Jabardasth : జబర్దస్త్‌కు కొత్త యాంకర్‌గా బిగ్ బాస్ బ్యూటీ... ఎవరో తెలుసా?

బుల్లితెరపై పాపులర్ కామెడీ షోగా గుర్తింపు పొందింది 'జబర్దస్త్'. ఈ షోలో మొదట అనసూయ యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అనసూయ తర్వాత రష్మీ ఎంటర్ అవ్వగా.. షోను జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని రెండుగా విడదీశారు. ఇక ఇదిలా సాగుతుండగా.. అనసూయ యాంకరింగ్ కు బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ ప్లేస్ లో సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సౌమ్య రావు.. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో అందాల భామ బిగ్ బాస్ బ్యూటీ యాంకరింగ్ చేసేందుకు వచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరిలో తెలుసుకుందాం.

బుల్లితెరపై దశాబ్ద కాలం నుంచి నవ్వులు పూయిస్తున్న ప్రోగ్రాం ఏదైనా ఉందంటే జబర్దస్త్. ఇక మొదట ఈ షోకు నాగబాబు, రోజా జడ్జ్ లుగా ఉన్నప్పుడు చాలా ఆసక్తికరంగా సాగింది. ఇక ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ నవ్విస్తూ.. టీమ్ మెంబర్స్ అంతా హేల్దీ జోక్స్ వేస్తూ కొంతకాలం బాగానే సాగింది. ఇక ఈ షోకు మొదట యాంకర్ గా అనసూయ వచ్చింది. ఇక ఆమెకు పోటీగా రష్మి అని తీసుకువచ్చి.. షోను రెండుగా విడగొట్టారు.

Jabardasth New Anchor Bigg Boss Beauty Siri Hanumanth Full Details Here

ఇక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ పేరిట రెండు రోజులు షోను నడిపించారు. అనసూయ, రష్మీ ఈ షోలో యాంకరింగ్ చేస్తూ.. పోటా పోటీగా అందాలు ఆరబోశారు. ఇక ఆ కొన్నాళ్ల తర్వాత అనసూయ సినిమాల్లోకి వెళ్లిపోయింది. సినిమాలు చేస్తూ.. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఇక ఆ ప్లేస్ లోకి కొత్త యాంకర్ వచ్చిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్ కు సౌమ్య రావు యాంకరింగ్ చేస్తూ వచ్చింది. ఈ భామ కూడా తన అందాలతో ఆకట్టుకుంది. తెలుగులో మాట్లాడుతూ.. రష్మితో పోటిగా యాంకరింగ్ చేసేది. తెలుగు శ్రీమంతుడు అనే సీరియల్ లో యాక్ట్ చేసిన సౌమ్యరావు.. అలా జబర్దస్త్ కంట పడింది. అలా ఆమెను తీసుకువచ్చి యాంకర్ చేసారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే జబర్దస్త్ కోసం మరొక కొత్త యాంకర్ ను పట్టుకువచ్చారు నిర్వాహకులు.

Jabardasth New Anchor Bigg Boss Beauty Siri Hanumanth Full Details Here

ఇప్పుడు జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్. ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తుంది. తాజాగా విడుదల అయిన ప్రోమో గమనిస్తే.. సిరి హనుమంత్ ఈ షోకు యాంకర్ గా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇందులో జడ్జ్ లుగా ఉంటే.. ఇంద్రజ, భగవాన్ లు కూడా ఆమెకు స్వాగతం పలికారు. ఇక ఎప్పటిలాగానే షోలో నవ్వులు పంచే కామెడీ స్కిట్ లు ఈ వారం టెలికాస్ట్ కానున్నాయి.

ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హనుమంత్ కంటెస్టెంట్ గా ఎంటర్ అయి.. క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక సిరి ఇటీవల షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కూడా నటించింది. ఆ క్యారెక్టర్ మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో తో మరింత క్రేజ్ కొట్టేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X