స్టార్ యాంకర్‌పై క్షుద్రపూజలు... ఆ నటి చేష్టలతో..

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 12 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

ప్రోమో ప్రారంభం కాగానే .. కొత్త టీమ్‌లోని ఓ లేడీ కమెడియన్ పరిగెత్తుకుంటూ యాంకర్ రష్మి దగ్గరికి వస్తుంది. ఎంత వెతికినా దొరకకపోవడంతో తిన్నావా? ఒకసారి లేవమని రష్మితో చెబుతుంది. సీటులో నిమ్మకాయ దొరకడంతో.. నా కింద ఏం చేస్తున్నావని రష్మి అడుగుతుంది. నీ కింద కాదు.. నీకు అని ఆ నటి సెటైర్ వేస్తుంది. ఆ వెంటనే నిమ్మకాయతో దిష్టి తీసి.. హమ్మయ్య తీసేసినా అంటుంది. మొన్న స్కిట్ చేసినప్పుడు ఎందుకు నవ్వలేదు.. అందుకే చేశా. ఇప్పుడు సీటు కిందే పెట్టా... నువ్వు నవ్వలేదనుకో రేపు బెడ్ కింద పెడతానని ఆమె వార్నింగ్ ఇ్వడంతో రష్మి టెన్షన్ పడుతుంది.

Jabardasth Latest Promo Rashmi Funny Lemon Skit Bullet Bhaskar Faima Comedy and Rowdy Rohini Punches Go Viral

మరో స్కిట్‌లో యమ ధర్మరాజు గెటప్‌లో ఉన్న వ్యక్తి వచ్చి.. ఎవరీ అందాల రాశి అని అడుగుతాడు. ఆ కన్యది కన్యారాశా.. అందుకే ఇంకా కన్యగానే మిగిలిపోయిందని చెబుతాడు చిత్రగుప్తుడు. అయితే అడ్డమైన లెక్కలేనన్ని రాసి లేపేయ్.. నరకంలో బ్రేక్ ఇచ్చి బ్రేక్ డ్యాన్స్ చేద్దామని చెబుతాడు యముడు. ఎన్ని లెక్కలు మార్చినా ఆమె ఆయష్షు తగ్గడం లేదు.. ఏదో గాలి అడ్డొస్తోందని అంటాడు చిత్రగుప్తుడు. అయితే ముందు ఆ గాలిని లేపేయ్ అని యముడు అనగా.. అది అలాంటి ఇలాంటి గాలి కాదు ప్రభూ, సుడిగాలి అని సెటైర్ వేస్తాడు చిత్రగుప్తుడు.

అనంతరం బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌లు మరో స్కిట్‌లో ఎంట్రీ ఇస్తారు. భాస్కర్‌ను టెంప్ట్ చేసేలా ఫైమా రకరకాల ఎత్తులు వేస్తుంది. భాస్కర్‌ను ఫైమా హత్తుకోగానే అతని భార్య వచ్చి సీరియస్ అవుతుంది. తర్వాత కరెంట్ షాక్ కొట్టింది కాపాడమంటూ ఫైమా ఊగుతుంది. భాస్కర్ వెళ్లి పట్టుకోగానే అతని భార్య వచ్చి మళ్లీ మండిపడుతుంది. నాకు తెలుసు.. దీని కళ్లు వీడి మీద పడ్డాయ్, వీడిలా నాకు కండలు లేవని అంటూ భాస్కర్‌పై సీరియస్ అవుతాడు నరేష్.

మరో స్కిట్‌లో తాత చచ్చిండు కాలేయాలని ఓ వ్యక్తి అనగా.. మరో వ్యక్తి శవం మీద కాలు వేస్తాడు. నేను చెప్పింది కాలు వేయడం గురించి కాదు.. ముసలోడు చచ్చిండు ఆ కాలేయడం గురించి చెబుతున్నానని సీరియస్ అవుతాడు. అయితే నేను వెళ్లి మేకప్ వేసుకుని వస్తానని ఓ అమ్మాయి వెళ్తుంది, చుట్టాలంతా వస్తారు, మంచిగా కనిపించాలని అంటుంది. నేను కూడా కొత్త చీర కట్టుకుంటానని అనడంతో ఇద్దరు మొగుళ్లు సీరియస్ అవుతారు.

