పడుకుందాం రా అని సిరి హన్మంతుతో పొట్టి నరేష్ అసభ్యంగా.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

జబర్దస్త్ .. ఇప్పుడంటే దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కానీ, ఒకప్పుడు ఈ షో వస్తుంది అంటే కుటుంబం మొత్తం టీవీకి అతుక్కుపోయేవారు. అసలు గురువారం ఈ షో చూడలేదంటే .. ఆరోజు పూర్తయ్యేది కాదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అనసూయ యాంకరింగ్.. రోజా పంచ్ లు, నాగబాబు నవ్వులు.. స్టేజిమీద కంటెస్టెంట్ల మధ్య గేమ్స్.. అబ్బో మాములు ఫన్ ఉండేది కాదు. కానీ, ఉన్నా కొద్దీ జబర్దస్త్ కామెడీ పెరిగి వల్గారిటీ ఎక్కువ అయ్యింది.

ఫ్యామిలీ షో కాస్తా అడల్ట్ షోగా మారింది. పంచ్ ల పేరు మీద అమ్మాయిలను కామెంట్స్ చేయడం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఆడవారిపై క్రిటిసిజం.. ఇలా ఎక్కువ అయ్యేసరికి కుటుంబాలు కలిసి ఈ షోను చూడలేకపోయాయి. అలా దీని రేటింగ్ తగ్గుతూ వచ్చింది. ఏదిఏమైనా బుల్లితెర కామెడీ షోస్ లలో బెస్ట్ కామెడీ షో అంటే ఫస్ట్ జబర్దస్త్ పేరే చెప్తారు. ఇప్పుడు ఈ షో నడుస్తుంది కానీ, అంతగా ప్రేక్షకులు దృష్టి పెట్టడంలేదు.

jabardasth latest promo naresh vulger comments on siri

అనసూయ యాంకరింగ్ నుంచి బయటకు వచ్చేసాక.. కొన్ని రోజులు రష్మీ చేసింది.. ఆ తరువాత సౌమ్య రావు వచ్చింది. తన అందంతో, వచ్చిరానీ తెలుగుతో మ్యానేజ్ చేసింది. మధ్యలో ఆమె కూడా వెళ్ళిపోయి సిరి వచ్చింది. ఇక రోజా, నాగబాబు ప్లేస్ ను కృష్ణ భగవాన్, ఇంద్రజ భర్తీ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంద్రజ లేకపోతే ఖుష్బూ జడ్జిగా వస్తుంది. ఇక ప్రేక్షకులకు నవ్వు తెప్పించడం కోసం అసలు అమ్మాయిలను అనకూడని మాటలు అంటూ అది కామెడీ అని చెప్పుకొస్తున్నారు.

తాజాగా పొట్టి నరేష్.. యాంకర్ సిరిని పడుకుందాం రా అని అడగడం దారుణంగా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు పొట్టి నరేష్. తన హైట్ తనకు ప్లస్ కావడంతో చిన్న పిల్లల క్యారెక్టర్స్ నుంచి స్కిట్ లో ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేస్తున్నాడు. ఇక తాజా ప్రోమోలో నరేష్.. సిరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అస్సలు బాగోలేదు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

jabardasth latest promo naresh vulger comments on siri

"నిన్నటికి నిన్న ఆ సిరి తో గొడవ ఏంటి అని లేడీ గెటప్ అడగ్గా.. టిఫిన్ చేసే టైమ్ కు ఎవరైనా ఇంటికి వస్తే.. టిఫిన్ చేద్దురు రండి అంటారు.. లంచ్ చేసే టైమ్ కు వస్తే భోజనం చేద్దురు రండి అంటాం. రాత్రి పడుకొనే టైమ్ కు సిరి వచ్చింది.. పడుకుందాం రా..? అని అడిగాను.. కొట్టింది అని చెప్పుకొచ్చాడు. ఛీఛీ ఒక అమ్మాయిని అలా పడుకుందాం రా అని డబుల్ మీనింగ్ గా మాట్లాడితే నవ్వాలా.. ? ఇలాంటి డైలాగ్స్ తో కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షో చూడాలా.. ? అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

jabardasth latest promo naresh vulger comments on siri

ఇక కొంతమంది ఆమె దగ్గరకు వెళ్లినా నువ్వేం చేయలేవులే అని కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి మాటలు అనే అనసూయా.. షో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఏదో ఒకరోజు సిరి కూడా అలాగే వెళ్ళిపోతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X