twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పయితే నా తల్లి, వదినకు వర్తిస్తుంది: జబర్దస్త్ కాంట్రవర్సీపై ముక్కు అవినాష్

    |

    జబర్దస్త్ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానపరిచే విధంగా ఇటీవల ఓ కామెడీ స్కిట్ ప్రసారం కావడంతో జగిత్యాల వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఈ షోను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కుటుంబాలను అవమానిస్తూ స్కిట్ చేసిన కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను ఆందోళన కారులు దహనం చేశారు. అయితే ఈ వివాదంపై ముక్కు అవినాష్ స్పందించారు.

    నేనూ జగిత్యాల నుండే వచ్చాను

    నేనూ జగిత్యాల నుండే వచ్చాను

    నేను జగిత్యాల జిల్లా రాఘవ పట్నం నుంచి వచ్చాను. ఇటీవల ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో నేను చేసిన స్కిట్‌లో ఓ డైలాగ్ వాడటం జరిగింది. దానికి నా గల్ఫ్ సోదరులు చాలా మంది బాధ పడ్డారు. అది కేవలం కామెడీ పరంగానే డైలాగ్ వాడను. ఎవరినీ ఉద్దేశించి కాదు.... అని అవినాష్ స్పష్టం చేశారు.

    నా తల్లి, వదినకు కూడా వర్తిస్తుంది

    నా తల్లి, వదినకు కూడా వర్తిస్తుంది

    కొందరు ఆ డైలాగును మరో విధంగా తీసుకున్నారు. ఆ విధంగా తీసుకుంటే అది నా తల్లి, వదినకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నా తండ్రి 25 సంవత్సరాలు గల్ఫ్‌లో పని చేశాడు. మా అన్నయ్య ప్రస్తుతం కూడా అక్కడే పని చేస్తున్నాడు.... అని అవినాష్ అన్నారు.

    క్షమించమని కోరుతున్నాను

    క్షమించమని కోరుతున్నాను

    ఒక వేళ మీరు ఆ ఉద్దేశ్యంతో తీసుకుంటే మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను. నా గల్ఫ్ సోదరులు నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ రోజు మీ ఆదరణ వల్లనే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాను. అందుకే నా జగిత్యాల జిల్లా పేరు కూడా జబర్దస్త్‌లో చూపించాను... అని అవినాష్ వ్యాఖ్యానించారు.

    ఇంతకీ వివాదానికి కారణమైన స్కిట్‌లో ఏంముంది?

    ఇంతకీ వివాదానికి కారణమైన స్కిట్‌లో ఏంముంది?

    ఈ స్కిట్‌లో కొడుకును తిట్టే ఒక తల్లి వేశంలో అవినాష్ కనిపించాడు. కొడుకు రాజు పాత్రలో కార్తీక్ నటించాడు. ‘‘పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడని, నువ్వు పడుకుని నిద్రపోతున్నావు' అంటూ ఆ తల్లి కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో కొడుకు పాత్రదారి కార్తీక్ ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను..' అంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.

    English summary
    Jabardasth Mukku Avinash apologize on Gulf Skit controversy. Jagtial people complaint against Jabardasth Show regarding Mukku Avinash controversal skit. Jagtial people allege that this comedy-drama insults their sentiment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X