ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ కమెడియన్ అవినాష్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాందించుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు. ఎంతోమందిని తనైదన కామెడీతో నవ్వించే అవినాష్ జబర్దస్త్ షో ద్వారా కొన్నాళ్లపాటు హాయిగా సాగింది. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మరింత ఎక్కువగా పాపులారిటీ సాధించాడు. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ లో జోకర్ గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత మంచి అవకాశాలతో దూసుకుపోతున్న అవినాష్ తాజాగా కొత్తగా ఖరీదైనా కారు కొన్నాడు. కానీ, అలా చేసినందుకు అవినాష్ పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే..
మరింత క్రేజ్:జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అవినాష్. అయితే అతన్ని ఎక్కువగా షోలలో ముక్కు అవినాష్ అంటూ కామెడీ చేస్తారు. జబర్దస్త్ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించాడు అవినాష్. అయితే సినిమాల్లో ఎంత ప్రయత్నం చేసిన కూడా అతని స్థాయి ఒక లెవెల్లోనే ఆగిపోయింది. ఇక ఎలాగైనా తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేశాడు.

బిగ్ బాస్ తర్వాత:మంచి క్రేజ్ తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 4లో ఛాన్స్ అందుకున్నాడు. బిగ్ బాస్ అవకాశం రాగానే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ మరింతగా పెంచుకున్నాడు. అయితే హౌజ్ లో ఎక్కువగా యాంకర్ అరియానా గ్లోరితో చనువుగా ఉండేవాడు అవినాష్. ఇక బిగ్ బాస్ అనంతరం అవినాష్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.

రూ. 50 లక్షలు:బిగ్ బాస్ ద్వారా అవినాష్ సుమారు రూ. 50 లక్షల వరకు సంపాదించాడని టాక్. దాని తర్వాత సొంతంగా ఓ ప్రత్యేకమైన ఇల్లు కూడా కట్టుకున్నాడు. ప్రస్తుతం మల్లెమాల తప్పితే కొన్ని షోలతో బిజీగా ఉంటున్నాడు. ఆహా వేదిక ప్రసారం అయినా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో తనదైన కామెడీతో నవ్వించాడు. అలాగే బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోలో కూడా పార్టిస్ పేట్ చేసి రన్నరప్ గా నిలిచాడు.

అమ్మకు బాలేదంటూ:ప్రస్తుతం సినిమాల్లో అరకొర పాత్రలు, స్టార్ మా పోగ్రామ్స్ చేస్తున్న అవినాష్ యూట్యూబ్ ద్వారా ఛానెల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఇక తన ఇంట్లో ఏం జరిగినా, బయటకు వెళ్లినా వ్లోగ్స్ రూపంలో పోస్ట్ చేస్తుంటాడు. అలా తన అమ్మకు బాగా లేదని, హాస్పిటల్ లో జాయిన్ చేశామని వీడియో పోస్ట్ చేశాడు. దీంతో కొంతమంది బాధను వ్యక్తం చేస్తే మరికొంతమంది ఇలాంటి వీడియోలు అవసరమా అని తిట్టారు.
కంగ్రాట్స్ అంటూ:ఇక తాజాగా అవినాష్ కొత్తగా కారు (Mahendra XU700) కొన్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ కారు విలువ రూ. 25 లక్షలు అని సమాచారం. అయితే "ఆ కారు ఎందుకు కొన్నావ్. మొన్ననే కదా మీ అమ్మకు ఆరోగ్యం బాలేదంటూ చెప్పావ్. ఇలాంటి సమయంలో కారు కొనడం అవసరమా?" అంటూ అవినాష్ ను గట్టిగా మందలిస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది మాత్రం కంగ్రాట్స్ అని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











