రష్మి గౌతమ్ రెమ్యునరేషన్‌పై రోహిణి దారుణంగా... జబర్దస్త్ కంటే నీకు టీ దుకాణమే బెటర్ అంటూ..
తెలుగు ప్రేక్షకులకు దాదాపు 12 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
కొన్నిరోజులుగా మన జబర్దస్త్‌లో కొత్త టీమ్‌ల వల్ల కళ పెరిగిందని యాంకర్ రష్మీ గౌతమ్ ప్రోమో స్టార్టింగ్‌లో తెలిపారు. అలాగే ఆ టీమ్‌లు ఏవో కూడా ఆమె బయటపెట్టారు. తాజాగా ఈ వారం నుంచి మరో కొత్త టీమ్ శ్రీకాకుళం నుంచి వచ్చినట్లు రష్మి తెలిపారు. తండ్రి కొడుకులు-పెళ్లి చూపులు కాన్సెప్ట్‌తో ఈ కొత్త టీమ్ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లిచూపులకు టైం అయితే ఇప్పటి వరకు ఏం చేస్తున్నావని తండ్రి అడుగుతాడు. కోళ్లకు మేత వేస్తున్నానని కొడుకు చెప్పడంతో తండ్రి మండిపడతాడు.

వెళ్లే పని సక్రమంగా జరగాలని మీ అమ్మకు దండం పెట్టుకోమని చెప్పగా.. పెళ్లి కొడుకు రష్మికి దండం పెడతాడు. ఆవిడ మీ అమ్మ కాదురా.. అమ్మమ్మ అవుతుందని చెప్పడంతో రష్మి సీరియస్‌గా చూస్తుంది. నాకు ఒక్కగానొక్క కూతురు లేక లేక పుట్టిందని పెళ్లి కూతురు తల్లి చెబుతుంది. అంటే మీ ఆయన లేనప్పుడు పుట్టిందా అని పెళ్లి కొడుకు అనడంతో అంతా నవ్వేస్తారు. మా వాడు కూడా చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడని తండ్రి చెప్పగా.. పైవాడు అంటే పైన రెంట్‌కి ఉన్న రమేశేనా అనడంతో అతను షాక్ అవుతాడు. అమ్మాయిని ఏమైనా అడుగుతావా? అని అడగ్గా.. ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. వంటల్లో అంటూ కవర్ చేస్తాడు.
ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్, ఫైమా, శాంతి స్వరూప్‌లు స్కిట్ చేశారు. నాకు యాక్సిడెంట్ అయ్యింది.. చచ్చపోతాను, నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను బతికించమని ఒకతను తన ఫ్రెండ్ అయిన మాంత్రికుడిని అడుగుతాడు. దీనికి ఒకటే మార్గం ఉంది.. నీ శరీరంలో ఉన్న ఆత్మని ఇంకొక బాడీలో ప్రవేశపెడితే నువ్వు హ్యాపీగా బతికేయొచ్చని చెప్పి ఆ ప్రక్రియ చేయగానే బుల్లెట్ భాస్కర్ లేస్తాడు. వెంటనే పెళ్లాం బిడ్డల్ని పిలిపించమని చెప్పగా.. ఫైమా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈరోజు నుంచి కష్టపడి సంపాదించి మీ అందరినీ పోషిస్తానని భాస్కర్ వెళ్తుండగా.. ఒక కిడ్నీతో ఏం పనిచేస్తారని ఫైమా చెప్పడంతో భాస్కర్ షాక్ అవుతాడు. అయితే బరువైన పనులు కాకుండా చిన్న చిన్న పనులు చేసి సంపాదించుకుని వస్తానని అంటాడు. అయితే వెళ్లేటప్పుడు తాళాల గుత్తిపట్టుకెళ్లు .. నీకు అసలే ఫిట్స్ అంటాడు శాంతి. భాస్కర్ ఆ మాటలకు కోప్పడగా.. అసలే మీ గుండెకు స్టంట్ వేశారని అంటుంది ఫైమా. చూడటానికి బాగానే ఉంటావు.. కానీ లోపల ఏం లేవని శాంతి అనగా అంతా నవ్వేస్తారు.
ఆ తర్వాత ఆటో రాంప్రసాద్- దొరబాబులు ఎంట్రీ ఇస్తారు. మీ నాన్నగారు పోతూ పోతూ మొత్తం ఆస్తి కొడుక్కే దక్కాలని వీలునామా రాశాడని రాంప్రసాద్‌తో చెబుతాడు లాయర్. ఇంతలో పనివాడు గెటప్‌లో దొరబాబు రావడంతో మీ నాన్నగారి పోలికలు ఇతనికి ఎలా వచ్చాయని అడుగుతాడు. అదొక వర్షం కురిసిన రాత్రి అని పనిమనుషులు చెబుతుండగా వాళ్లపై కోప్పడతాడు రాంప్రసాద్. వచ్చిన ఆస్తిలో 10 కోట్లు నీకు, 10 కోట్ల నాకు అని ఆఫర్ ఇస్తాడు. ఈయన సరే మరి మిగత వారికి ఏమిస్తారని పనివాళ్లు అడగ్గా.. ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి షాక్ అవుతాడు రాంప్రసాద్.
మరో స్కిట్‌లో రాకింగ్ రాకేష్- రోహిణిలు వస్తారు. పొరిగింటి ఆవిడ వచ్చి మీ ఆయన ఏం చేస్తాడు? శాలరీ ఎంత? అని అడుగుతుంది. మా ఆయన సాఫ్ట్‌వేర్ 50 థౌజండ్ పర్ మంత్ అని, మరి మీ ఆయన ఏం చేస్తాడని అడుగుతుంది రోహిణి. మా ఆయన టీషాప్ నడుపుకుంటాడు.. రోజుకు 10 వేలు అని ఆవిడ చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది. రోజుకు పదివేలు అంటే నెలకు 3 లక్షల రూపాయలు అని ఆలోచిస్తూ.. వెంటనే రష్మి దగ్గరికి వెళ్లి శ్రీదేవి, జబర్దస్త్ కలిపినా నీకు అంత రాదేమో? ఎందుకు టీ కొట్టు పెట్టుకోమని చెప్పడంతో రష్మి షాక్ అవుతుంది. ఆ వెంటనే రాకింగ్ రాకేష్‌ని సాఫ్ట్‌వేర్ జాబ్ మాన్పించి టీ కొట్టు పెట్టిస్తుంది రోహిణి.
ఇంకో ఆవిడ రావడంతో మీ ఆయన ఏం చేస్తాడని అడుగుతుంది రోహిణి. మా ఆయన వైన్ షాప్ దగ్గర పల్లిలు, బజ్జీలు అమ్ముతాడు.. నెలకు 5 లక్షలు సంపాదిస్తాడని చెబుతుంది. దాంతో పల్లిలు అమ్ముకుందామని తీసుకెళ్తుంది రోహిణి. ఇంతలో ఓ బిచ్చగాడి ఇంట్లో రైడ్ చేసిన ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రైడ్ చేసింది. 25 కోట్లకు పైగా నల్లధనం పట్టుకుందని చెప్పడంతో రాకేష్ గెటప్ మార్చేసి బిచ్చగాడిని చేయడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. పెళ్లికొడుక్కి పెళ్లి అయ్యిందా? లేదా? ఆస్తి తగాదాని రాంప్రసాద్ ఎలా పరిష్కరించుకున్నాడు? భార్య బారి నుంచి రాకేష్ ఎలా తప్పించున్నాడు. తెలియాలంటే ఫిబ్రవరి 6, 7 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ను చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











