జబర్దస్త్ నుంచి ఆమెను పంపేయండి... నాగబాబు రీ ఎంట్రీతో కమెడియన్ షాకింగ్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

కొన్నేళ్ల క్రితం జబర్దస్త్‌ను వీడి వెళ్లిన మెగా బ్రదర్ నాగబాబు తిరిగి జడ్జిగా రీ ఎంట్రీ ఇవ్వడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఒక లెక్క.. కానీ ఈవారం నుంచి మరో లెక్క. ది గ్రేట్ మెగా బ్రదర్.. నవ్వుల రారాజు, ది బాస్ ఈజ్ బ్యాక్ అని నాగబాబు గురించి రష్మి చెప్పగానే అంతా కేకలు, ఈలలు వేశారు. ఆ ఛైర్ మీద ఎంత మంది కూర్చొన్నా... ఆ ఛైర్ ఎప్పటికీ మీదేనని అంటుంది రష్మి. జబర్దస్త్‌కు నేను దూరంగా ఉన్నా.. కానీ చూడకుండా ఉండేవాడిని కాదు, ఒకసారి వీళ్లు సరిగా చేయకపోతే లొకేషన్‌కి వచ్చి కొట్టాలనిపిస్తుంది. కమెడియన్స్ లేకపోయినప్పుడు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్స్‌ని జబర్దస్త్ పంపిందని నాగబాబు చెప్పారు.

Jabardasth Latest Promo Nagababu Re-Entry Rowdy Rohini Hilarious Skits amp amp Punch Dialogues Go Viral

ఫస్ట్ బుల్లెట్ భాస్కర్- పటాస్ ఫైమాలు ఎంట్రీ ఇస్తారు. నీ ప్రేమలో పడి నేను పిచ్చిదానిని అయిపోయానని ఫైమా అనగా.. నేను మాత్రం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయ్యానా అని పంచ్ వేస్తాడు భాస్కర్. ఇద్దరూ కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి ఫైమా కోమాలోకి వెళ్తుంది. దాంతో తల్లి గెటప్‌లో ఉన్న శాంతి స్వరూప్.. భాస్కర్‌ను రెండో పెళ్లి చేసుకోమని చెబుతుంది. నన్నే మీ రాధగా ఊహించుకోమని రెండో భార్య చెబుతుంది. దాంతో ఇద్దరు పిల్లలు పుడతాడు. రాధ కోమాలోంచి బయటకొచ్చిందని డాక్టర్ చెప్పడంతో ఫైమాకి డౌట్ రాకుండా నాటకం ఆడతాడు భాస్కర్.

మరో స్కిట్‌లో రాకెట్ రాఘవ గాల్లో తేలినట్లుంది అంటూ పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తాడు. ఇంతలో డాక్టర్ వచ్చి నీకు కొత్త గుండె పెట్టాం.. ఇంకా కవర్ కూడా తీయలేదని చెబుతాడు. ఆ గుండె డొనేట్ చేసిన వాళ్లింటికి వెళ్తాడు రాఘవ. కొత్త ఇంజిన్‌ని తీసుకొచ్చి పాత డొక్కు ఇంజిన్‌కి పెడతాడా అంటూ రాఘవపై ఆ ఇంట్లో వాళ్లు సీరియస్ అవుతారు. మా బావకి గుండె అంటే చాలా ఇష్టం.. ఆ గుండె గురించి ఆలోచించి, ఆలోచించి బ్రెయిన్ డెడ్ అయి చచ్చిపోయాడని అంటాడు అజహర్.

ఇంతలో కొత్త టీమ్ నుంచి ఓ అమ్మాయి వచ్చి.. కొత్త కొత్త ముఖాలు, కొత్త కొత్త టీమ్‌లు, కొత్త కొత్త జడ్జిలు ఏందీ కథ అంటుంది. ఇంత మంది కొత్తోళ్ల మధ్యన పాత ముఖం నువ్వెందుకు అని పంచ్ వేస్తుంది. నేను ఒకరిని లవ్ చేశాను.. అతనిని తప్పించి ఎవరినీ పెళ్లి చేసుకోనని కూతురు చెప్పడంతో అల్లుడిని తీసుకురమ్మని చెబుతుంది తల్లి. పెళ్లికొడుకు తల్లిని చూసి ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ అని గుర్తుపడుతుంది తల్లి. దాంతో అంతా నవ్వేస్తారు.

మరో స్కిట్‌లో రాకింగ్ రాకేష్- రోహిణిలు వస్తారు. నా గురించి చాలా తక్కువ అంచనా వేశారు లోపల దాచాను అంటాడు రాకేష్. 13 సంవత్సరాల నుంచి చాలా దాచారు.. ఒక్కసారైనా బయటికి తీయండి అని రోహిణి అడుగుతుంది. స్కిట్‌లో పడుకోవాలని రాస్తాడో లేదో తెలియదు.. స్కిట్ పడుకోవాలని రాస్తాడో తెలియదని రోహిణి పంచ్‌లు వేస్తుంది. మీరు రెండో పెళ్లి చేసుకున్నట్లుగా కల వచ్చింది.. నిజమైపోయేలా ఉందని టెన్షన్ పడుతుంది. ఇంతలో రాకేష్ రెండో పెళ్లి చేసుకుని రావడంతో రోహిణి షాక్ అవుతుంది.

ఆ తర్వాత ఆటో రాంప్రసాద్, సన్నీ, దొరబాబులు ఫంక్షన్‌లకి చదివింపులతో చేసే కామెడీ నవ్వించింది. దొరబాబు ఫంక్షన్‌కి రావడంతో అప్పుడు నీకు 5 వేలు రాయించాను కదా? అది దాచుకుని 5 వేల మందిని పిలిచానని చెబుతాడు రాంప్రసాద్. అలాగే పిల్లాడికి స్కూల్ ఫీజు 5 వేలు కట్టానని పదే పదే 5 వేలు గుర్తుచేస్తాడు. ఒకరు రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ పంపించడంతో వాడు మారలేదంటూ మండిపడతాడు. నా చిన్నప్పటి నుంచి అది తిప్పి తిప్పి నాకే వచ్చిందని చెబుతాడు రాంప్రసాద్. దాంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. భాస్కర్ రెండో భార్య గురించి ఫైమా కనిపెట్టిందా లేదా? ప్రేమికులు ఒక్కటయ్యారా లేదా? రాఘవ గుండెకి ఏమైంది? రెండో పెళ్లి చేసుకున్న రాకేష్‌కి రోహిణి ఎలా బుద్ధి చెప్పింది? చదివింపులతో రాంప్రసాద్ ఎలాంటి కామెడీ చేశాడు? వీరిపై నాగబాబు పంచ్‌లు తెలియాలంటే ఏప్రిల్ 24, 25 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ చూడాల్సిందే.

Read more about: jabardasth nagababu rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X