ఇంద్రజ మాటలకు నటుడు సీరియస్.. స్టేజ్ మీదే షర్ట్ విప్పేసి...

తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో.. ఎన్ని షోలు వచ్చినప్పటికీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో జబర్దస్త్ స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఈ మెగా షోకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబుని తిరిగి జడ్జిగా తీసుకొచ్చారు. అలాగే జబర్దస్త్‌ని వదిలేసిన పాత కమెడియన్లు కూడా తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎపిసోడ్‌కి సంబంధించి జబర్దస్త్ ప్రోమో ఫన్నీగా సాగింది. ఇందులో జడ్జి ఇంద్రజకు, కమెడియన్ పొట్టి నరేష్‌కు మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. ఈ వివరాల్లోకి వెళితే...

వెరైటీ స్కిట్లు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పాత సినిమాలలోని కథలతో ఫన్నీ స్కిట్లు చేసే బుల్లెట్ భాస్కర్ ఈవారం కూడా తనదైన శైలిలో నవ్వించేందు తన టీమ్‌తో రెడీ అయ్యాడు. దీనిలో భాగంగా బ్లాక్‌ అండ్ వైట్ రోజులలో సినిమా షూటింగ్స్ ఎలా చేసేవారు? అప్పటి పరిస్ధితులు ఎలా ఉండేవి? సెట్‌లో డైరెక్టర్ హీరోలపై ఎలా కోప్పడేవారు? హీరోలతో నటీనటులు ఎలా ఉండేవారు? షూటింగ్‌లో ఇబ్బందులపై ఫన్నీగా స్కిట్‌తో మన ముందుకొచ్చాడు.

Jabardasth Latest Promo Potti Naresh and Indraja s Funny Clash Steals the Show

తొలుత పటాస్ ఫైమా హీరోయిన్‌గా, పొట్టినరేష్ హీరోగా స్టేజ్ మీదకి వస్తారు. హీరో గారు.. మీరు పెళ్లి చేసుకుంటే మీకోక తోడు దొరుకుతుంది కదా అని అంటుంది ఫైమా. నేనే తోడు చుక్క.. నన్నెవరు చేసుకుంటారని అడుగుతాడు పొట్టి నరేష్. ఒక్క తోడు చుక్క చాలు పాలు పెరుగు అవ్వడానికి అని ఫైమా అనడంతో అంతా నవ్వేస్తారు. ఇంతలో సెట్‌లోకి వచ్చిన మిగిలిన ఆర్టిస్టులు పొట్టినరేష్‌కి కంగ్రాట్స్ చెబుతారు. అదేం తెలియని ఫైమా.. అందరూ హీరో గారికి కంగ్రాట్స్ ఎందుకు చెబుతున్నారు అని అడుగుతుంది. హీరో గారు మొన్నే సైకిల్ కొన్నారని ఓ నటి చెప్పడంతో కారు కొన్నాడన్న రేంజ్‌లో ఫైమా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. దాంతో సైకిల్‌కి నోటితోనే గాలి కొడుతున్నావా అని ఇంద్రజ సెటైర్లు వేస్తుంది.

ఆ వెంటనే దర్శకుడిగా ఉన్న బుల్లెట్ భాస్కర్ సీన్ వివరిస్తాడు. హీరోయిన్ తోటలో పరిగెడుతుంటే నువ్వు ప్రేమను వ్యక్తం చేయాలని నరేష్‌కి సీన్ చెబుతాడు. దాంతో ఫైమా చేతులు గట్టిగా పట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు నరేష్. అది చూసి డైరెక్టర్ చైర్‌లో ఉన్న బుల్లెట్ భాస్కర్ సీరియస్ అవుతాడు. ఆమె మీద అత్యాచారం చేస్తున్నావా? హీరోవేనా నువ్వు? ఒక సినిమా హిట్ట్ అయి సైకిల్ కొనగానే పొగరు తలకెక్కేసిందని నానామాటలు అంటాడు.

ఇక ఫైట్ సీన్ చేసే సమయంలో మరింత నవ్వించింది బుల్లెట్ భాస్కర్ టీమ్. చెప్పులు విసిరేసి విలన్‌తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు నరేష్. అయితే విలన్ షర్ట్ లేకుండా ఉంటే.. పొట్టి నరేష్‌ షర్ట్‌తో ఉండటంతో ఇంద్రజ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మన ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన కూడా షర్ట్ విప్పాలి కదా ఏంటిది అని ఇంద్రజ అంటుంది. ఆ మాటలకు సీరియస్ అయిన పొట్టి నరేష్ షర్ట్ విప్పేస్తాడు. నేను సరదాగా అన్నాను రా.. వద్దు రా అని ఇంద్రజ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మైక్ కూడా పీకేస్తాడు. దాంతో అందరూ నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. మరి పొట్టి నరేష్ ఈ ఫైట్‌లో గెలుపొందాడా? షూటింగ్‌లో ఏం జరిగింది? తెలియాలంటే మే 5, 6 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more about: jabardasth indraja nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X