లేటు వయసులో రైజింగ్ రాజు పెళ్లి... ఫస్ట్‌నైట్‌ నాడు ఓవర్‌ డోస్‌తో...

Photo Courtesy: Mallemalatv

గడిచిన 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోన్న జబర్దస్త్ కార్యక్రమం ఎప్పటికప్పడు ఫ్రెష్ కంటెంట్‌తో నవ్విస్తోంది. జడ్జిలు మారినా, యాంకర్లు మారినా, కమెడియన్లు మారినా తెలుగునాట జబర్దస్త్ మాత్రం టాప్ కామెడీ షోగా వెలుగొందుతోంది. మెగా బ్రదర్ నాగబాబు రీ ఎంట్రీతో జబర్దస్త్‌ తిరిగి గత వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల రిలీజైన ఈ వారం ప్రోమో ఆద్యంతం నవ్వులు తెప్పించింది. ఈ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్‌ రేటింగ్స్ నానాటికీ పడిపోతుండటంతో మళ్లీ ఈ షోని గాడిలో పెట్టేందుకు టీం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే నాగబాబుని తిరిగి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఒకప్పటి టీం లీడర్లు లేరు.. ఒకప్పటిలా స్కిట్లు కనిపించడం లేదు.. పంచ్‌లలోనూ పవర్ తగ్గింది. చాలామంది పాత జబర్దస్త్ స్కిట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్తవాళ్లతో మల్లెమాల టీం ప్రయోగాలు చేయిస్తూ జబర్దస్త్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో నాగబాబు రీ ఎంట్రీ తిరిగి జబర్దస్త్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Jabardasth Latest Promo Rising Raju First Night Comedy Bullet Bhaskar Land Scam Skit Goes Viral

Photo Courtesy: Mallemalatv

ఇటీవల జబర్దస్త్ షోకి వచ్చిన హైపర్ ఆదిని నాగబాబు ఎప్పుడొస్తున్నావు అని అడగ్గా.. తనకున్న కమిట్మెంట్స్ చూసుకుని త్వరలోనే అడుగుపెడతానని చెప్పాడు. ఇక ఆది టీమ్‌లోని రైజింగ్ రాజు కూడా రెండు మూడు వారాలుగా సందడి చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో దొరబాబు, రాంప్రసాద్‌లతో కలిసి చేసిన సందడి నవ్వు తెప్పిస్తోంది.

రాంప్రసాద్, దొరబాబులు ఓ పెళ్లి కార్యక్రమం దగ్గరికి వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. నేను డాక్టర్ కొమరం శృంగార నిపుణుడిని అని పరిచయం చేసుకుంటాడు. పెళ్లయిన తర్వాత మూడు రాత్రులు ఉంటాయి కదా. మీరే దగ్గరుండి చూసుకోవాలని రాంప్రసాద్ చెబుతాడు. వీడు ఈ రాత్రికే పోయేలా ఉన్నాడు.. మూడు రాత్రులు ఏముంటాడని అంటాడు దొరబాబు. పెళ్లి కూతురిని చూడగానే రైజింగ్ రాజు.. బొండం కిందపడేసి వణికిపోతుంటాడు. ఏం జరిగిందోనని అంతా కంగారుపడుతుండగా.. ఏం కాలేదు తాత తన ఫోన్‌ని వైబ్రేషన్‌లో పెట్టుకున్నాడని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

తర్వాత జీలకర్ర బెల్లం పెట్టగా రాజు కిందపడిపోతాడు. తాతకి షుగర్ ఉంది కదా జీలకర్ర బెల్లం డైరెక్ట్‌‌గా లోపలికి వెళ్లిపోయినట్లుగా ఉంది. జీలక్రర, బెల్లం వెళ్లిపోవడం ఏంటని రాంప్రసాద్ అడగ్గా.. తాతకి హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. బెల్లం పెట్టగానే లోపలికి వెళ్లిపోయింది.. షుగర్ కదా అనడంతో అంతా నవ్వేస్తారు. పెళ్లి అవ్వగానే తాతకి లేటు వయసులో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. పెళ్లాం ఒక పట్టు పట్టగానే రైజింగ్ రాజు పేషెంట్‌గా మారతాడు. తాతకి నడుం పట్టేసినట్లుగా ఉందని రాంప్రసాద్ అనగా.. కాదండి కొంచెం డోస్ ఎక్కువైనట్లుగా ఉంది, నిక్కపొడుచుకుపోయినట్లుగా ఉన్నాడని అంటాడు దొరబాబు.

బుల్లెట్ భాస్కర్ - ధనరాజ్‌లు ల్యాండ్ స్కామ్‌లో సెలబ్రిటీలు ఎలా ఇరుక్కుంటారు, బాధితుల పరిస్ధితులపై ఫన్నీగా చేసిన స్కిట్ బాగుంది. తనకు పెళ్లవ్వడం లేదని స్వామిజీని కలుస్తాడు ధనరాజ్. తన గ్రహల మార్పుకు ట్రంపే కారణమని తెలిసి తిట్టుకుంటాడు. ఇంటిలో పాములను పెంచుకునే టెనెంట్‌గా రాకెట్ రాఘవ నవ్వించాడు. చివరిలో పిసినారి పెళ్లాంగా రోహిణి రెడ్డి ఆకట్టుకుంది. తాగుబోతు రమేశ్ బొక్కలు పడిన నిక్కర్‌ని ఎందుకు మార్చానో వివరిస్తూ చేసిన స్కిట్ బాగుంది. ఈ వారం ప్రోమో వైరల్ అవుతుండగా.. వీరిలో ఎవరు హిట్ కొడతారో చూడాలి.

Read more about: jabardasth nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X