ఆ సీక్రెట్స్ బయటపెడితే మొగుళ్లకి గుండెపోటే.. దిమ్మతిరిగేలా నటి ఇంద్రజ కౌంటర్
గత కొన్నేళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్. ఎన్ని షోలు వచ్చినా తెలుగు నాట కామెడీ షోలలో జబర్దస్త్ టాప్‌లో కొనసాగుతోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా జబర్దస్త్ సరికొత్త పంచ్‌లు, కామెడీతో సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలా చేశారు? వారు విసిరిన పంచ్‌లు ఏంటీ? దానికి జడ్జిల రియాక్షన్ ఏంటీ? అనేది చూస్తే..
తొలుత పొట్టి నరేష్, శాంతి స్వరూప్ ఎంట్రీ ఇస్తారు. ఏ భర్త తన భార్యకి చెప్పలేని విషయం నేను చెబుతాను. రేపు నేను పోయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉండొద్దు, నీకంటూ ఒక తోడుని ఎవరినైనా చూసుకోమని నరేష్ చెబుతాడు. దానికి మీరు పోవడం ఎందుకండి అని శాంతి కౌంటర్ వేస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్ చేతిలో ఒక ఆయిల్ పెడతాడు అజహర్. దీనిని ఎవరైనా జడకు రాస్తే వాళ్లు నా మాటే వింటారు కదా అని అడుగుతాడు. ఇది రాస్తే 100 శాతం నిన్నే ప్రేమిస్తుందని చెబుతాడు అజహర్. మంచి టైమ్ చూసుకుని ఫైమాకు వెనుక నుంచి నూనె రాస్తాడు. నేను ఎక్కడికి వెళ్లనని భాస్కర్‌కి ఐ లవ్ యూ చెబుతుంది. బాత్రూమ్‌కి వెళ్లాలని అడిగినా ఫైమా వినిపించుకోకుండా అతుక్కుపోతుంది. తినడానికి ఏమైనా చేశావా అని అడగ్గా.. ఫ్రిజ్‌లో నరేష్ శవాన్ని ఉంచడంతో అంతా షాక్ అవుతారు.

అనంతరం ఆటో రాంప్రసాద్, దొరబాబులు ఓ స్కిట్ చేస్తారు. ఒకే అమ్మాయి ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించడాన్ని బేస్ చేసుకుని ఈ స్కిట్ చేసి నవ్వించారు. ఒకరు కనిపిస్తే ఇంకొకరిని అన్నయ్య అని పరిచయం చేస్తూ ఆ అమ్మాయి తప్పించుకుంటుంది. ఇక రోహిణి- పంచ్ ప్రసాద్ జోడీ ఈసారి వదిన మరిదిలుగా అలరించింది. పొద్దున్నే లేచి నీ ముఖం చూసే అలవాటు నాకుంది కదా అని ప్రసాద్ అనగా.. ఈ అలవాటు మార్చుకో నాయనా, రోజూ నీ ముఖం నేను చూడాల్సి వస్తోందని పంచ్ విసురుతుంది రోహిణి. పెళ్లిచూపులకు వెళ్లి అక్కడ ఇంగ్లీష్ వచ్చినట్లుగా రోహిణి బిల్డప్ ఇచ్చి దొరికిపోతుంది. పంచ్ ప్రసాద్, వినోదిని, తాగుబోతు రమేశ్‌లు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.
తర్వాత ధనరాజ్ తన ఫ్రెండ్‌తో ఎంట్రీ ఇస్తాడు. పొద్దున చికెన్ తింటుంటే పంటిలో చికెన్ ఇరుక్కుపోయింది టూత్ పిక్ కానీ పిన్నిసు కానీ ఇవ్వమని ఫ్రెండ్ అడగటంతో కాలి చెప్పుకు ఉన్న పిన్నిసుని తీసి ఇస్తాడు ధనరాజ్. తర్వాత పిన్నిసు ఇవ్వబోతుండగా.. నువ్వు నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసిన పిన్నిసుని నా చెప్పుకు పెట్టుకోనా అంటూ ధనరాజ్ సీరియస్ అవుతాడు. ఇద్దరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్లగా.. సుధాకర్ పెళ్లి కూతురిగా ఎంట్రీ ఇస్తాడు. మీ అమ్మాయిని డ్యాన్స్ చేయమని ఫ్రెండ్ చెప్పగా.. నిన్ను చెప్పు తీసుకుని కొడతా, ఆడపిల్ల అంటే పెళ్లిచూపుల్లో ప్రతిసారి పైకి లేచి డ్యాన్స్ చేయడమేనా? అమ్మాయిని కోటప్పకొండ తిరునాళ్లలో తిప్పుతావా అంటూ మండిపడతాడు ధనరాజ్.
చివరిలో రాకెట్ రాఘవ- మోహన వృద్ధుల గెటప్స్‌లో వస్తారు. నా పేరు మూర్తి.. షష్టిపూర్తి చేసుకుందామని అనుకుంటున్నానని చెబుతాడు. కాస్త నీరసంగా ఉందని చెప్పగా.. ఆ గూట్లో పెట్టిన పళ్లు తినమని చెబుతుంది భార్య. గూట్లో పళ్లు తినాలంటే ముందు నోట్లో పెళ్లు ఉండాలి కదా అని రాఘవ పంచ్ విసురుతాడు. షష్టిపూర్తి అంటే మనిద్దరమే చేసుకుంటే ఏం బాగుంటుంది.. మన క్లాస్‌మేట్స్‌ని పిలుద్దామని చెబుతాడు రాఘవ. సుశీల, శారద, చంద్రిక అని రాఘవ లిస్ట్ చదువుతుండగా.. వాళ్లు మాత్రమే కాదు నరేష్, సురేష్, మహేశ్ వీళ్లని కూడా పిలుద్దామని భార్య చెప్పడంతో ఎంతమంది మగాళ్ల పేర్లు చెబుతుందోనని సీరియస్ అవుతాడు. ఇంతలో జడ్జి ఇంద్రజ కలగజేసుకుని మీరు చెబితే లేనిది మేం చెబితే మాత్రం మీకు గుండెపోటు వచ్చిందా అని కౌంటర్ ఇవ్వడంతో రాఘవ సైలెంట్ అయిపోతాడు.
గెట్ టూ గెదర్ పెట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. అప్పట్లో మా ఆవిడకి ఎవరో లవ్ లెటర్ రాశారు, ఈరోజు ఉదయమే అది చీరలోంచి బయటపడింది. వాడెవడో తెలుసుకుని చంపేయాలని రాఘవ చెప్పగా.. రెండ్రోజులు ఆగితే వాడే చచ్చిపోతాడని ఫ్రెండ్ పంచ్ విసురడంతో అంతా నవ్వేస్తారు. తనకు తెచ్చిన జ్యూస్‌లో షుగర్ వేయలేదని భార్యను కొట్టడంతో మోహనను ఫ్రెండ్స్ అంతా దగ్గరికి తీసుకుని ఓదార్చడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఫైమా బారి నుంచి భాస్కర్ ఎలా తప్పించుకున్నాడు? మోసం చేసిన అమ్మాయిని రాంప్రసాద్, దొరబాబులు పట్టుకున్నారా? పంచ్ ప్రసాద్ పెళ్లి చూపుల్ని రోహిణి జరగనిచ్చిందా? తన భార్యకి లెటర్ రాసినవాడిని రాకెట్ రాఘవ పట్టుకున్నాడా? లేదా ఇవన్నీ తెలియాలంటే ఈ శుక్ర, శనివారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications



