‘హైపర్ ఆదిది వెన్నుపోటు మనస్తత్వం.. అలా వాళ్లిద్దరికీ బ్రేకప్‘
తెలుగు ప్రేక్షకులకు దాదాపు 12 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వారం కూడా కొత్త వారికి జబర్దస్త్ స్వాగతం పలికింది. జబర్దస్త్ అనే ఈ స్టేజ్ ఎంతోమంది సామాన్యుల్ని సెలబ్రిటీలుగా చేసింది. అలాగే మరికొంతమంది కొత్తవాళ్లను పరిచయం చేయబోతోంది ఈ జబర్దస్త్ అని యాంకర్ రష్మి గౌతమ్ పేర్కొన్నారు. ఆ వెంటనే ఇద్దరు కమెడియన్లు అన్నదమ్ములుగా స్కిట్ చేయడానికి వచ్చారు. మనం కొత్తవాళ్లమని తెలిసినా కూడా మనం రాగానే బ్లాస్ట్ వేశారని తమ్ముడు అనగా.. వీళ్లు ముందు బ్లాస్ట్ అంటారు, సరిగా చేయకపోతే ఇదే మీకు లాస్ట్ అంటారని అన్నయ్య గెటప్‌లో ఉన్న వ్యక్తి పంచ్ విసిరాడు. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలని తమ్ముడు అనగా.. ఉంటాం రా అంటాడు అన్నయ్య.

ఎందుకంటే చలాకీ చంటి - బుల్లెట్ భాస్కర్ విడిపోవడానికి మన మధ్య ఇగోలేం లేవు. హైపర్ ఆది - అదిరే అభిలా విడిపోవడానికి నాకు వెన్నుపోటు పొడిచే ఆలోచన లేదు. సుధీర్ - రష్మిలా ఎవరి దారి వారు చూసుకోవడానికి మన మధ్య లేనిపోని లవ్‌ట్రాక్స్ కూడా లేవు అనడంతో అంతా నవ్వేస్తారు. ఆ వెంటనే వాళ్లు అమ్మని పిలిచి నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? అని అన్నయ్య గెటప్‌లో ఉన్న వ్యక్తి అడుగుతాడు. కృష్ణభగవాన్ గారితో ఫోటో దిగాలనుంది రా అంటుంది. అది కాకుండా తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పమని అడగ్గా.. నా ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేసేశాను, మీరు ఏ కాయో పండో చేతిలో పెట్టేస్తే నా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తాను అంటుంది. ఆ వెంటనే అన్నయ్య జామ కాయ.. తమ్ముడు అరటిపండు తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతారు. దాంతో అంతా నవ్వేస్తారు.
నెక్ట్స్ స్కిట్‌లో సుధాకర్ .. కృష్ణగారి సినిమా సాంగ్‌తో ఎంట్రీ ఇస్తాడు. నాన్నగారు అని తండ్రి గెటప్‌లో ఉన్న ప్రవీణ్ దగ్గరికి వెళ్లి గట్టిగా పిలవగానే.. సిగ్గు లేదు రా, శరం లేదురా.. ఏం బతుకు రా నీది. ఇన్ని వేలకోట్లకు ఆస్తిపరుడివి, ఇన్ని కార్లకు నువ్వు ఒకేఒక్కడివి. ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని ఒక పిల్ల చెంగు చెంగుమని తిరగాలనే ఆశ లేదురా. ఈ బతుకు బతకం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోరా అని అంటున్నారు నాన్నగారు అంటాడు చంటీ. ఆ వెంటనే నా ఆస్తినంతా నేను అనాథశ్రమానికి రాసేస్తాననే డైలాగ్ చెప్పలేక నానాతంటాలు పడతాడు ప్రవీణ్.
