‘పెళ్లి చేసుకోవకోచ్చు లేదంటే విడిపోవచ్చు... సహజీవనంలో ప్లస్ పాయింట్ అదే’
గడిచిన 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో. తెలుగులో టాప్ కామెడీ షోగా వెలుగొందుతున్న ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా రెడీ అవుతోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా సరికొత్త పంచ్‌లు, స్కిట్‌లతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. దీనిని పరిశీలిస్తే..
తొలుత రాంప్రసాద్ తన లవర్‌లో ఎంట్రీ ఇస్తాడు. చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఒక్క ముద్దు ఇవ్వొచ్చు కదా అని రాంప్రసాద్ అడగ్గా.. ఏమైనా పెళ్లి తర్వాతే అంటుంది లవర్. ప్రజెంట్ జెన్ జీ జనరేషన్ ఎలా ఉంది? చాలా ఫాస్ట్‌గా ఉందని రాంప్రసాద్ చెప్పగా.. నేను అందరి లాంటి జెన్‌జీని కాదు, డిఫరెంట్ జెన్‌జీ అని లవర్ అనడంతో అంతా నవ్వేస్తారు. ఇంతలో దొరబాబు కనిపించడంతో ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడుగుతాడు రాంప్రసాద్. ఒక 5 వేలు ఉంటే ఫోన్ చేయవా? ఫోన్ ఇస్తాను మాట్లాడుకోమని దొరబాబు అంటాడు. అయితే ఫోన్‌కి లాక్‌గా రాంప్రసాద్ నాకడం, దొరబాబు ముద్దుపెట్టుకోవడం నవ్వు తెప్పించింది. మీ గర్ల్‌ఫ్రెండ్ నా గర్ల్‌ఫ్రెండ్ ఒకటే.. మనిద్దరినీ ఒక అమ్మాయి మోసం చేస్తోందని రాంప్రసాద్, దొరబాబులు న్యాయం కోసం పోలీస్‌గా ఉన్న రైజింగ్ రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ రైజింగ్ రాజు తన ఫోన్‌కి పాస్‌వర్డ్‌గా దగ్గడంతో అంతా నవ్వేస్తారు.

ఆ వెంటనే రాజు గెటప్‌లో వచ్చిన ధనరాజ్ .. వైద్యుడి దగ్గరికి వెళ్లి ఒక 50 వరహాలు అప్పుగా ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతాడు. నేను ఇవ్వలేనని వైద్యుడు చెప్పడంతో అప్పు ఇచ్చు వాడు వైద్యుడు అన్నారు.. మీరు అప్పు ఇవ్వలేనప్పుడు రాజవైద్యుడిగా మిమ్మల్ని తొలిగిస్తున్నానని అంటాడు ధనరాజ్. తర్వాత మన ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టమనగా సుధాకర్, మరో లేడీ గెటప్ వచ్చి తమ పంచ్‌లతో అలరిస్తారు.
అనంతరం పంచ్ ప్రసాద్, వినోదినీల జోడీ ఎంట్రీ ఇస్తుంది. మేమిద్దరం లవర్స్ అండీ. ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌లో ఉన్నాం.. పెళ్లి చేసుకుంటే చేసుకుంటాం, లేదంటే లేదు. ఎందుకంటే రీసెంట్‌గా నా జాబ్ పోయిందని చెబుతాడు ప్రసాద్. ఎప్పుడూ ఏదో ఒకటి పోతూనే ఉంటుందని ఇంద్రజ్ పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు. ఇంతలో తాగుబోతు రమేశ్‌ని రెండ్రోజులు నా లవర్‌ని మీ ఇంట్లో పెట్టుకోమని అడుగుతాడు ప్రసాద్. ఇలాంటిది మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ నవ్వేస్తారు ఇద్దరూ. ఆ వెంటనే ప్రసాద్‌కు తల్లీగా రోహిణి రాగా.. ఎందుకంత త్వరగా వచ్చావని అడుగుతాడు ప్రసాద్. నేను త్వరగానే వస్తాన్నాను.. కింద నుంచి రైటర్స్, డైరెక్టర్లు త్వరగా ఎక్కండి ఆ రైలు ఎటో పోతోందన్నారని సెటైర్ వేస్తుంది.
ఇక 1970లలో సినిమా వాతావరణం, షూటింగ్స్‌తో బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్ టీమ్ నవ్వించే ప్రయత్నం చేసింది. నువ్వు సరిగా చేయడం లేదు.. ఒక్క సినిమా హిట్ అయి సైకిల్ కొనగానే పొగరు తలకెక్కేసిందంటూ హీరోగా ఉన్న నరేష్‌ని భాస్కర్ తిడతాడు. చివరిలో ఫైట్ సీన్ తీస్తుండగా విలన్ షర్ట్ లేకుండా ఉండగా.. మన ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన కూడా షర్ట్ లేకుండా ఉండాలని ఇంద్రజ సెటైర్ వేయడంతో నరేష్ షర్ట్ విప్పేస్తాడు. గతంలో జబర్దస్త్‌లో ఉన్న ఫటా ఫటా ఫన్ రౌండ్‌ని మరోసారి తీసుకొస్తున్నట్లు యాంకర్ రష్మీ చెబుతుంది. దాంతో కంటెస్టెంట్స్ అందరూ నవ్వించే ప్రయత్నం చేస్తారు.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. రాంప్రసాద్, దొరబాబులను మోసం చేసిన లవర్‌ని రైజింగ్ రాజు పట్టుకున్నాడా? ధనరాజు తిక్కని ఎలా కుదిర్చారు? పంచ్ ప్రసాద్ - వినోదినీలు పెళ్లి చేసుకున్నారా? షూటింగ్‌లో నరేష్ విన్యాసాలు ఎలా ఉన్నాయి? ఫటా ఫట్ ఫన్ రౌండ్‌లో ఎవరు గెలిచారు? తెలియాలంటే జూన్ 5, 6 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications



