నాగబాబు కారు తాకట్టు పెట్టేశాడా? రాకెట్ రాఘవపై ఇంద్రజ ఫైర్ !

Jabardasth Latest Promo: గత 13 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ వారం కూడా నవ్వుల విందుకు సిద్ధమైంది. ఇటీవల నాగబాబు రీ ఎంట్రీ తర్వాత షోలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అంతే కాదు ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు ఆయన ప్రకటించిన నగదు బహుమతుల పథకం హాట్ టాపిక్‌గా మారింది. బెస్ట్ స్కిట్, బెస్ట్ పంచ్ డైలాగ్‌లకు వారంవారీగా ప్రైజ్ మనీతో పాటు, పది వారాల్లో బెస్ట్ స్కిట్‌కు రూ.50 వేల బహుమతిని కూడా ప్రకటించారు. ఇదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని ఈ వారం స్కిట్లు రూపొందినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తోంది.

Also Read
Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!
Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!

ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేయగా, అందులో బుల్లెట్ భాస్కర్, రాకెట్ రాఘవ టీంలు తమదైన కామెడీతో హంగామా చేశారు. ముఖ్యంగా నాగబాబు, ఇంద్రజలపై వేసిన పంచ్‌లు, వారి రియాక్షన్స్ ఈ ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రోమో ప్రారంభంలోనే బుల్లెట్ భాస్కర్ ఓ స్టార్ హీరో పాత్రలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసిన యాంకర్ రష్మీ సరదాగా, 'హీరో గారు కాస్త లావయ్యారు అనాల్సింది.. హీరో బలిసిపోయారు అనేసింది' అంటూ నోరు జారింది. ఆ పంచ్ వేయడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగిపోతుంది.

Jabardasth Latest Promo Rocket Raghava Roasts Nagababu Indraja s Reaction Goes Viral
Recommended For You
ఆలియా భట్‌కు ప్రభాస్ సపోర్ట్.. ఆ రూమర్స్ మళ్లీ వైరల్!
ఆలియా భట్‌కు ప్రభాస్ సపోర్ట్.. ఆ రూమర్స్ మళ్లీ వైరల్!

ఆ తర్వాత దర్శకుడి పాత్రలో నరేష్ కనిపిస్తాడు. సినిమాలో హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్‌ను షూట్ చేయాలని భావిస్తాడు. నీ బుల్లెట్ భాస్కర్ మాత్రం ప్రేమగా నటించాల్సిన చోట ఉగ్రరూపం చూపిస్తూ హీరోయిన్‌ను కొట్టేస్తాడు. ఆ సన్నివేశం చూసి అక్కడున్న వారంతా పడి పడి నవ్వుతారు. జడ్జిగా ఉన్న ఇంద్రజ మాత్రం ఆశ్చర్యపోతూ చూస్తుండగా, రష్మీ వెంటనే "కట్... కట్... ఇంద్రజ గారికి ఆల్మోస్ట్ గుండె ఆగినంత పని అయింది" అంటూ మరో ఫన్నీ పంచ్ వేస్తుంది.

You May Also Like
అందుకే పవన్ కళ్యాణ్, నాని సినిమాలు రిజెక్ట్ చేశా.. ఫోక్ బ్యూటీ నాగదుర్గ కామెంట్స్ వైరల్!
అందుకే పవన్ కళ్యాణ్, నాని సినిమాలు రిజెక్ట్ చేశా.. ఫోక్ బ్యూటీ నాగదుర్గ కామెంట్స్ వైరల్!

అయినా బుల్లెట్ భాస్కర్ తన కామెడీని కొనసాగిస్తాడు. ఇదే సమయంలో ఓ ప్రేక్షకుడు "హీరోలు ఇలా లావుగా ఉంటారా?"అని ప్రశ్నించగా, భాస్కర్ తనదైన స్టైల్‌లో"ప్రేక్షకులు హీరోల పొట్ట చూడడానికి రారు... హీరోయిన్ల ముఖం చూడడానికే వస్తారు" అంటూ కౌంటర్ ఇస్తాడు. వెంటనే రష్మీ "ఆ రెండు కలిపితేనే మీ ముఖం"అంటూ మరోసారి సెటైర్ వేయడంతో స్టేజ్ నవ్వులతో మార్మోగిపోతుంది. దానికి భాస్కర్ కూడా ఏమాత్రం తగ్గకుండా రష్మీపైనే మరో ఫన్నీ పంచ్ వేస్తూ స్కిట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేస్తాడు.

ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి
ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి

ఇక ప్రోమోలో మరో ప్రధాన ఆకర్షణగా రాకెట్ రాఘవ టీం స్కిట్ నిలిచింది. హరికథ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ స్కిట్‌లో నాగబాబు పాత్రలో పటాస్ ప్రవీణ్ ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసిన అప్పారావు (వడ్డీ వ్యాపారీ).."బాబు గారు... మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?"అని అడగగా, నాగబాబు పాత్రధారి తన కారు తాళాలు ఇస్తూ ఈ కారును తాకట్టు పెట్టి వెంటనే ఐదు లక్షలు కావాలి. జబర్దస్త్‌లోని పిల్లలను ఎంకరేజ్ చేయాలంటే డబ్బు అవసరం"అని చెబుతాడు. అప్పుడే రాకెట్ రాఘవ టీం హరికథ రూపంలో ఎంట్రీ ఇచ్చి నాగబాబుపై పేరడీ పాట పాడుతూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది.

బిగ్‌బాస్‌కు వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి.. అలా ఉండటం నావల్ల కాదు
బిగ్‌బాస్‌కు వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి.. అలా ఉండటం నావల్ల కాదు

"తాకట్టు పెట్టారు కారు... అయినా మారలేదు తీరు... అయినా కంట కన్నీరు" అంటూ పాడగా.. పాటకు ప్రేక్షకులు, జడ్జిలు నవ్వులు ఆపుకోలేకపోతారు. స్కిట్‌లో ఇంద్రజ పాత్రను కూడా వినూత్నంగా చూపించారు. నాగబాబు కారు తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న ఇంద్రజ పాత్రధారి తన చేతిలో ఉన్న కడియాన్ని తీసి అప్పారావుకు ఇస్తూ, "ఇది తీసుకుని నాకు పది లక్షలు ఇవ్వండి"అంటుంది. దీంతో అప్పారావు ఆశ్చర్యపోతూ "అరె అమ్మా.. ఒడియంగాల కోసం మీరు మీ కడియాన్ని అమ్మేస్తారా? అంటూ ప్రశ్నించగా.. వెంటనే ఇంద్రజ..వాళ్ళ వాయిస్ లో డెప్త్ ఉంటుంది అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఇలా చేశా' అంటూ క్లారిటీ ఇస్తుంది. దీంతో వెంటనే నటి ఇంద్రజ నవ్వుతూ "ఓరి దరిద్రుల్లారా!" అంటూ సరదాగా రాకెట్ రాఘవ టీంపై ఫైర్ అవుతుంది.

బిగ్ బాస్‌కు వెళ్లితే కెరీర్ క్లోజ్ అవుతుందా? మాజీ కంటెస్టెంట్ షాకింగ్ సమాధానం!
బిగ్ బాస్‌కు వెళ్లితే కెరీర్ క్లోజ్ అవుతుందా? మాజీ కంటెస్టెంట్ షాకింగ్ సమాధానం!

అయితే అక్కడితో ఆగని రాకెట్ రాఘవ టీం, ఇంద్రజపై మరో పేరడీ పాట పాడుతూ స్కిట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేస్తుంది. "అమ్మగారికి మంచి హృదయం... చెన్నై నుంచి వచ్చింది ఉదయం... అమ్ముకున్నారయ్యో కడియం... అందరికీ ఇచ్చింది అభయం"అంటూ పాడిన పేరడీ సాంగ్‌కు స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగిపోతుంది. మొత్తంగా చూస్తే ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్‌లో బుల్లెట్ భాస్కర్ కామెడీ, రాకెట్ రాఘవ హరికథ, నాగబాబు-ఇంద్రజలపై వేసిన ఫన్నీ పంచ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పూర్తి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: indraja jabardasth naga babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X