అలాంటి మాటలతో గుండె ముక్కలు... యాంకర్ రష్మీ గౌతమ్ భావోద్వేగం

తెలుగు ప్రేక్షకులకు దాదాపు 13 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. నిహారిక కొణిదల నిర్మాణంలో తెరకెక్కిన రాకాస మూవీ టీమ్ నుంచి హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారికలు ఈ వారం జబర్దస్త్‌లో సందడి చేశారు. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..

తొలుత ఆటో రాంప్రసాద్‌తో కలిసి సంగీత్ శోభన్, నయన్ సారికలు స్కిట్ చేశారు. మీ శాలరీ కరెక్ట్‌గా ఎంత వస్తుందో చెప్పండి అని రాంప్రసాద్ అడగ్గా.. 2 లక్షలు వస్తుంది, ట్యాక్స్‌లు పోను 20 వేలు వస్తుందని శోభన్ చెప్పగా రాంప్రసాద్ షాక్ అవుతాడు. నేను ట్యాక్సిలలో ఎక్కువ తిరుగుతానని సంగీత్ అనడంతో అంతా నవ్వేస్తారు. మరి నీ శాలరీ ఎంతని సంగీత్ అడగ్గా.. నాకు వన్ లాక్ వస్తుంది, కటింగ్స్ పోను 10 వేలు వస్తుంది ఎందుకంటే నేను ఎక్కువ కట్ చేసుకుంటానని అంటాడు రాంప్రసాద్.

Jabardasth Latest Promo Rowdy Rohini Hilarious Skits Rakasa Movie Team Entry and Comedy Highlights This Week

ఇంతలో నయన్ సారిక వచ్చి ప్రభాస్ గారు అని పిలుస్తుంది. ఈ హెయిర్ స్టైల్, గడ్డం చూసి అందరూ ప్రభాస్ అనుకుంటారని రాంప్రసాద్ చెప్పగా.. మా హీరోయిన్‌కి ఫస్ట్ కళ్లద్దాలు పెట్టాలని సెటైర్లు వేస్తుంది నిహారిక. మీ గోల్ ఏంటీ అని రాంప్రసాద్ అడగ్గా.. నాకు మహేశ్ బాబుగారి పక్కన హీరోయిన్‌గా చేయాలని అంటుంది. అందరూ నన్ను బయట మహేశ్ బాబు అని అంటారు.. నాతో చేయొచ్చు కదా అని అంటాడు రాంప్రసాద్. మహేశ్ బాబు గారు అంటే వారణాసి.. మీరంటే సన్నాసి అని సారిక పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు.

మరో స్కిట్‌లో శ్రీకాకుళం టీమ్ వచ్చి.. మొన్న రష్మిగారి తగువు తీర్చాం కదా? మరి డబ్బులిచ్చారా అని పనివాడు అడుగుతాడు. ఆవిడకి వచ్చిందే 4 వేలు.. ఇక మనకేం ఇస్తుంది అంటాడు ఓనర్. అది కరెక్టే.. మీకు మేకప్‌కి సరిపోదు ఉంచుకోండని రష్మిపై పంచ్ వేస్తాడు. ఆ మాటలతో జడ్జి కృష్ణభగవాన్ రియాక్ట్ అవుతూ.. పాపం ఆవిడ ఏం అనుకోదని అంటాడు. అనుకున్నా ఏం బయటకు చెప్పలేను భరించాల్సిందేనంటూ ఓ డైలాగ్ వదులుంది రష్మి. ఆ పెద్దమనిషి ఊరివాళ్ల సమస్యలు వింటూ ఇచ్చే తీర్పులు నవ్వు తెప్పించాయి.

ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్‌లు ఎంట్రీ ఇస్తారు. పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించానని భాస్కర్ గురించి చెబుతుంది. వెంటనే నరేష్.. భాస్కర్ దగ్గరికి వెళ్లి మీ లవర్‌తో నాకు పెళ్లయ్యింది దానిని మీకు అప్పజెబుదామని వచ్చానని అంటాడు. దాంతో హ్యాపీగా కాపురం చేసుకోమని బుల్లెట్ భాస్కర్ చెప్పగా.. కుక్కర్లు, డ్రమ్ములు నా వల్ల కాదు.. అది నన్ను చంపేస్తే ఎవరు రెస్పాన్సిబులిటి. నీకైతే డ్రమ్ము.. నాకైతే కుక్కర్ చాలని పొట్టి నరేష్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

మరో స్కిట్‌లో కొత్త అమ్మాయి వచ్చి.. ఎవరైనా అణుబాంబుకి భయపడతారో లేదో కానీ, అమావాస్య వచ్చిందంటే భయపడతారు. నిహారికకు గిఫ్ట్ పంపించానని చెబుతుంది. అది చూసిన మెగా డాటర్‌ ఏంటిది అని అడుగుతుంది. మీరు ప్రమోషన్స్ అని గాలికి తిరుగుతున్నారు కదా ఏ గాలి, ధూళి మీకు తగలకుండా పంపించా. రాత్రిపూట ఇంటికి వెళ్లేటప్పుడు దిష్టి తీసుకుని వెళ్లండని అంటుంది. నువ్వయితే అస్సలు బయటకు రావొద్దని చెప్పగా.. ఎందుకు అని రష్మి అడుగుతుంది. చందమామ బయటకొస్తే అమావాస్యపోయి పౌర్ణమి అవుతుంది కదా అని పంచ్ విసురుతుంది ఆ లేడీ కమెడియన్.

ఆ వెంటనే రాకేష్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఎంట్రీ ఇచ్చి.. మీ అందరికీ వదినని చూడాలని ఉందా అని అభిమానులను అడుగుతాడు. ఆవిడ ముఖం చూడగానే వదిన వదిన అనడానికి బదులు వద్దన్నా వద్దన్నా అని అరుస్తారు ఫ్యాన్స్. ఇంతలో రోహిణి వచ్చి.. ఆవిడని పెళ్లి చేసుకోవద్దని అడుగుతుంది. కావాలంటే పర్సనల్‌గా ఏమైనా చేసుకోండి.. పెళ్లి మాత్రం చేసుకోవద్దని అంటుంది. అయినప్పటికీ వినకుండా రాకేష్ పెళ్లి పీటల మీద కూర్చోవడంతో నక్క అరిచినట్లుగా అరిచిన రోహిణి.. జీలకర్ర - బెల్లం తినేస్తుంది. నీ పెళ్లాం కంటే బెల్లమే బాగుందని అనడంతో అంతా నవ్వేస్తారు.

మరో స్కిట్‌లో పటాస్ ప్రవీణ్ - చలాకీ చంటీలు వస్తారు. పటాస్ ప్రవీణ్ చేస్తున్న మేజిక్ షోని బూటకమని నమ్మిస్తూ చంటీ చేసిన విన్యాసాలు నవ్వు తెప్పించాయి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. హీరో హీరోయిన్ల నుంచి ఆటో రాంప్రసాద్ ఎలా తప్పించుకున్నాడు? ఊరి పెద్ద తేల్చిన పంచాయతీ ఏంటీ? ఫైమాని బుల్లెట్ భాస్కర్ తిరిగి పెళ్లి చేసుకున్నాడా? హీరో రాకేష్‌ పెళ్లిని రోహిణి ఎలా చెడగొట్టింది? అనేది తెలియాలంటే మార్చి 27, 28 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం చూసేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X