సబ్‌స్క్రిప్షన్ గేట్లు ఓపెన్ చేసిన రష్మి గౌతమ్? జబర్దస్త్ యాంకర్ ప్లాన్ ఎంతంటే?
గడిచిన 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో. తెలుగులో టాప్ కామెడీ షోగా వెలుగొందుతున్న ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా రెడీ అవుతోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా సరికొత్త పంచ్‌లు, స్కిట్‌లతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. దీనిని పరిశీలిస్తే..
ప్రస్తుతం సెలబ్రిటీలందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో భారీగా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొందరు సెలబ్రిటీలు వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. ఇదే అంశంపై జబర్దస్త్‌లో ఈ వారం ఫన్నీ స్పూఫ్ చేశారు. తొలుత దొరబాబు, రాంప్రసాద్, రైజింగ్ రాజు టీమ్ ఎంట్రీ ఇచ్చింది. నేను మీ హారితని ఇక నుంచి మీకు వీడియోలు కావాలి, పోస్ట్‌లు కావాలంటే సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తెచ్చాను.. కేవలం 399కే అంటుంది. ఆ వెంటనే రైజింగ్ రాజు లేడీ గెటప్‌లో వచ్చి 99 రూపాయలకే అందమైన ఫోటోలు అని చెప్పడంతో అర్జెంట్‌గా అన్ సబ్‌స్క్రైబ్ చేయండి అంటూ నాగబాబు పంచ్ పేలుస్తాడు.

నేను 400 పెట్టి హరితకి సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నానని రాంప్రసాద్ చెప్పగా.. ఓ వ్యక్తి వచ్చి నా అకౌంట్‌లో 200 మాత్రమే ఉన్నాయని అంటాడు. అయితే 100 నాకిచ్చి, మిగిలిన వందతో ముసలిదానిని సబ్‌స్క్రైబ్ చేసుకోమని చెబుతాడు రాంప్రసాద్. హరిత వచ్చి ఆకలేస్తే అన్నం పెడతాననే సాంగ్‌కి డ్యాన్స్ వేయగా.. నేను దానికి కామెంట్ పెడతానని వెళ్తాడు దొరబాబు. ఏమని పెడతావని రాంప్రసాద్ అడగ్గా.. ఆకలేస్తే అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ మూడొస్తే ముద్దులు పెట్టమని అనడంతో అంతా నవ్వేస్తారు.
రైజింగ్ రాజు వీడియో రావడంతో తొందరగా పంపించేయండ్రా చూడలేకపోతున్నామని నాగబాబు.. ఇది ఏంజెల్ ప్రియ కాదు, ఏజ్డ్ ప్రియ అని ఇంద్రజ సెటైర్లు వేస్తారు. ఈ ముసలిదాన్ని ఎవరో ఫాలో అవుతున్నాడు ఎవడ్రా వాడు అని రాంప్రసాద్ చెక్ చేయగా నేనే అని అంటాడు దొరబాబు. నీ అంత దరిద్రుడు ఎవడు లేడయ్యా అనడంతో అంతా నవ్వేస్తారు. చివరిలో కామెంట్ ఇచ్చేటప్పుడు యాంకర్ రష్మి వచ్చి.. మనలో మన మాట.. రష్మి గౌతమ్, సబ్‌స్క్రిప్షన్ 399 అనడంతో అంతా షాక్ అవుతారు. దీంతో రష్మి కూడా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టేసిందా? లేక స్కిట్‌లో ఫన్నీ కామెంట్ చేసిందా అన్నది ప్రోమోలో తెలియరాలేదు.
తర్వాతి స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌లు వస్తారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టయినా సరే నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు బుల్లెట్ భాస్కర్. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని అంటాడు భాస్కర్. అయితే వెంటనే గుడికి వెళ్లి తాళి కట్టుకుని రమ్మని చెబుతాడు తల్లి వేషంలో ఉన్న నరేష్. మీరు కూడా రండి అని భాస్కర్ అడగ్గా.. నా ఒంటి మీద కనీసం బంగారం కూడా లేదు.. గుడికి వస్తే సూటిపోటలు అంటారు అంటాడు. అయితే ఆ నగలు నేను తీసుకొచ్చి మీ ఒంటిపై వేస్తానని భాస్కర్ అనగా.. పరాయి సొమ్ము పాము లాంటిది కాటేసి మింగేస్తుందని చెబుతాడు. ఇల్లు అమ్మేసి డబ్బు తీసుకొస్తాడు భాస్కర్. మీ జాతకంలో దోషం ఉంది.. దానికి పరిహారం చేయాలంటే 10 లక్షలు ఖర్చవుతుందని మరో 10 లక్షలు తీసుకురమ్మని నరేష్ చెప్పడంతో సరేనని అంటాడు భాస్కర్.
ఆ వెంటనే పంచ్ ప్రసాద్, రౌడీ రోహిణిలు ఎంట్రీ ఇస్తారు. నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని రోహిణి చెప్పగానే.. నిన్ను ఎలా మరిచిపోవాలని పంచ్ ప్రసాద్ అడుగుతాడు. స్కిట్‌లో డైలాగ్స్ ఎలా మరిచిపోతావో అలాగే నన్ను మరిచిపొమ్మని పంచ్ విసురుతుంది రోహిణి. నాకు దొక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదని రోహిణిపై విసురుతాడు ప్రసాద్. పాము కరిచినప్పటికీ రోహిణి చనిపోకపోవడంతో కత్తితో పొడుస్తాడు ప్రసాద్.. ఆసుపత్రికి వెళ్దామని తాగుబోతు రమేశ్ చెప్పగా బట్టలు ఉతికి ఆరబెట్టినాక వెళ్దామని అంటుంది. హాస్పిటల్‌లో ఫుడ్ కావాలి క్యారేజ్ వండుకుని వెళ్దామని చెబుతుంది రోహిణి. అప్పటికీ లాభం లేకపోవడంతో రోహిణిని కాలుస్తాడు ప్రసాద్.. అయినా హాస్పిటల్‌కి వెళ్లదు రోహిణి.
ఇక చివరిలో యాంకర్ రష్మి దగ్గర అన్ని వివరాలు తీసుకున్న ధనరాజ్ నీకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని అంటాడు. ఇంద్రజ గారికి నెలకు 2 వేలే అనడంతో ఆమె షాక్ అవుతుంది. పెద్దోళ్లు, కీళ్లనొప్పులు అక్కడి దాకా రాలేరు.. ఇంటికే వచ్చి డబ్బులు ఇవ్వమని చెబుతాడు. నీకు వీల్ చైర్ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో రష్మి షాక్ అవుతుంది. ఇంద్రజ గారికి ఇచ్చానని చెప్పడంతో ఆమె ఫైర్ అవుతుంది. ఆ తర్వాత స్కిట్‌లో అప్పారావు, రాకెంట్ రాఘవలు మామ అల్లుళ్లుగా ఎంట్రీ ఇస్తారు. రాకెట్ రాఘవ పోలీస్‌గా, మామగారిగా అప్పారావు నటించారు. స్టేషన్‌లో దొంగలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిజంగానే రష్మి గౌతమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఓపెన్ చేసిందా? బుల్లెట్ భాస్కర్ సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాడా? రోహిణి ఆసుపత్రికి వెళ్లిందా? లేదా అనేది తెలియాలంటే ఈ శుక్ర, శనివారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications




