ఆ నటి ట్రాప్‌లో ఇరుక్కున్న జబర్దస్త్ నటుడు... కక్కుర్తితో చిక్కుల్లో..

తెలుగు నాట స్టార్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్దస్త్. దాదాపు 13 ఏళ్లుగా నిర్విరామంగా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉందో ఎంతోమంది ప్రతిభావంతులు జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఎందరో యాంకర్లు, నటీనటులు, జడ్జిలు మారినా జబర్దస్త్ మాత్రం ఇంకా తన ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. మెగా బ్రదర్ నాగబాబు తిరిగి జడ్జిగా రావడంతో జబర్దస్త్‌కు కొత్త కళ వచ్చింది. ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుదలైంది. దీనిని పరిశీలిస్తే..

నాగబాబు రీ ఎంట్రీతో జబర్దస్త్‌కు మళ్లీ పూర్వ వైభవం కనిపిస్తోంది. పాత టీమ్ లీడర్స్, కమెడియన్లు ఒక్కొక్కరిగా మళ్లీ తిరిగి వస్తున్నారు. నాగబాబు కౌంటర్లతో మళ్లీ షోకి ఊపిరి పోసినట్లుగా అనిపిస్తోంది. ఈ వారం ప్రోమోలో హైపర్ ఆది, రైజింగ్ రాజులు కనిపించడం బుల్లితెరపై చర్చనీయాంశమైంది. ప్రోమోలో తొలుత ధనాధన్ ధన్‌రాజు వెరైటీ గెటప్, మాడ్యూలేషన్‌తో అలరించాడు. ఆ వెంటనే పొట్టి నరేష్ కొత్త అమ్మాయితో పెద్ద రాయుడు గెటప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఊరిలో 10 వైన్ షాపులు ఉన్నాయి కానీ.. ఒక్క ఆసుపత్రి కూడా ఎందుకు లేదని భార్య అడుగుతుంది.

Jabardasth Latest Promo Nagababu s Counter to Potti Naresh Goes Viral

దానికి పొట్టి నరేష్ సమాధానం ఇస్తూ.. ఆసుపత్రిలో మందులు రోజు రోజుకి విషంగా మారుతుంది. అదే వైన్ షాపులో మందులు రోజు గడుస్తున్న కొద్ది అమృతంలా మారుతుంది ఏమంటారు నాగబాబు గారు అని పొట్టి నరేష్ అడుగుతాడు. దానికి నాగబాబు సీరియస్ అవుతూ.. నాకు అలవాటు లేదు నీలాగా వెధవన్న వెధవ అంటూ కౌంటరిస్తాడు. దాంతో నాలుక కరచుకుంటాడు నరేష్. ఆ వెంటనే ఫైమా- పొట్టి నరేష్‌ల మధ్య లవ్ ట్రాక్ నవ్వు తెప్పించింది. ఫైమా అటూ ఇటూ తిరుగుతుండగా ఆమెకు ముల్లు గుచ్చుకుంటుంది. నాకు ముల్లు గుచ్చుకుంది బావగారు అని చెప్పగానే.. దానిని నోటితో తీసేస్తాడు నరేష్.

వెళ్లొస్తాను అని నరేష్ బయల్దేరుతుండగా.. మళ్లీ రావొద్దు బావగారు అంటుంది ఫైమా. ఆ మాటలతో షాకైన నరేష్ ఎందుకు? అని అడగ్గా.. ఎందుకంటే మీరు చేసినవన్నీ ఇందులో రికార్డ్ చేశా బావగారు అంటుంది ఫైమా. ఆ మాటలతో పొట్టి నరేష్ నోట్లో వెలక్కాయ పడినట్లుగా అవుతుంది. ఇప్పుడది పోలీసులకు చూపిస్తావా అని నరేష్ భయంతో అడుగుతాడు. నేను పోలీసులకు పంపను, మీ భార్యకు పంపితే చాలని అంటుంది. దాంతో అంత పనిచేయొద్దని నరేష్ కాళ్లా వేళ్లా పడతాడు.

ఇక చాలారోజుల తర్వాత రైజింగ్ రాజు ఎంట్రీ ఇస్తాడు. నేను రిజిస్ట్రార్ ఆఫీసర్‌ని అని పరిచయం చేసుకుంటాడు. హాస్పిటల్‌లో బెడ్ మీద నుంచి లేచి వచ్చినట్లున్నాడు నీరసంగా అంటూ నాగబాబు సెటైర్ వేయడంతో అంతా నవ్వేస్తారు. లవ్ మ్యారేజ్‌లు, లేచి పోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రుల్ని కాదని లవ్‌లు చేసుకుని.. చంపుకుంటున్నారు. అందుకే నా సర్వీసులో ఒక్క లవ్ మ్యారేజ్‌కి కూడా నేను అంగీకరించలేదు అంటాడు రాజు. అది చూసిన హైపర్ ఆది.. రాంప్రసాద్ అన్నా ఇప్పటి వరకు నా స్కిట్‌లో ఇంత లెంగ్తీ డైలాగ్ ఆయనతో చెప్పించలేదని అంటాడు.

ఇక చివరిలో నాగబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు హైపర్ ఆది. మరి నువ్వెప్పుడు వస్తావు జబర్దస్త్‌కి అని నాగబాబు అడగ్గా.. ఎవరైతే మిస్ అయ్యారో వీళ్లతో కాంబినేషన్స్ సెట్ చేసుకుని జూన్ నుంచి వచ్చేసేలా నేను ప్లాన్ చేసుకుంటానని ఆది చెప్పడంతో అంతా నవ్వేస్తారు. అయితే ప్రస్తుతం హైపర్ ఆదికి ఈటీవీలోనే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటికి అప్పుడే ఎండ్ కార్డ్ వేసి జబర్దస్త్‌లోకి రావడం అంత ఈజీ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read more about: jabardasth nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X