మరో స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్ వచ్చి.. పెళ్లి సికింద్రాబాద్‌లో చేసుకుందామా? హైదరాబాద్‌లో చేసుకుందామా? అని అడుగుతాడు. కుదరదు గుజరాత్‌లో చేసుకుందామని పిల్ల తండ్రి చెప్పగా.. నాకు లోకల్‌లో ఉన్న పెళ్లామే కావాలని పెళ్లి వద్దని వెళ్లిపోతాడు భాస్కర్. ఆ అమ్మాయిని పొట్టి నరేష్ పెళ్లి చేసుకుని బుల్లెట్ భాస్కర్‌కి ఎదురింటిలోనే కాపురం పెట్టి హింసిస్తాడు. దాంతో తన భార్య ఫైమాని పిలిచి నాకు మసాజ్ చేయమంటాడు భాస్కర్. నాకు మసాజ్‌లు రావడం అని ఫైమా చెప్పగా.. దానికి మసాజ్‌లు రావంట అంటూ సెటైర్లు వేస్తాడు పొట్టి నరేష్.
తర్వాత దేవదాస్ గెటప్‌లో ఆటోరాంప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు. నా కుక్కకి లవ్ ఫెయిల్ అయ్యిందని కుక్క గెటప్‌లో ఉన్న దొరబాబుని చూపిస్తాడు. దానిని సాల్వ్ చేయడానికి మందు తాగాలి కదా? అందుకే నేను తాగుతున్నానని చెబుతాడు. గత జన్మలో బాయ్‌ఫ్రెండ్స్ అందరూ ఈ జన్మలో కుక్కల్లాగా పుడతారట రివేంజ్ తీర్చుకోవడానికి అంటాడు రాంప్రసాద్. అనంతరం రాకేష్ - రోహిణిలు ఎంట్రీ ఇవ్వగా అతనికి ఓ వ్యక్తి దిష్టి తీస్తాడు. రాను అనుకున్నారా? రాలేను అనుకున్నారా అని రాకేష్ పంచ్ విసరగా.. మళ్లీ ఎందుకొచ్చావని అనుకుంటున్నారని రోహిణి రివర్స్ పంచ్ విసురుతుంది. వాళ్లేమో నిన్న రాకింగ్ రాకేష్‌లా చేయమంటారు.. నువ్వేమో రాకేష్ మాస్టర్‌లా చేస్తావని రోహిణి చెడుగుడు ఆడుకుంటుంది.
మరో స్కిట్‌లో పండు వచ్చి ఢీ అయినా, ఈవెంట్స్ అయినా.. శ్రీదేవి అయినా జబర్దస్త్ అయినా.. నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ అని పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతుండగా అందరూ పారిపోతారని పంచ్ విసరుతుంది రష్మి. దాంతో రెండు షెడ్యూల్స్ వరకు చూద్దాం.. తర్వాత డిసైడ్ అవుదామని వెళ్లిపోతాడు పండు. తర్వాత నాకు దిష్టి తగిలిందని చెప్పగా.. ఓ బుడ్డోడిని పట్టుకుని అఖండ స్టైల్‌లో దిష్టి తీస్తాడు అజహర్. నీది ఏ రాశి అని ఐశ్వర్య వచ్చి అజహర్‌ను అడగ్గా... నాది వృశ్చికం అంటాడు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని అడగ్గా.. యాధృచ్చికం అంటాడు అజహర్. అలాగే నీది ఏ రాశి అని వర్ష అడగ్గా.. తుల అంటాడు పండు. మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని వర్ష అడగ్గా.. ధూల అని అజహర్ పంచ్ విసురుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. మరి ఆ ఇద్దరు అన్నదమ్ములు వారి తల్లి చేతుల్లో పండును పెట్టారా? సుధాకర్ పెళ్లి చేసుకున్నాడా? భాస్కర్‌కి బుద్ధి వచ్చిందా? కుక్క బాధను రాంప్రసాద్ తీర్చాడా లేదా? తెలియాలంటే ఫిబ్రవరి 20, 21 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











