్వేస్తారు.

Jabardasth Latest Promo Hilarious Skits Rohini Punch Dialogues amp amp Highlights of This Week

ఆ వెంటనే తల్లీపెళ్లాం మధ్య ఇరుక్కుపోయి, తన్నులు తినే భర్త కాన్సెప్ట్‌తో కొత్త టీమ్ ఓ స్కిట్ చేస్తుంది. ఇందాక రష్మి దగ్గరికొచ్చి మూతిలో మూతిపెట్టి నీ పెళ్లాం నాకేంటే అందంగా ఎలా ఉందని అడిగిందని చెబుతాడు. ఆ మాటలతో రష్మి సీరియస్ అయి కర్ర తీసుకుని ఆ కంటెస్టెంట్‌ని కొడుతుంది. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా? నేనంటే ఇష్టమా అని భార్య అడగ్గా.. నువ్వంటేనే ఇష్టమని ఆ వ్యక్తి చెప్పగా వెనుక నుంచి తల్లి గెటప్ వేసిన ఆవిడ తంతుంది. నువ్వు కారు నడుపుకుంటూ వెళ్తున్నావు.. ఎదురుగా నీ పెళ్లాం, నీ తల్లి ఉన్నారు. నువ్వు ఎవరిని గుద్దుతావు? ఎవరిని కాపాడతావని అడగ్గా? నేను పెళ్లాన్నే గుద్ధుతానని ఆ వ్యక్తి చెప్పడంతో భార్య గెటప్‌లో ఉన్నామె తంతుంది. నువ్వు కారుకి బ్రేక్‌లు వేసి ఇద్దరినీ కాపాడతానని చెప్పకుండా డైరెక్ట్‌గా పెళ్లాన్నే గుద్ధుతానని ఎందుకు అన్నావు? నీ మనసులో నన్ను చంపాలని ఉందని చెబుతూ చితకబాదుతుంది.

ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ - రష్మిలు కలిసి డ్యాన్స్ వేసి ఎంట్రీ ఇస్తారు. ప్రేమలో ఓడిపోతే గొప్పోళ్లు అవుతారట. అది నిజమేనా అని రష్మీ అడుగుతుంది. అయితే నువ్వు అయ్యావా? నువ్వు అయితే అయినట్లే లేదంటే లేదు అని భాస్కర్ చెప్పడంతో రష్మి షాక్ అవుతుంది. బుల్లెట్ భాస్కర్- ఫైమాలు కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల మాదిరిగా ఫస్ట్ నైట్ కోసం తిప్పలు పడుతుంటారు. భాస్కర్‌కు వాళ్ల గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఫైమా రగిలిపోతుంటుంది. పొట్టి నరేష్‌కు వాళ్లవిడ హగ్ ఇచ్చి, ముద్దులు ఇవ్వడంతో నాకు కూడా అలాగే కావాలని అడుగుతుంది ఫైమా. సరిగా ఇవ్వడం లేదని మారాం చేయడంతో భాస్కర్ కోప్పడతాడు.

మరో స్కిట్‌లో రాకెట్ రాఘవ వస్తాడు.. నా ఫోన్ ఇంట్లో మరిచిపోయాను. పాస్‌వర్డ్ మా ఆవిడికి తెలుసు అని రాఘవ భయపడతాడు. రాఘవని కాపాడటానికి అతని ఫ్రెండ్‌గా అజహర్ వెళ్లి వివరాలు కనుక్కుంటాడు. వస్తూ వస్తూ ఆంటీ అని పిలవడంతో రాఘవ భార్య గెటప్‌లో ఉన్న కమెడియన్ నన్ను ఆంటీ అని పిలుస్తావా అంటూ సీరియస్ అవుతుంది. నేను అంత ముదురుగా ఉన్నానా? ప్రతి ఒక్కరికి ఆంటీగా కనిపిస్తున్నానా అని చితక్కొడుతుంది. మరో స్కిట్‌లో ప్రెసిడెంట్ కూతురిని లేపుకొచ్చానని తండ్రికి చెబుతాడు. ఆ మాటలతో కంటెస్టెంట్‌ తండ్రిగా ఉన్న వ్యక్తి గుండెలు పట్టుకుంటాడు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భార్యల బారి నుంచి ఆటో రాంప్రసాద్ భర్తలను కాపాడాడా? లేదా? తల్లి పెళ్లాం మధ్య తగవు ఎలా పరిష్కారమైంది? బుల్లెట్ భాస్కర్‌కి, ఫైమాకి మధ్య రాజీ కుదిరిందా? లేదా? రాఘవ తన గుట్టు బయటపడకుండా ఫోన్ తీసుకొచ్చాడా లేదా? తెలియాలంటే ఏప్రిల్ 17, 18 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం చూసేయాల్సిందే.

Read more about: jabardasth rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X