ఆ వెంటనే రౌడీ రోహిణి పెద్ద జడతో ఎంట్రీ ఇచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకడు నా వెంట పడుతున్నాడు, వాడికి వాలు జాడ కావాలట అని రోహిణి చెబుతుంది. మరి వాలు జడ ఎక్కడ అని గుండు చూపించడంతో అవతలి వ్యక్తి షాక్ అవుతాడు. ఇంత చిన్న వయసులో మీకు గుండు ఎలా వచ్చింది? అని అడగ్గా.. రాకేశ్ టీం లీడర్ అన్నారు ఈ పక్క లేచిపోయింది, మిమ్మల్ని కంటెస్టెంట్స్ అన్నారు ఈ పక్క లేచిపోయింది. పాత పేమెంట్ అన్నారు.. మొత్తం ఊడిపోయిందని రోహిణి చెప్పడంతో అంతా నవ్వేస్తారు. నీలాంటి జుట్టున్న దానికి రెండు పూలు పెడితే చాలు.. కానీ ఇలాంటి జుట్టు ఉన్న దానికి రెండు ఎకరాలు ఉండాలి మినిమమ్ అంటాడు రాకేష్. నెత్తిమీద జుట్టు, టీం లీడర్ పోస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపోతుంటాయి. మీరు మరి హోప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారని రోహిణి అంటుంది.

మరో స్కిట్‌లో సుధాకర్ మూవీ డైరెక్టర్‌గా, పటాస్ ప్రవీణ్ అతని అసిస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తారు. ఎప్పటి నుంచో రష్మీగారు మన సినిమాలో ఒక ఛాన్స్ అడుగుతున్నారు సార్.. ఇవ్వొచ్చు కదా అని ప్రవీణ్ అడగ్గా.. రష్మికే కాదు, రష్మిక మందన్న వచ్చినా కూడా ఛాన్స్ ఇవ్వను. లోకల్ ఆర్టిస్ట్స్ వీళ్లంతా అని అంటాడు సుధాకర్. ఈ మాట బయట తెలిస్తే ఈ మందం వాచేలా కొడతారని వార్నింగ్ ఇస్తాడు ప్రవీణ్. ఆ తర్వాత హీరో ఫ్యాన్‌గా చంటి వచ్చి రచ్చరచ్చ చేస్తాడు. ఆ వెంటనే ఆటో రాంప్రసాద్- దొరబాబు టీమ్‌ వస్తుంది. నా స్కూల్‌కి అటుపక్క, ఇటుపక్క సినిమా హాల్స్ ఉన్నాయి. దాని వల్ల ఈ స్టూడెంట్స్ అందరికీ సినిమా పిచ్చి బాగా పట్టి సినిమా యాక్టర్‌లా బిహేవ్ చేస్తున్నారు అని అంటాడు. స్టూడెంట్స్ అంతా పుష్పరాజ్‌లా, కాంచనలా, బాహుబలిగా, అపరిచితుడిలా గెటప్స్ వేసుకొచ్చి నవ్వించారు. మరి ఫైమా నుంచి బుల్లెట్ భాస్కర్ ఎలా తప్పించుకున్నాడు? రౌడీ రోహిణిది జడ కాదు విగ్గు అని రాకేష్ తెలుసుకున్నాడా? చంటి దెబ్బకు సుధాకర్ పారిపోయాడా? లేదా తెలియాలంటే మార్చి 13, 14 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ చూసేయాల్సిందే.

More from Filmibeat

Read more about: jabardasth rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X