కమెడియన్ ధనరాజ్‌ నోటి దురుసు.. నాగబాబు 50 వేల జరిమానా

Photo Courtesy: ETV Telugu India

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి జబర్దస్త్ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ వీక్‌కు సంబంధించి ఈటీవీ ప్రోమో రిలీజ్ చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్స్ చేశారు? ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది ఏంటీ? నాగబాబు పంచ్‌లు, ఇంద్రజ సెటైర్లు ఇలా అన్నింటినీ పరిశీలిస్తే..

తొలుత తాగుబోతు రమేశ్, రోహిణి, వినోదినిలు ఎంట్రీ ఇస్తారు. నా చెల్లెలి పెళ్లికి వెళ్తున్నాను, మా ఆయనని ఓ కంట కనిపెడుతూ ఉండమని రోహిణికి చెప్పి వెళ్తుంది వినోదిని. ఇక అప్పటి నుంచి రమేశ్ స్నానం చేస్తున్నా, పళ్లు తోముతున్నా ప్రతి విషయాన్ని వినోదినికి చేరవేస్తుంది రోహిణి. ఇది చూసిన పంచ్ ప్రసాద్.. ఆ ఇంటి చుట్టూ తిరిగితే మనల్ని దొంగలు అనుకుంటారని అంటాడు. బాత్‌రూమ్‌లో ఎలాంటి టైల్స్ వేశాడో చూస్తున్నాను, లోపల వాళ్లాయన ఉన్నాడని రోహిణి చెప్పగానే ప్రసాద్ షాక్ అవుతాడు. రమేశ్‌ని ఫాలో చేస్తూ ఆఫీస్‌కి వెళ్లిన రోహిణి.. మీ ఆయన ఆఫీస్‌లో కాలు మీద కాలేశాడని చెబుతుంది. మరి నువ్వెక్కడ ఉన్నావని వినోదిని అడగ్గా.. కాలి కింద ఉన్నానని రోహిణి చెప్పగానే వినోదిని అవాక్కవుతుంది.

Jabardasth Latest Promo Nagababu Indraja Punches and Rohini Comedy Goes Viral

Photo Courtesy: ETV Telugu India

ఆ వెంటనే ఫైమా, బుల్లెట్ భాస్కర్‌లు ఎంట్రీ ఇస్తారు. మగాళ్లు ధైర్యవంతులా? ఆడవాళ్లు ధైర్యవంతులా అని ఫైమా ప్రశ్నించగా.. మగాళ్లకున్న ధైర్యం ఆడవాళ్లకు అస్సలు ఉండదు. మొగుడు కొడితే పెళ్లాలు ఇల్లు వదిలేసి వెళ్లిపోతారు, ఏ రోజైనా పెళ్లాం కొడితే మగాడు ఇల్లు వదిలి వెళ్లాడా ఒక్కరిని చెప్పమని అంటాడు భాస్కర్. ఎవరు చెప్పరు, ఎన్ని దెబ్బలైనా తింటాం, ధైర్యంగా ఉంటామని నాగబాబు సెటైర్ వేస్తాడు. ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఆడది ఉంటుందని ఫైమా చెప్పగా.. ప్రతి సంక నాకిపోయిన మగాడి వెనుక కూడా ఆడదే ఉంటుందని అంటాడు భాస్కర్.

అలాంటి మగాడి వెనుక ఆడది ఉండదు, ఆడాళ్లు ఉంటారు.. అంతమందిని పెట్టుకుంటే అలాగే అవుతారని ఇంద్రజ సెటైర్లు వేస్తుంది. ఇవాళ శోభనం చేసుకుందామని భాస్కర్ చెప్పగా.. కొత్తగా చేసుకోవడానికి ఏముందని, అయినా మనిద్దరికీ శోభనం జరిగిందని సమాజాన్ని నమ్మిస్తానని పూలు నలుపుకుని, జుట్టు చెరుపుకుంటుంది ఫైమా. శోభనం చేసుకోవాలంటే ఐదేళ్ల వరకు ఆగు, అప్పుడు దాని తాత చస్తాడు, వాడు చావగానే శోభనమని ఫైమా తల్లి చెబుతుంది. మా తాత చచ్చిపోయాక నా కడుపులోకి వస్తాడని అంటుంది ఫైమా.

అనంతరం మాకు అవమానం జరిగిందంటూ ధనరాజ్, సుధాకర్‌లు వస్తారు. మేం బాగా చేస్తే నవ్వాలని అనుకోవడం మీ స్వార్ధం.. మీరు నవ్వితే బాగుంటుందని అనుకోవడం మా స్వార్ధం. ఇలాంటి స్వార్ధపరుల కోసమా బాబుగారు మీరు 50 వేలు ఇస్తానంది అని ధనరాజ్ చెప్పడంతో ఆ 50 వేలు క్యాన్సిల్ అంటాడు నాగబాబు. తమకు భోజనాల దగ్గర తక్కువ వెరైటీలు వేశాడని అవమానం జరిగిందని ధనరాజ్ తన ఫ్రెండ్స్‌తో వెళ్లిపోతాడు. అది కూర కాదు... అందరూ నమిలి ఊసేసిన బొక్కలని ఓనర్ వచ్చి చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

ఆ వెంటనే రైజింగ్ రాజు, సన్నీ, రాంప్రసాద్‌లు ఎంట్రీ ఇస్తారు. నష్ట జాతకం అంటే ఏంటని రాజు అడగ్గా.. బాబుగారు రావడానికి ముందు వరుసగా స్కిట్స్ కొట్టి, ఆయన 50 వేలు అనౌన్స్ చేసిన తర్వాత ఒక్క స్కిట్ కూడా కొట్టకపోవడమే నష్ట జాతకం అంటాడు రాంప్రసాద్. ఆ తర్వాత రాంప్రసాద్ ఆస్తిని కొట్టేయడానికి ఒక పథకం వేస్తాడు రాజు. అమ్మానాన్నల గెటప్‌లో ఇద్దరినీ పంపించి ఆస్తి రాయించుకోమని చెబుతాడు. మరో స్కిట్‌లో కొత్త టీమ్.. అద్దె మొగుడు థీమ్‌లో నవ్వించే ప్రయత్నం చేసింది. ఇక చివరిలో ఫటా ఫటా ఫన్ రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్స్ తలకి హెల్మెట్ పెట్టి ఎవరు కొట్టారో చెప్పమని టాస్క్ ఇస్తారు జడ్జిలు నాగబాబు, ఇంద్రజ. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాగుబోతు రమేశ్‌ని రోహిణి పట్టుకుందా? ఫైమాతో బుల్లెట్ భాస్కర్ శోభనం జరిగిందా? నాగబాబును మెప్పించి ధనరాజ్ 50 వేలు తీసుకున్నాడా? రైజింగ్ రాజు కుట్ర నుంచి రాంప్రసాద్ ఎలా తప్పించుకున్నాడు? ఇదంతా తెలియాలంటే జూన్ 26, 27 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో చూసేయాల్సిందే.

Read more about: jabardasth nagababu indraja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X