నా బంగారంతో అలా ఎస్కేప్... స్టార్ డైరెక్టర్‌పై జబర్దస్త్ కమెడియన్ ఆరోపణలు
తెలుగు ప్రేక్షకులకు దాదాపు 12 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. ఈ వారం గెస్ట్‌గా దర్శకురాలు, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
కొత్త టాలెంట్‌ను యాంకరేజ్ చేసే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి కొత్త టీమ్‌కి అవకాశం కల్పించారు జబర్దస్త్ నిర్వాహకులు. ప్రోమో స్టార్టింగ్‌లోనే వాళ్లు ఎంట్రీ ఇస్తారు. అందులో ఒక అమ్మాయి వచ్చి... మేడం మీరు ఒక్క 3 నెలలు వేరే కంట్రీస్‌కు కాకుండా ఇండియాలోనే ఉండరా? అని ఖుష్బూని అడుగుతుంది. ఎందుకు అని జడ్జి అడగ్గా.. సమ్మర్ వస్తుంది కదా చందమామ దగ్గరగా ఉంటే చల్లగా ఉంటుందని బిస్కెట్లు వేస్తుంది. ఖుష్బూ పక్కనే ఉన్న కృష్ణ భగవాన్ నాకు బాగా చల్లగా ఉంది.. చలేస్తుందని వణికిపోతూ పంచ్ వేస్తాడు. ఆ వెంటనే కుర్చీలో కూర్చొన్న వ్యక్తే రష్మీగారు.. ఈ జబర్దస్త్ షోకు జూలియట్ అని అబ్బాయి అనగా.. మరి రొమియో ఎక్కడ అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు మనకెందుకు అని పంచ్ వేస్తాడు ఆ కుర్రాడు. మధ్యలో ఎవరి దారి వాళ్లు చూసుకోవడానికి నేనెమైనా సుధీర్‌తో ప్రయాణం చేస్తున్నానా? మా వాడితో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాను అంటుంది ఆ అమ్మాయి. ఆ ప్రయాణంలో ముందు ముందు నీకే తెలుస్తుందమ్మా అని రష్మి కౌంటర్ వేస్తుంది.

ఆ తర్వాత చలాకీ చంటి - సుధాకర్ టీమ్ ఎంట్రీ ఇస్తుంది. మీది బంగారం ఫ్యామిలీ, వీళ్లది వెండి ఫ్యామిలీ మీరు మీరు కలిస్తే సరిపోతుందని చంటితో ఓ వ్యక్తి అంటాడు. దానికి చంటి స్పందిస్తూ.. బాహుబలి సినిమా తెలుసు కదా? అందులో రాణా విగ్రహానికి వేసిన పూత మా బంగారమే అనడంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే ఫోన్ వచ్చినట్లుగా చేస్తూ.. ఏం మనిషివయ్యా నువ్వు, తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత లేదా నీకు అని తిడతాడు. దాంతో ఆ వ్యక్తి ఎవరు అని అడగ్గా.. ప్రశాంత్ నీల్ అని, కేజీఎఫ్ సినిమా కోసం బంగారం కావాలని అడిగాడు. 15 లారీలు బంగారం పంపించా, తిరిగి తేవడం లేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు చేసుకునే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌లో గోల్డ్ అంతా కూడా మాదేనని చంటీ అనడంతో అంతా షాక్ అవుతారు.
ఆ వెంటనే పటాస్ ఫైమా - బుల్లెట్ భాస్కర్‌లు ఓ విఫల ప్రేమకథ కాన్సెప్ట్‌తో వస్తారు. భాస్కర్‌ను ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయానని, ఆత్మగా నీ దగ్గరికి వచ్చానని చెబుతుంది. నీకు నాకు సంబంధం లేదు.. నువ్వు చచ్చిపోయాక నా మనసులో కూడా చచ్చిపోయావని ఫైమాతో పెళ్లయ్యిందని చెబుతాడు భాస్కర్. దాంతో ఆత్మ ఫైమాలో ప్రవేశించి భాస్కర్‌ను చితకబాదుతుంది. ఆ తర్వాత భాస్కర్‌లో దూరి ఫైమాని వాయించేస్తుంది. ఈ సందర్భంగా పాల గ్లాస్ ఎలా తీసుకురావాలో ఆడదానిలా వయ్యారాలు ఒలకబోస్తూ, తిప్పుకుంటూ నడుస్తూ భాస్కర్ కడుపుబ్బా నవ్వించాడు.
ఐశ్వర్య- పండుల స్కిట్‌లో ఐశ్వర్యకు యాక్సిడెంట్‌లో రెండు కళ్లు పోయాయని డాక్టర్‌గా ఉన్న లండన్ డ్రాయర్ చెబుతాడు. ఈ అమ్మాయికి యాక్సిడెంట్‌లో రెండు కళ్లు పోయాయంటా, మీ ఆవిడ కళ్లు ఆ అమ్మాయికి పెడితే చూసుకోవచ్చని అజహర్‌ని ఒప్పిస్తాడు. ఆపరేషన్ చేసి కళ్లు రాగానే ఐశ్వర్య వెళ్లి పండును పక్కకి తోసేసి అజహర్‌ను హగ్ చేసుకుంటుంది. వాడిని మొగుడు అంటోంది ఏమైందని పండు అడగ్గా.. ఆపరేషన్ చేసేటప్పుడు కనెక్షన్ మిస్ అయ్యానని చెబుతాడు లండన్ డ్రాయర్.
ఇక చివరిలో ఆటో రాంప్రసాద్, దొరబాబులతో కలిసి కృష్ణ భగవాన్ చేసిన స్కిట్ కూడా అదిరిపోయింది. ఏరా పనోడా గాడిదని వేసుకొచ్చావేంటీ అని అడుగుతాడు కృష్ణ భగవాన్. పనోడిని నేను కాదు ఆడు రాంప్రసాద్ చెప్పగా.. నేను అడిగింది కూడా పనోడినే అని తన మార్క్ పంచ్ వేస్తాడు కృష్ణభగవాన్. మీరు కూర్చొంటే మహేశ్ బాబులా ఉన్నారని రాంప్రసాద్ దగ్గర పనోడు డబ్బులు కొట్టేస్తాడు. అది చూసి కృష్ణ భగవాన్ పనోడు కూడా మీరు నడిచొస్తుంటే ప్రభాస్‌లా ఉన్నారని అంటాడు. నీ దగ్గర రెండు 500 రూపాయల నోట్లు ఉన్నాయా? అని తీసుకుని జేబులో పెట్టుకుంటాడు కృష్ణ భగవాన్. పొగిడితే పడిపోవడానికి నేను అతనిలా ఎదవని కాదని పంచ్ విసరడంతో అంతా పడిపడి నవ్వుతారు. మరి కొత్త అమ్మాయికి సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు వచ్చాయి? చలాకీ చంటి గోల్డ్‌ని ఆ డైరెక్టర్ తిరిగిచ్చాడా లేదా? దెయ్యం బారి నుంచి బుల్లెట్ భాస్కర్ తప్పించుకున్నాడా? ఐశ్యర్య కళ్ల ప్రాబ్లమ్ సెట్ అయ్యిందా? కృష్ణ భగవాన్ గొడవని ఎలా పరిష్కరించాడు తెలియాలంటే ఫిబ్రవరి 27, 28 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











