ఆ సుఖం కోసం తహతహ... మగాడి కళ్లన్నీ మా శరీరంపైనే.. బిగ్‌బాస్ రోహిణి

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

కొత్తగా ఈ వారం ఆంధ్రా- తెలంగాణలకు చెందిన ముగ్గురు కంటెస్టెంట్స్‌తో కూడిన కొత్త టీమ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈవిడది నా భార్య.. నాది తెలంగాణ, ఈమెది గోదావరి అని.. తన తల్లిదండ్రులు, అత్తమామలను పరిచయం చేస్తాడు. తల్లిదండ్రులు, అత్తమామలకు మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్‌లో కొత్త కుర్రాడు ఇరగదీశాడు. మర్యాదల గురించి మాట్లాడాలంటే మా గోదారోళ్ల తర్వాతే.. రాజమండ్రి రోజ్ మిల్క్ నుంచి చేబ్రోలు చేపల పులుసు దాక.. కాకినాడ గొట్టం కాజా నుంచి ఆత్రేయపురం పూతరేకుల దాకా. కొత్త అల్లుడు పండక్కి ఇంటికొస్తే 600 రకాల పిండి వంటలు వండిపెట్టే చరిత్ర ఒక్క మా గోదారోళ్లకే ఉంది అంటుంది కోడలు. దాంతో అత్తగారు సీరియస్ అవుతూ.. మా తెలంగాణ గురించి చెప్పాలంటే బోయిన్‌పల్లి బోటికూర నుంచి జోగిపేట్ జొన్నరొట్ట దాకా.. పాతబస్తీ పాయ నుంచి ప్యారడైజ్ బిర్యానీ దాకా అంటుంది.

Jabardasth Latest Promo Rocket Raghava Re-Entry Rowdy Rohini Comedy Skits Go Viral

ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ తన టీమ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రాకెట్ రాఘవ జబర్దస్త్‌లో రీ ఎంట్రీ ఇచ్చి అలరించాడు. నా చిన్నప్పటి ఫ్రెండ్‌ కొడుక్కి మన అమ్మాయిని ఇద్దామని పనివాడుతో చెబుతాడు రాంప్రసాద్. పెళ్లి కొడుకుగా రాకెట్ రాఘవ వస్తాడు. అమెరికాలో ఏం చేస్తావని అడగ్గా.. బుల్లెట్ ట్రైన్స్ ముందు బుల్లెట్స్ వేసుకుని వెళ్తాను నేను అలా వెళ్లడం వల్లే దానికి బుల్లెట్ ట్రైన్స్ అని పేరొచ్చింది అంటాడు రాఘవ. మీరేం చేస్తారని అడగ్గా.. ఎయిర్‌పోర్ట్‌లో రన్ వే ఉంది కదా దాని మీద రన్నింగ్ చేస్తుంటా నేను రన్నింగ్ చేయడం వల్లే దానిని రన్ వే అంటారని రాంప్రసాద్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

అనంతరం పొట్టి నరేష్, ఫైమా, శాంతి స్వరూప్‌లు వస్తారు. రేపు నేను చచ్చిపోతే మీ పరిస్థితి ఏంటీ అని నరేష్ అడగ్గా.. మీరు చచ్చిపోతే మాకు చావే దిక్కని ఫైమా, మీరు చచ్చిపోతే నా జీవితం హైవే అని శాంతి స్వరూప్ అంటారు. చనిపోయిన తర్వాత తన భార్యలు కింద ఏం చేస్తున్నారో చూద్దామని పొట్టి నరేష్ ఆత్మలా రాగా.. పూర్తిగా మారిపోయి మోడ్రన్ డ్రెస్స్‌లో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు.

మరో స్కిట్‌లో రాకింగ్ రాకేష్, రౌడీ రోహిణిలు కొత్తగా పెళ్లయిన జంటల్లా వస్తారు. ఈరోజు మంచం షేక్ అవుతుంది అంటూ ఊగిపోతాడు రాకేష్. అది తర్వాత షేక్ చేద్దాం.. ముందు కాళ్లు షేక్ అవుతున్నాయి, దానిని ఆపండి ముందు అంటూ పంచ్ వేస్తుంది రోహిణి. నువ్వు నా మీద బ్యాక్ టూ బ్యాక్ పంచ్‌లు వేస్తున్నావని రాకేష్ అడగ్గా.. బ్యాక్ టూ బ్యాక్ పంచ్‌లు వేశాం కాబట్టే బ్యాక్ టూ బ్యాక్ విన్నింగ్ కొడుతున్నాం. లేదంటే గో బ్యాక్ డోంట్ కమ్ బ్యాక్ అంటారు. మీకే కొంచెం కష్టం, నాదేముంది నాలుగు కూరలు, నాలుగు రకాలు ఎక్కడైనా తినేస్తాను అంటుంది రోహిణి. ఫస్ట్ నైట్ కోసం రాకేష్ టెన్షన్ పడుతుండగా.. ఈ దేహం కోసం తాపత్రయపడుతున్నావ్ తీసుకో అంటుంది రోహిణి. అలా మాటలతో గుచ్చి చంపొద్దు.. నాలో మానవత్వమైన మనిషి నిద్రలేచాడు అంటాడు రాకేష్. నీకు నడుము ఎలాగూ లేవలేదు, కనీసం మనిషైనా లేచాడు అంటూ పంచ్ వేస్తుంది రోహిణి దాంతో అందరూ నవ్వేస్తారు.

ఆ తర్వాత శ్రీకాకుళం బ్యాచ్ ఎంట్రీ ఇచ్చి మందు తాగుతూ, తమ బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. తెలంగాణ- ఆంధ్రాల మధ్య గొడవ ఎలా తీరింది? రాకెట్ రాఘవకు పెళ్లయ్యిందా లేదా? పొట్టి నరేష్ తమ భార్యలకు ఎలా బుద్ధి చెప్పాడు? రోహిణి- రాకేష్‌‌లకు శోభనం జరిగిందా? లేదా? అన్నది తెలియాలంటే ఏప్రిల్ 3, 4 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X