టెన్షన్ తగ్గడానికి ఆ వీడియోలు చూస్తా.. ఒపెన్‌గా చెప్పేసిన జబర్దస్త్ నటుడు..
Jabardasth Naresh: 'జబర్దస్త్'నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసులో టీనేజ్ అయినా, జన్యులోపం కారణంగా చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. కానీ, ఆ లోపానే వరంగా మార్చుకుని తన జీవితాన్ని మార్చేకున్నారు. కమెడియన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 'జబర్దస్త్','ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోలు ద్వారా భారీ గుర్తింపు సంపాదించిన నరేష్, తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరచుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు, విదేశాల్లో జరిగే ఈవెంట్లకూ పాల్గొంటున్నారు. మంచి ఆదాయం కూడగట్టుకుంటున్నాడు. నరేష్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే.. బుర్ర హీటెక్కినప్పుడూ అలాంటి వీడియోలు చూస్తా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారో ఓ లూక్కేయండి.
జబర్దస్త్ నటుడు నరేష్ తాజాగా యాంకర్ వర్ష హోస్ట్‌గా నిర్వహిస్తున్న 'కిసిక్ టాక్ షో'లో పాల్గొన్నారు. ఈ సమయంలో తన జీవితంలోని ఎన్నో తెలియని విషయాలను బయటపెట్టాడు. ఎప్పుడూ హాస్యంతో ప్రేక్షకులను అలరించే నరేష్ ఈసారి భావోద్వేగాలతో నిండి, చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న అవమానాలు, బాధలు, మరియు ఇండస్ట్రీలో తన పోరాటాన్ని వివరించాడు. నరేష్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి తన హైట్ కారణంగా చాలా మంది తనను హేళన చేశారని చెప్పారు. "నా హైట్ చూసి చాలా మంది నన్ను అసభ్య పదాలతో పిలిచేవారు. చిన్న పిల్లాడిలా కనిపించడం వల్ల చాలా అవమానాలు భరించాను" అని భావోద్వేగంగా తెలిపారు.

ఈ హేళనల వల్ల కుటుంబం తీవ్రంగా బాధపడిందని, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తన తల్లి డిప్రెషన్‌కి గురయ్యిందని చెప్పారు. పేదరికం కారణంగా తాను 9వ తరగతి వరకే చదువు కొనసాగించగలిగానని నరేష్ చెప్పారు. "అదికూడా చదవడం చాలా కష్టమైంది. కానీ ఎలాగైనా నా కుటుంబాన్ని మంచి స్థాయిలో చూడాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను" అని వెల్లడించారు. 'ఇండస్ట్రీలో స్థిరపడటం కోసం పడిన కష్టాలు చెప్పలేనివి. మా కుటుంబం కోసం ప్రతీ రోజు కష్టపడుతున్నాను' అని చెప్పారు.
యాంకర్ వర్ష, బుల్లెట్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా నరేష్ స్పందించాడు. భాస్కర్ గతంలో నరేష్‌ను సూచిస్తూ "వాడు చాలా కమర్షియల్... చనిపోయిన వారి ఇంటికైనా వెళ్లి పెట్రోల్ డబ్బులు అడుగుతాడు" అని చేసిన కామెంట్ పెద్ద వివాదం అయ్యింది. నరేష్ ఈ విషయంపై మాట్లాడుతూ "నేను అలాంటి వాడిని కాదు. భాస్కర్ అన్న తర్వాత నన్ను సంప్రదించి సారీ అన్నాడు. కానీ అప్పటికే ఆ కామెంట్ నా ఈవెంట్స్ పై ప్రభావం చూపించేసింది" అని చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో తనను తప్పుగా చూపుతూ వీడియోలు చేసి మరింత బాధపెట్టారని కూడా నరేష్ వెల్లడించాడు.
ఒత్తిడి తగ్గాడానికి..
ఎప్పుడూ షోలు, ఈవెంట్స్ ఫుల్ బిజీగా ఉంటావ్ కాదా? ఒత్తిడి, టెన్షన్ ను ఎలా మ్యానేజ్ చేస్తావ్ ? అని యాంకర్ వర్ష ప్రశ్నించగా.. దీనికి నరేష్ చెప్పిన సమధానం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను వైరల్ చేస్తూ పుల్ గా నవ్వేసుకుంటున్నారు. నరేష్ మాట్లాడుతూ.. 'ఇంస్టాగ్రామ్ రీల్స్, ట్రోలింగ్ వీడియోలు చూస్తూ ఉంటా.. అలాగే బూ..తు వీడియోలు కూడా చూస్తా..' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సమాధానానికి షాక్ అయినా వర్ష.. 'ఏంటి బూ..తు వీడియోలా ? అని తిరిగి ప్రశ్నిస్తుంది. వెంటనే నరేష్ తన తప్పును అర్థం చేసుకుని బూ..తు వీడియోలు అంటే.. అవి కాదు, కామెడీ వీడియోలు అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











