Jabardasth: షకలక శంకర్‌పై అలా రివెంజ్ .. స్టేజ్‌పై ప్యాంట్ లాగేసిన ఫైమా

తెలుగునాట టాప్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్దస్త్. టాప్ కమెడియన్లు, జడ్జిలు వెళ్లిపోయినప్పటికీ జబర్దస్త్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మధ్యలో రేటింగ్స్ తగ్గినప్పటికీ జబర్దస్త్‌కు పోటీగా మరో కామెడీ షో ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. కొన్ని ఛానెల్స్‌ జబర్దస్త్ తరహా కార్యక్రమాలను రూపొందించి టెలికాస్ట్ చేసినప్పటికీ జనం పట్టించుకోవడం లేదు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా కలకలం
పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ చెప్పిన రప్పా రప్పా అనే డైలాగ్ గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రగడకు కారణమైనప సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో టీడీపీ వాళ్లను రప్పా రప్పా నరకుతాం అనేలా ఫ్లెక్సీలు ఉండటం వివాదాస్పదమైంది. ఆ తర్వాత మీడియా సమావేశంలో జగన్ స్వయంగా ఈ డైలాగ్ చెప్పడం మరింత ఆజ్యం పోసింది. ఏపీ నుంచి తెలంగాణకు ఈ రప్పా రప్పా పాకింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు నిర్వహించిన రైతు ఆందోళనలో ఈ డైలాగ్‌తో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు వైరల్ అయ్యాయి.

Jabardasth Latest Promo Patas Faima take revenge on Shakalaka Shankar

రప్పా రప్పా డైలాగ్‌తో అన్నపూర్ణమ్మ ర్యాగింగ్
తాజాగా జబర్దస్త్‌లోనూ ఈ రప్పా రప్పా డైలాగ్ వినిపించింది. తాజా ప్రోమోలో నూకరాజు స్కిట్‌లో సీనియర్ యాక్టర్లు అన్నపూర్ణమ్మ, వై విజయలు తమ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ తన పంచ్‌లు, సామెతలతో అదరగొట్టారు. మనకంటే చిన్నోళ్లు జడ్జిలు, మనకంటే పెద్దోళ్లు యాంకర్లు అంటూ సెటైర్లు విసిరారు. స్కిట్‌లో భాగంగా నూకరాజు ఓ బస్తా నిండా మల్లెపూలు తీసుకుని భార్య దగ్గరికి వెళ్తాడు. ఆషాడం మొదలైంది కొత్త జంటలు దూరంగా ఉండాలని అన్నపూర్ణమ్మ, వై విజయ అంటారు. నిన్ను చూస్తుంటే మీ తాత గుర్తొస్తున్నాడని ఆయన కూడా బస్తాడు మల్లెపూలు ఇంటికి తీసుకొచ్చి అలసిపోయి నిద్రపోయేవాడని చెప్పి నవ్వించింది. అనంతరం నూకరాజు తన భార్య దగ్గర కూర్చొని మూడు నెలలు తిరిగేసరికి నీకు పులుపు తినిపిస్తానని చెప్పడంతో అన్నపూర్ణమ్మ వెంటనే రప్పా రప్పా డైలాగ్ వదిలింది. దొడ్లో గడ్డి పీకలేనోడు.. అడవికెళ్లి రప్పా రప్పా అని చెట్లు నరుకుతాడట అంటూ పంచ్ వేసింది.

వర్ష, బుల్లెట్ భాస్కర్ మీద అనుమానం
క్రెడిట్ కార్డు బిల్లు విషయంలో మోసపోయే స్కిట్‌ను రాకెట్ రాఘవ, ప్రసాద్‌లు చేసి నవ్విస్తారు. ఆ వెంటనే ఫైమా, బుల్లెట్ భాస్కర్, వర్షలు ఎంట్రీ ఇస్తారు. వర్షను తన క్లాస్‌మెట్‌గా పరిచయం చేస్తాడు భాస్కర్. భాస్కర్‌పై వర్ష పడిపోవడంతో చేయి తీసి మాట్లాడమని మండిపడుతుంది ఫైమా. నన్ను పెళ్లి చేసుకున్నాడా? నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అని వర్షను ఫైమా లాగికొట్టడంతో ఆమె వెళ్లి యాంకర్ మానస్ ఒడిలో పడుతుంది. దాంతో సాంప్రదాయిని సుద్ధపూసని, ఇద్దరినీ అని వర్షను పక్కకి లాక్కొస్తుంది ఫైమా.

శంకర్ ప్యాంట్ లాగేసిన ఫైమా
స్కిట్ మధ్యలో షకలక శంకర్ ఎంట్రీ ఇచ్చి కుర్చీలో కూర్చొంటాడు. భాస్కర్‌ను పిలువు అని చెప్పి నువ్వు ఎవరు అని అడుగుతాడు. నేను ఆయన పెళ్లాన్ని అని ఫైమా చెప్పడంతో .. నీకు వాడు మొగుడైతే, నేను వాడికి మొగుణ్ణి అని అంటాడు శంకర్. నైట్ నాకు ముద్దు పెట్టమంటే పెట్టలేదు.. నువ్వే వాడికి పెట్టొద్దని చెప్పావా అని ఫైమా రగిలిపోతుంది. నీ పని చెబుతానంటూ ప్యాంట్ లాగడానికి ట్రై చేస్తుంది ఫైమా.. శంకర్ ఎంతగా తప్పించుకోవాలని చూసి వదలకుండా ప్యాంట్ లాగేస్తుంది ఫైమా. దాంతో అంతా నవ్వేస్తారు. మరి ఫైమా నుంచి శంకర్ తప్పించుకున్నాడా? నూకరాజు ఫస్ట్ నైట్ జరిగిందో లేదో తెలియాలంటే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X