Jabardasth:అనసూయ తప్పుకోవడంతో ఆ గ్లామరస్ యాంకర్ కి లక్కీ ఛాన్స్.. రెమ్యునరేషన్ తక్కువే?

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా వరకు నిలదొక్కుకున్నారు అనే చెప్పాలి. జబర్దస్త్ కొన్నేళ్ల వరకు కూడా మంచి రేటింగ్స్ తో టెలివిజన్ రంగంలోనే టాప్ షో గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో మాత్రం జబర్దస్త్ షో నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోతూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి మరో గ్లామరస్ యాంకర్ వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువబడుతున్నాయి. ఆ వివరాలు లోకి వెళితే..

 శ్రీముఖి రిజెక్ట్?

శ్రీముఖి రిజెక్ట్?


2013లో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన జబర్దస్త్ అంతగా సక్సెస్ కాదు అని అందరూ అనుకున్నారు. అందుకే ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది కమెడియన్స్ ఈ షో చేయడానికి మొదట అంతగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ప్రముఖ యాంకర్స్ కూడా ఈ షో అంతగా సక్సెస్ అవుతుందని అంచనాలు వేయలేకపోయారు. శ్రీముఖి కూడా యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది కానీ ఆమె రిజెక్ట్ చేసింది.

 అలా అనసూయకు ఛాన్స్

అలా అనసూయకు ఛాన్స్

ఇక కొంతమంది యాంకర్స్ ను సంప్రదించిన తర్వాత ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో యాంకర్ అనసూయను ఫైనల్ చేశారు. అప్పుడప్పుడే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనసూయ వచ్చిన కొత్తలోనే తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒకవైపు కమెడియన్స్ కామెడీతో అలరిస్తుంటే మరొకవైపు అనసూయ మాత్రం తన అందంతో స్మైల్ తోనే కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.

ఆ తరువాత అమెకూడా..

ఆ తరువాత అమెకూడా..

మధ్యలో అనసూయ జబర్దస్త్ కు కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమె తర్వాత సినీనటిగా కొనసాగిన రేష్మి ఊహించిన విధంగా అవకాశం దక్కించుకుంది. ఆమె కూడా తన గ్లామర్ తో జబర్దస్త్ షో కు సరికొత్త గ్లామర్ను తీసుకువచ్చి మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక తర్వాత మళ్లీ అనసూయ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ విధానంలో జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి సక్సెస్ అందుకున్నాయి.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారానే చాలా మంచి గుర్తింపు అందుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత సినిమాలలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆమె జబర్దస్త్ వదలలేదు. నాగబాబు రోజాతో పాటు ఆమె కూడా యధావిధిగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ఆమె మంచి ఆదాయం కూడా అందుకున్నారు. వారంలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్ కోసం ఆమె దాదాపు లక్షకుపైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

 జబర్దస్త్ కు గుడ్ బై?

జబర్దస్త్ కు గుడ్ బై?


అయితే ఇటీవల యాంకర్ అనసూయ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె జబర్దస్త్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు గతంలోనే చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి. ఇక ఇప్పుడు ఆమె మరి కొన్ని కారణాలతో ఈ కామెడీ షోకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.

 అనసూయ తరువాత మంజూష?

అనసూయ తరువాత మంజూష?


అయితే యాంకర్ అనసూయ వెళ్లిపోతే ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అంటే చాలా కష్టమే. రెండు జబర్దస్త్ షోలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒకవైపు రష్మి బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు అనసూయ వెళ్ళిపోతే జబర్దస్త్ షో కోసం మళ్లీ కొత్త యాంకర్ గా ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ కారమైతే మంజుష రాంపల్లి మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇటీవల గ్లామర్ తో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
రెమ్యునరేషన్ తక్కువే?

రెమ్యునరేషన్ తక్కువే?

ఇక జబర్దస్త్ ద్వారా యాంకర్స్ చాలా వరకు ఎపిసోడ్ కు లక్షకు పైగా ఆదాయం అందుతుంది. అయితే ఇప్పుడు మంజూషరాంపల్లికి ఒకవేళ అవకాశం ఇచ్చిన కూడా ఆ స్థాయిలో ఇవ్వకపోవచ్చు అని సమాచారం. ఎందుకు అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు జబర్దస్త్ కు చాలావరకు రేటింగ్ తగ్గిపోయింది. ఆదాయం లేక సీనియర్ కమెడియన్స్ కూడా బయటకు వెళ్లిపోతున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు మంజుషారాంపల్లి వస్తే ఆమెకు 50 వేల లోపే ఇవ్వవచ్చు అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X