జబర్దస్త్‌లో ఆ టీమ్‌ని లేపేశారా? అప్పారావు షాకింగ్ కామెంట్స్.. నాగబాబు రియాక్షన్ ఇదే

Photo Courtesy: MallemalaTV

గడిచిన 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో. తెలుగులో టాప్ కామెడీ షోగా వెలుగొందుతున్న ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా రెడీ అవుతోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా సరికొత్త పంచ్‌లు, స్కిట్‌లతో రెడీ అయ్యింది. ఈ వారం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ టీమ్ నుంచి హీరో వడ్డే నవీన్, హీరోయిన్ రాశి సింగ్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. దీనిని పరిశీలిస్తే..

తొలుత పొట్టి నరేష్ బందిపోటులా ఎంట్రీ ఇచ్చి.. ఏరా సైంటిస్ట్ నాకు తెలియకుండా గవర్నమెంట్‌కి ఏదో ఫార్మూలా కనిపెట్టావంట అని అడుగుతాడు. ఆ ఫార్ములా నీకు దక్కనివ్వనని సైంటిస్ట్ ఫ్యామిలీ అనగా సైంటిస్ట్‌ని, అతని కుటుంబాన్ని చంపేస్తాడు నరేష్. పిల్లలు పారిపోయి పెరిగి పెద్దయిన తర్వాత దొరబాబు, బుల్లెట్ భాస్కర్‌లు అవుతారు. జయసింహ తప్పు ఒప్పుకోమ్మని భాస్కర్ అనగా.. నేను నా పెళ్లాం ముందే తప్పు ఒప్పుకోలేదని దొరబాబు కౌంటర్ వేస్తాడు. చానాళ్లకు దొరికారని బందిపోటుగా ఉన్న నరేష్ వచ్చి మిమ్మల్ని వదలనని అంటాడు.

Jabardasth Latest Promo Vadde Naveen s Entry Apparao Hilarious Comedy Scenes Go Viral

Photo Courtesy: MallemalaTV

ఆ వెంటనే రాంప్రసాద్ వచ్చి నా పేరు వడ్డే నవీన్ అని చెబుతాడు. గడ్డం నవీన్ గారి తమ్ముడిలా ఉన్నారు.. మీరు వడ్డే నవీనా అని సెటైర్ వేస్తుంది ఇంద్రజ. హీరోయిన్ రాశి సింగ్ కూడా వీరి స్కిట్‌లో సేల్స్ గర్ల్‌గా ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్‌ని చూసి ఎవరు అని అడుగుతాడు రాంప్రసాద్. సేల్స్ గర్ల్ అని ఓనర్ చెప్పగా.. సేల్‌లో పెట్టారని సెటైర్ వేస్తాడు రాంప్రసాద్. సేల్స్ గర్ల్ అంటే సేల్‌లో పెట్టడం కాదు, ఆ అమ్మాయి చీరలు సేల్ చేస్తుందని మండిపడతాడు ఓనర్. నాకు ఈ అమ్మాయి నచ్చింది? పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని రాంప్రసాద్ వెళ్లి రైజింగ్ రాజుని అడుగుతాడు. ఈ అమ్మాయి నా కూతురు కాదు.. నా కోడలు అంటాడు. ఆ వెంటనే వడ్డే నవీన్ పెళ్లి సాంగ్‌తో ఎంట్రీ ఇస్తాడు. నీ కొడుకు పెద్ద సైకో అయ్యుంటాడు.. నీ కూతురిని టార్చర్ పెడుతున్నాడా అని రాంప్రసాద్ అడగ్గా.. సైకో నా కొడుకు కాదు, కోడలు అని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

తర్వాత తాగుబోతు రమేశ్, పంచ్ ప్రసాద్, రోహిణిలు అత్తా కోడలు, వాళ్ల మధ్య నలిగిపోయే కొడుకు ఎలిమెంట్‌లో ఫన్నీ స్కిట్ చేస్తారు. కొడుకులు ఎవరికి సపోర్ట్ చేస్తారని రష్మి అడగ్గా.. ఎవరికీ సపోర్ట్ చేయరు బ్యాలెన్స్ చేస్తారు, జస్ట్ సైలెంట్‌గా ఉండటమేనని చెబుతాడు. తల్లి దగ్గరికి వెళ్లి నీకంటే గొప్ప ఎవరూ లేరని చెప్పాలి, భార్య దగ్గరికి వెళ్లి నీ కంటే గొప్ప ఎవరూ లేరని అనాలి.. ఇద్దరూ ఒకేచోట ఉంటే నోరు మూసుకుని కూర్చోవాలని పంచ్ విసురుతారు నాగబాబు.

ఆ వెంటనే ధనాధన్ ధనరాజ్ ట్రంప్ పెడుతున్న ఇబ్బందులు, అమెరికా వీసా సమస్యల గురించి తెలిపేలా స్కిట్ చేశాడు. నా పెళ్లి అమెరికాలో అని చెప్పి ధనరాజ్ ఇన్వైట్ చేయడంతో అతని ఫ్రెండ్ భార్యను తీసుకుని అమెరికా వెళ్తాడు. ఇక్కడ పెళ్లి జరగడం లేదు.. ట్రంప్ గారు నిద్రపోతున్నారని అమెరికా అతను చెప్పడంతో.. వీడు ప్రపంచానికి నిద్రలేకుండా చేసి వీడు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడా? అని పంచ్ విసురుతాడు. నేను అమెరికాలో లేను, వీసా, పాస్‌పోర్ట్ కావాలని ధనరాజ్ చెప్పడంతో ఫ్రెండ్ అతని భార్య, షాక్ అవుతారు. తర్వాత నా కూతురి బారసాల ఫంక్షన్ ఉక్రెయిన్‌లో అని ధనరాజ్ చెప్పడంతో నువ్వు ఏది ఇండియాలో చేయవా అంటూ మండిపడతాడు ధనరాజ్ ఫ్రెండ్.

అనంతరం అప్పారావు అతని టీమ్ ఎంట్రీ ఇస్తారు. రావడం రావడంతోనే ఈ షెడ్యూల్‌కి రాఘవ గారు లేరట, అందుకని టీమ్‌ని తీసేశాని అప్పారావు చెప్పడంతో యాంకర్ రష్మి షాక్ అవుతుంది. సాంబారులో బల్లి పడితే .. బల్లి పడేయాలి కానీ, సాంబార్ పడేయటం ఏంటని మండిపడతాడు అతని అసిస్టెంట్. అయితే రాఘవ బల్లి లాంటోడా? అని నాగబాబు సెటైర్ వేయడంతో అంతా నవ్వేస్తారు. చివరిలో వినోదం సినిమాలో కళ్లు లేని ఏవీఎస్‌ని బ్రహ్మానందం ఎలా మోసం చేసి ఇళ్లంతా దోచేస్తాడు అన్న కామెడీ సీన్‌కి స్పూఫ్ చేస్తారు. అయితే దొంగల దగ్గరే ఓనర్ దోచుకోవడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. బందిపోటు నరేష్‌పై దొరబాబు, బుల్లెట్ భాస్కర్‌ పగ తీర్చుకున్నారా? ప్రేమించిన అమ్మాయితో రాంప్రసాద్ పెళ్లి జరిగిందా? లేదా? తల్లి పెళ్లాం మధ్య పంచ్ ప్రసాద్ ఎలా తప్పించుకున్నాడు? ధనరాజ్‌కి వీసా పాస్‌పోర్ట్ దొరికాయా? లేదా? అనేది తెలియాలంటే జూన్ 19, 20 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Read more about: jabardasth vadde naveen nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X