ఆ నటుడి స్పర్శతో అలాంటి కోరికలు... తాపం తట్టుకోలేక..
Photo Courtesy: MallemalaTV
తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
ప్రోమో స్టార్టింగ్‌లోనే కంటెస్టెంట్స్‌ని ఎంకరేజ్ చేయడానికి జడ్జి నాగబాబు ఆఫర్ ప్రకటించారు. బెస్ట్ పర్ఫార్మర్‌కి 5 వేల రూపాయలు, బెస్జ్ స్కిట్‌కు 5 వేల రూపాయలు అని అనౌన్స్ చేయగా.. మరి బెస్ట్ జడ్జిమెంట్‌కి ఏం లేదా అని ఇంద్రజ అడగటంతో అందరూ నవ్వేస్తారు. ఆ వెంటనే కొత్త టీమ్ ఎంట్రీ ఇచ్చి భార్యాభర్తలుగా నటిస్తారు. మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం కదా? మొట్టమొదటి సారి మనల్ని రమ్మని మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ వెళ్తారు. అయితే భర్తకు రేచీకటి ఉండటంతో అత్తగారింట్లో కవర్ చేయలేక ఇబ్బందిపడతాడు. మావయ్య గారిని ఆశీర్వదించమని అత్తగారి కాళ్ల మీద పడతాడు. భోజనాల దగ్గర అన్ని వెరైటీలు వడ్డించుకోగా.. కింద ప్లేట్ పెట్టుకోలేదని మామగారికి దొరికిపోతాడు.

Photo Courtesy: MallemalaTV
ఆ వెంటనే శాంతి స్వరూప్, ఫైమా, పొట్టి నరేష్ ఇతర లేడీస్ అందరూ కలిసి కార్తీక దీపం సాంగ్‌కి దీపాలు వదులుతారు. శాంతి స్వరూప్‌ని పెద్ద ప్రతివత అంటూ పంచ్ వేస్తాడు నాగబాబు. నాన్నగారు రోజూ తాగి వస్తుంటే ఒక్కరోజూ కూడా తాగిరావొద్దని ఎందుకు చెప్పలేదని ఫైమా అడగ్గా.. అప్పుడు నేను తాగిన విషయం బయటపడుతుందని శాంతి అనడంతో అంతా నవ్వేస్తారు. బుల్లెట్ భాస్కర్ వచ్చి తినడానికి ఏం లేదా అనడంతో నేనున్నాను కదా? చకచకా వంట చేసేస్తానని కూరగాయలు కట్ చేసుకుంటూ లేడీ గెటప్‌లో ఉన్న పొట్టి నరేష్ చేయి కోసుకుంటాడు. దాంతో భాస్కర్ వెళ్లి తన నోటితో నరేష్ వ్రేలుని పెట్టుకుని రక్తం లాగేస్తాడు. ఆ స్పర్శ తట్టుకోలేక పొట్ట నరేష్ మూడు బిందెల చన్నీటితో తడుపుకుంటాడు. దానిపై జడ్జిమెంట్ చెబుతూ నరేష్ గాడు విరహం తట్టుకోలేక 3 బిందెల స్నానం చేశాడని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.
తర్వాత ఆటో రాంప్రసాద్, దొరబాబు, మరో కమెడియన్‌లు భార్యలుగా ఎంట్రీ ఇస్తారు. ఇంతలో సన్నీ వచ్చి మా అసిస్టెంట్ చిన్న మిస్టేక్ చేశాడని.. ఒకరి భార్యను మరొకరితో సెట్ చేశాడని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. సన్నీ ఎవరి భార్యను వాళ్లతో కలపగా.. దొరబాబు మరొకరి భార్యకు లైన్ వేస్తాడు. ఆ వెంటనే పొట్టి నరేష్, రాకెట్ రాఘవలు మరో స్కిట్‌లో వస్తారు. నా గర్ల్ ఫ్రెండ్‌కి పెళ్లి జరుగుతుందని దానిని ఎలాగైనా ఆపాలని పొట్టి నరేష్ అడగటంతో పొట్టి నరేష్‌కి ఒక బ్యాగ్‌లో కుక్కేసి పెళ్లి కూతురి పక్కనే పెట్టి.. టైం చేసి అమ్మాయి మెడలో తాళి కట్టేయమని చెబుతాడు రాఘవ. పెళ్లి మంటపంలో అమ్మాయి తరపువాళ్లకు దొరక్కుండా చేసే క్రమంలో వీరు చేసే కామెడీ అలరించింది.
ఇక చాలారోజుల తర్వాత ధనాధన్ ధనరాజ్ జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాకింగ్ రాకేష్, రోహిణిలతో కలిసి స్కిట్ చేశాడు. మేం తిరుపతికి వెళ్లాలని రాకేష్, రోహిణిలు వస్తారు.. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏమైందని ధనరాజ్ అడగ్గా.. మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదని రాకేష్ చెబుతాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆ పెద్దావిడని అంత కష్టపెడతారా అంటూ ధనరాజ్ అనడంతో.. ఈ పిల్లతో పెళ్లికే పెద్దోళ్లు ఒప్పుకోలేదని అసలు విషయం చెబుతాడు రాకేష్. ఇక లేచిపోయిన వాళ్లని వెతుకుతూ ప్రసాద్ పోలీస్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చి ధనరాజ్‌ని చితకబాదుతాడు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాగబాబు అనౌన్స్ చేసిన ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారు? ఏ స్కిట్ పేలింది? అనేది తెలియాలంటే ఈ శుక్ర, శనివారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్ చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications