బుల్లెట్ భాస్కర్‌ ఆఫర్‌కి శాంతి టెంప్ట్.... రూమ్‌లోకి రావాలంటూ?

Photo Courtesy: ETV Jabardasth

గడిచిన 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో. తెలుగులో టాప్ కామెడీ షోగా వెలుగొందుతున్న ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా రెడీ అవుతోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా సరికొత్త పంచ్‌లు, స్కిట్‌లతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. దీనిని పరిశీలిస్తే..

రైజింగ్ రాజు లేటు వయసులో పెళ్లి చేసుకుంటూ ఉండటంతో డాక్టర్లంతా అక్కడే ఉంటారు. రాంప్రసాద్ న్యూరాలజిస్ట్‌గా, దొరబాబు శృంగార నిపుణుడిగా ఎంట్రీ ఇస్తారు. ఆ వెంటనే రైజింగ్ రాజు పెళ్లికొడుకు గెటప్‌లో ఎంట్రీ ఇస్తాడు. అతనిని చూడగానే వీడు ఈ రాత్రే పోయాడు.. మూడు రాత్రుళ్లు ఏం ఉంటాడంటూ దొరబాబు సెటైర్ వేస్తాడు. ఎలాగోలా పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ భార్యతో స్టెప్ వేస్తుండగా రాజుకి నడుం పట్టేయడంతో డాక్టర్లంతా వచ్చి చెక్ చేస్తారు.

Jabardasth Latest Promo Rising Raju Wedding Comedy Bullet Bhaskar Real Estate Skit Goes Viral

Photo Courtesy: ETV Jabardasth

ఆ వెంటనే నేను ముత్యాల చెమ్మచెక్క అనే రియల్ ఎస్టేట్ వెంచర్‌కి మిమ్మల్ని పిలవడానికి వచ్చానని భాస్కర్‌తో అంటాడు ధనరాజ్. 15 లక్షల రూపాయలకు జీఎస్టీ కలిపి బ్యాంక్‌లో వేయమంటాడు భాస్కర్. వెంచర్ దగ్గరికి వచ్చి మీకు 100 అడుగులకే నీళ్లు వస్తాయని అంటాడు భాస్కర్. ఆ మాట వినగానే మొత్తం కొండలు 1000 అడుగులు తీయాలి పేదవాళ్లని మోసం చేయొద్దని అంటాడు ధనరాజ్. వెంచర్ నుంచి ఓఆర్ఆర్‌కి 5 నిమిషాల్లో వెళ్లొచ్చని చెబుతాడు భాస్కర్. ఓఆర్ఆర్ 3000 కిలోమీటర్ల అవతల కట్టామని చెబుతాడు ధనరాజ్. 100 గజాలు కొంటే ఫోటో.. 200 గజాలు కొంటే చేయి వేస్తా.. 300 గజాలు కొంటే హగ్ ఇస్తానని ఆఫర్ ఇస్తాడు భాస్కర్. అయితే రూమ్‌లోకి రావాలంటే ఎన్ని కొనాలని శాంతి స్వరూప్ అనడంతో భాస్కర్ షాక్ అవుతాడు. నీ మాటలు నమ్మి నా చెల్లి పెళ్లికి దాచుకున్న డబ్బుల్ని తీసుకెళ్లి ఫ్లాట్స్ కొంటే అక్కడేం లేవు, మోసపోయాం పోలీస్ స్టేషన్ ఉందని బుల్లెట్ భాస్కర్‌తో శాంతి గొడవ పడుతుంది.

Also Read
'ఆమెతో అలా కోల్డ్‌వార్... జట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లాం’
'ఆమెతో అలా కోల్డ్‌వార్... జట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లాం’

ఆ తర్వాత తన జాతకం చెప్పమంటూ స్వామిజీని కలుస్తాడు ధనరాజ్. నీది 1000 మందిలో ఒకడికి ఉండే చెండాలమైన జాతకం అంటాడు స్వామిజీ. కుజుడు నీతో ఖోకో, కబడ్డీ ఆడుతున్నాడని చెబుతాడు. ఇరాన్ వాళ్లు ఇజ్రాయెల్ మీద మిస్సైల్ వేశారు కదా దాంతో కుజుడు ఎడమ వైపుకి మారిపోయాడని అంటాడు స్వామిజీ. ఈ ట్రంప్ గాడు ప్రపంచం మొత్తం కంపు చేస్తున్నాడనుకున్నా కానీ నా జీవితం కంపు చేస్తాడని అనుకోలేదని ధనరాజ్ అనడంతో అంతా నావ్వేస్తారు.

Recommended For You
డాక్టర్‌ బాబుపై మనసుపడ్డ ఆ అమ్మాయి.. అలా మిస్ అయ్యానంటూ..
డాక్టర్‌ బాబుపై మనసుపడ్డ ఆ అమ్మాయి.. అలా మిస్ అయ్యానంటూ..

నాకు పెట్స్ అంటే చాలా ఇష్టమని పాముని పెంచుకుంటూ అప్పారావుని భయపెడతాడు రాకెట్ రాఘవ. పాముని పట్టడానికి వచ్చిన పాములోడు కూడా వణికిపోతాడు. మరో స్కిట్‌లో తాగుబోతు రమేష్, రోహిణిలు వస్తారు. పిసినారి భార్యగా రోహిణి అదరగొట్టేసింది. అండర్‌వేర్ ఎందుకు కొన్నావు? కనపడని వాటి కోసం ఖర్చుపెట్టొద్దని చెప్పాను కదా అని రమేశ్‌పై మండిపడుతుంది. ఎందుకు కొత్తవి కొన్నావని రోహిణి అడగ్గా.. పాతవాటికి 24 బొక్కలు పడ్డాయని రమేశ్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు. 24 బొక్కలు పడితే దానిని బొక్కలు అనరు.. చినిగిపోయిందని అంటారని నాగబాబు పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు. పెళ్లికి వెళ్లి గిఫ్ట్‌గా కుక్కర్ ఇస్తుంది రోహిణి. అయితే పెళ్లి ఆగిపోవడంతో కుక్కర్ లాక్కోవడానికి పరిగెడుతుంది.

You May Also Like
Samantha: ఆయనతో గొడవలు లేవు... తేల్చేసిన సమంత
Samantha: ఆయనతో గొడవలు లేవు... తేల్చేసిన సమంత

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రైజింగ్ రాజు శోభనం జరిగిందా? తనను మోసం చేసిన ధనరాజ్‌ని బుల్లెట్ భాస్కర్ ఎలా పట్టుకున్నాడు? ధనరాజ్ జాతకాన్ని స్వామిజీ ఎలా మార్చాడు? రాకెట్ రాఘవ పాము దొరికిందా? పెళ్లికి వెళ్లిన రోహిణి గిఫ్ట్‌గా కుక్కర్‌ను ఇచ్చిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే మే 29, 30 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోను చూసేయాల్సిందే.

Read more about: jabardasth nagababu rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X