ఆ జబర్దస్త్ యాంకర్ ఒక విలన్.. స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

తెలుగునాట స్టార్ కామెడీ షోగా ఇమేజ్ దక్కించుకుంది జబర్దస్త్. దాదాపు 13 ఏళ్లుగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఎప్పటికప్పుడు కొత్త థీమ్‌లతో, పంచ్ డైలాగ్స్‌తో అలరిస్తోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా జబర్దస్త్ కొత్తగా రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ ప్రోమో ఎలా ఉంది? ఏ కంటెస్టెంట్స్ పంచ్‌లు అదిరిపోయాయి? ఈ వివరాల్లోకి వెళితే..

ఆటో రాంప్రసాద్, సన్నీల స్కిట్ కడుపుబ్బా నవ్వించింది. తొలుత లేడీ కంటెస్టెంట్ వచ్చి నన్ను రాజమండ్రి శ్రీదేవి అంటారండీ. నేనండి గేదేలను పెంచుకోని అండీ.. పాలన్నీ పీసుక్కుని అండీ.. ఇంటింటికీ తిరిగి పాలు వేసుకుని అండీ.. రూపాయ రూపాయి పొగు చేసుకుని అండీ.. సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టానండీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఏంటీ యాప్లిస్ కాయలు రాలేదేంటీ అని అడగ్గా.. వాళ్లు యాప్లీస్‌కాయలు కాదు ఎంప్లాయిస్ అని సన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఆ వెంటనే చలాకీ చంటీ, దొరబాబు, ఆటో రాంప్రసాద్‌లు ఎంప్లాయిస్‌గా వస్తారు. అందరికీ శాలరీలు పడ్డాయా అని రాంప్రసాద్ అడగ్గా.. మాకు పడ్డాయి, నీకు పడ్డాయా అని అడుగుతాడు దొరబాబు.

Jabardasth Latest Promo Review Auto Ramprasad Apparao and Bullet Bhaskar Steal the Show

నాక్కూడా పడ్డాయి.. మా అమ్మగారు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్తానని అడుగుతుంటే అని రాంప్రసాద్ చెబుతుండగా.. ఆ డబ్బులిచ్చి తిరుపతి పంపించేశావా? అని అడుగుతాడు దొరబాబు. మా అమ్మని తిరుపతి పంపించి.. 50 వేల రూపాయాలతో రాత్రి ఇంట్లో పార్టీ చేసుకున్నానని రాంప్రసాద్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ల్యాప్‌టాప్‌లో ఏం వర్క్ చేస్తున్నావని రాంప్రసాద్ అడగ్గా... రోబో 2.5 మీద అని ఒకడు, 3.5 మీద అని మరొకడు చెప్పగా నేను 4.5 మీద అని రాంప్రసాద్, పాయింట్ ఫైవ్ అని దొరబాబు చెబుతాడు. ఇంతలో ఓనర్‌గా ఉన్న లేడీ కంటెస్టెంట్ వచ్చి.. నిన్న నీకు ఫైల్ ఇచ్చాను కదా చూశావా అని అడగ్గా.. మొత్తం చూశానని దొరబాబు చెబుతాడు. అయితే ఫైల్ తీసుకురమ్మని చెప్పగా అందులో వైట్ పేపర్సే ఉంటాయి. నేను నీకిచ్చింది తెల్ల పేపర్లేనని అంటుంది వోనర్. ఆ తర్వాత పైథాన్ అంటే ఏంటీ అని అడగ్గా.. పైన ఉంటే పైథాన్, కింద నుంటే కిందథాన్, మధ్యలో ఉంటే తంథాన్ అని ఓ కంటెస్టెంట్ పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు.

తర్వాత పొట్టి నరేష్‌- ఫైమాలు భార్యాభర్తలుగా స్కిట్ చేయడానికి వస్తారు. భార్యాభర్తలది జన్మజన్మల బంధం అంటారు కదా? మరి ప్రేమికులది అని ఫైమా అడగ్గా.. నెల రోజుల బంధం, వారం రోజుల బంధం, రెండ్రోజుల బంధం అని నరేష్ అంటాడు. ఆ వెంటనే పెళ్లానికీ పొలిటీషియన్‌కు తేడా ఏంటీ? అని వర్ష అడగ్గా... ఇద్దరూ ఒకటే తాళి కట్టేంత వరకు, ఓట్లేసేంత వరకు ఇద్దరూ మన మాట వింటారు. తాళి కట్టిన తర్వాత పెళ్లాం, ఓట్లేసిన తర్వాత నాయకుడు ఎవరి మాట వినరు అని బుల్లెట్ భాస్కర్ చెబుతాడు. నాన్న, అమ్మ, తమ్ముడు అని ఫైమా - పొట్టి నరేష్‌లను వర్ష పరిచయం చేస్తుంది. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది.. పెళ్లంటే అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు చూడాలని అంటారు కదా? అని పొట్టి నరేష్ అడుగుతాడు. మీ నాన్నగారు ఏం చేస్తారని భాస్కర్ అడగ్గా.. ఖాళీగా ఉంటారని ఆన్సర్ ఇస్తాడు నరేష్. నీ ఒకటో తరమే వరెస్ట్, నువ్వు ఏడు తరాల గురించి చూస్తున్నావు అని పంచ్ వేస్తాడు భాస్కర్. కనీసం సెలబ్రిటీలైనా మీ పెళ్లికి రావాలని అడగ్గా.. ఖుష్బూ గారు, కృష్ణ భగవాన్ గారు, రష్మిగారు అని అంటాడు నరేష్. ఫస్ట్ టైం వింటున్నా.. వీళ్లంతా ఎవరు అని భాస్కర్ అడగ్గా... వీళ్లు ఇప్పుడు తెలియదు బాబు, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తెలుస్తారని నరేష్ పంచ్ విసురుతాడు.

అనంతరం అప్పారావు ఓ అమ్మాయితో వచ్చి ఈమె నా భార్య , 20 ఏళ్లకి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. వాళ్లు నాకు ఉద్యోగం ఉందా అని అడిగారు.. ఆగా. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత చేసుకుందామంటే 35 ఏళ్లు వచ్చేశాయి. కనీసం డ్రైవ్ చేయడానికి కారైనా ఉందా అని అడిగారు. పైన బట్ట, ఇక్కడ పొట్ట, ఇంకేదో వస్తదని చూపిస్తాడు అప్పారావు. చివరిలో నా స్పీడ్ గురించి మీకు తెలియదు. నేను యాక్షలెటర్ మీద కాలు పెడితే 120 స్పీడ్ అని చెప్పగా.. అంబులెన్స్‌లు కూడా 120 స్పీడే ఉంటదని యాంకర్ రష్మి గౌతమ్ పంచ్ విసురుతుంది. దాంతో విలన్లు ఎక్కడో ఉండరండీ.. ఇలా మిడ్డీలు వేసుకుని మన చుట్టూనే తిరుగుతారు అని అప్పారావు కౌంటర్ వేస్తాడు. మరి వీటిలో ఏ స్కిట్ పేలింది? అప్పారావు పెళ్లి గురించి ఏం చెప్పాడు? ఆఫీస్‌లో ప్రాబ్లమ్‌ ఎలా క్లియర్ అయ్యింది? బుల్లెట్ భాస్కర్ - జబర్దస్త్ వర్షల పెళ్లయ్యిందా? తెలియాలంటే ఈ వారం జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: jabardasth rashmi gautam apparao
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X