Jabardasth : జబర్దస్త్‌లో మూడు లవ్ ట్రాక్‌లు .. షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన రష్మి

తెలుగు వారిని దాదాపు 12 ఏళ్లుగా కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తున్న మెగా కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తమ సత్తా నిరూపించుకుని సినిమాలలో అవకాశాలు దక్కించుకుని హీరోలుగా, దర్శకులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా , కమెడియన్లుగా వెలుగొందుతున్నారు. ఎంతోమంది స్టాండప్ కమెడియన్లు వచ్చారు , పోయారు.. కానీ జబర్దస్త్ మాత్రం ఇప్పటికీ తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూనే ఉంది. ఎప్పటిలాగానే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది.

ప్రోమో స్టార్టింగ్‌లోనే టీమ్ లీడర్స్‌తో కలిసి రష్మి ఎంట్రీ ఇస్తుంది. ఆ వెంటనే తాగుబోతు రమేశ్ - నూకరాజుల స్కిట్ ప్రారంభమవుతుంది. అసలు నువ్వు ఎవరయ్యా అని రమేశ్ ప్రశ్నించగా.. నేను రైటర్‌ని అని, సన్నీలియోన్‌కు నేనే డైలాగులు రాశానని చెబుతాడు. కట్ చేస్తే జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ సార్.. అందులో ఒక హీరోయిన్ , ఒక హీరో అని నూకరాజు చెబుతుండగా యాంకర్ రష్మి అడ్డుపడుతుంది. ఇక్కడ చాలా లవ్ ట్రాకులు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాకుల గురించి మాట్లాడుకోండి అంటుంది. ఇక్కడ ఒక్కరిది కాదు మూడు జంటల లవ్ స్టోరీ నడుస్తోందని చెప్పగా.. ఆ ముగ్గురి కథ ఏంటో చెప్పవా అంటూ తాగుబోతు రమేశ్ అడగ్గా అంతా నవ్వేస్తారు.

jabardasth latest promo of January 3rd and 4th released rashmi Gautham shocking comments on her love

ఆ కాసేపటికే రాకెట్ రాఘవ తన టీమ్‌తో ఎంట్రీ ఇచ్చి.. అందరికీ నమస్కారం పెడతాడు. నా కన్నా పెద్దావిడ కదా అని రష్మి గారికి డండం పెడుతుంటే మధ్యలో దూరతావా అంటూ తన టీమ్ మెంబర్‌ని తిడతాడు. ఇంట్లో నేను ఉండగా వేరే అమ్మాయికి సైట్ కొడతావా అంటూ లేడీ గెటప్‌లో ఉన్న మోహన .. రాఘవకి తొడపాశం పెడుతుంది. ఇంత జరుగుతున్నా పేపర్ చదువుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి రాఘవ ప్రశ్నించగా.. కాఫీ అని అడుగుతాడు. సాయంత్రం త్వరగా వస్తే మా ఆయన బైక్ వేసుకుని వెళ్తాడట అని చెబుతుంది భార్య.. బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారని రాఘవ అడగ్గా వాకింగ్‌కి అని చెబుతాడు ఆ వ్యక్తి.

ఇంతలో ఆటో రాంప్రసాద్‌ను కొంతమంది విలేకరులు వచ్చి మీరు కథలు రాయడానికి గోవా వెళ్తారట నిజమేనా అని ప్రశ్నించగా.. కథలు రాయడానికేనా అంటూ రష్మి పంచ్‌లు విసురుతుంది. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సీడీలు తీసుకొచ్చి ప్లే చేసేవాడని, అవి చూడగానే నాలో కసి పెరిగిందని అంటాడు రాంప్రసాద్. దీంతో శివాజీ ఏం సీడీలని ప్రశ్నిస్తాడు. ఇంతలో దొరబాబు ఎంట్రీ ఇవ్వగానే.. ఆయన వచ్చాడంటే ఏ సీడీలో అర్ధమైపోయిందని రష్మి అంటుంది.

తర్వాత ఫైమా పోలీస్ గెటప్‌లో వచ్చి తప్పిపోయిన బాబు గురించి ఎంక్వైరీ చేస్తుంది. బుల్లెట్ భాస్కర్‌కి, పొట్టి నరేష్‌కి పచ్చి మిరపకాయలు తినిపించి ఎవరు అసలు పిల్లాడో తేలుస్తుంది. ఇమ్మాన్యుయేల్, పండులు వచ్చి మేం చాక్లెట్ తినగానే అన్ని మరిచిపోతామని చెబుతారు. మరి రష్మి చెప్పిన ఆ మూడు లవ్ ట్రాకులు ఎవరివి? రాంప్రసాద్ ఏం సీడీలు చూశాడు? ఫైమా తప్పిపోయిన బాబుని కనిపెట్టిందో లేదో తెలియాలంటే ఈ శుక్ర, శనివారాల్లో జబర్దస్త్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X