Jabardasth అదేంటి సౌమ్య.. ఇంద్రజ గాలి అలా తీసేసింది?

తెలుగులో జబర్దస్త్ షో సంపాదించిన క్రేజ్ మరే షో సంపాదించలేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చాలాకాలం క్రితమే ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ సంపాదిస్తూ... ముందుకు వెళుతుంది. ప్రతీ గురువారం ప్రేక్షకులను అలరిస్తోన్న 'జబర్దస్త్' ప్రోమో ఆసక్తికరంగా సాగింది.

ఎప్పట్లాగే కంటెస్టెంట్ల ఫన్నీ స్కిట్స్ తో అక్కడి ఈ ప్రోమో మొత్తాన్ని నింపేశారు. అయితే ఈ సారి ఓ ఇంట్రస్టింగ్ స్కిట్ అందర్నీ ఆకట్టుకోనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇక ఒక ఈ స్కిట్ లో భాగంగా యాంకర్ సౌమ్య.. 'జబర్దస్త్' జడ్జ్ ఇంద్రజను ఇమిటేట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది ఆ వివరాల్లోకి వెళితే...

Jabardasth New Episode Promo Release

అదిరిపోయే పంచ్ లతో: తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో ముందు రాకెట్ రాఘవ స్కిట్ ను చూపించారు. నా పదేళ్ల జబర్దస్త్ ప్రయాణం గురించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని రాఘవ అడగగా జడ్జ్ కృష్ణ భగవాన్ స్పాంటేనియస్ గా.. కొంచెం కామెడీ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారని అంటూ అదిరే పంచ్ వేసి అందర్నీ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారు.

నవ్వులు పూయిస్తూ: ఆ తర్వాత ఒక డబల్ మీనింగ్ డైలాగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. రాగం గొంతులోంచి కాదు ఎక్కడో గుహల్లోంచి రావాలని పక్కనున్న టీమ్ మేట్ తో చెప్పిన రాకెట్ రాఘవ డైలాగ్ కు కూడా అందరూ పగలబడి నవ్వేశారు. దాన్ని మళ్లీ మార్చి రాగం ఎక్కడో గుహల్లోంచి కాదయ్యా.. గొంతులోకి రావాలని చెప్పడంతో అంతా మరోసారి నవ్వుకున్నట్టు అయింది.

యాంకర్ సౌమ్య స్కిట్: ఇక ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఉన్న సద్దాం అడిగిన ప్రశ్నలు కూడా బాగా పేలాయి. కింద కూర్చున్న ముగ్గురిని మీ పేర్లేంటీ అని అడగగా.. వారు రాము, వస్తాం, పోతాం అంటూ చెప్పడం భలే నవ్వులు పూయిస్తోంది. అయితే మునిపెన్నడూ లేని విధంగా ఆసక్తికరంగా ఈసారి యాంకర్ సౌమ్య కూడా ఓ స్కిట్ చేసింది.

"ఇంద్రజ గారు చెప్పే ప్రతీ ఒక్క మాటకీ ఆవిడ అభిమాని ఒకరు ఇన్స్పైర్ అయిపోయి, సేమ్ ఆమె లాగే మారిపోయింది, ఆమె పేరు ఒకప్పుడు సౌమ్య.. ఇప్పుడు సౌమ్యజ అని పెట్టుకుంది తెలుసా" అని టీం లీడర్ నూకరాజు చెబుతుంటే ఇంద్రజ నిజంగా జరుగుతుందేమో అన్నంతగా జీవించేసింది.

Jabardasth New Episode Promo Release

ఇంద్రజ... హాట్ టాపిక్: ఇంతకీ వచ్చేది ఎవరా అని చూడగానే.. "ఆకాశం అమ్మాయైతే" అనే సాంగ్‌తో యాంకర్ సౌమ్య, ఇంద్రజ లాగే నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చింది. "మేడమ్ డ్యాన్స్ వేయొచ్చుగా" అని నూకరాజు అడగగా.. "వద్దురా నూకు.. ఎందుకురా.. అని సౌమ్య చాలా గోముగా చెబుతున్నట్టు చెప్పినా తర్వాత వారి కోరిక మేరకు.. ఓకే మ్యూజిక్ పెట్టండి అని అంటుంది.

'వర్షం' సినిమాలోని "నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా" అనే సాంగ్ ను వేయడంతో కొంచెం బ్యాక్ చేయండంటూ సౌమ్య చెప్పడం నవ్వులు పూయించింది ఆ తర్వాత డైరెక్టర్ గారూ.. ఈ సాంగ్ లో కొంచెం తేడా వస్తోంది, మిడిల్ లో మాట్లాడొద్దు ప్లీజ్" అంటూ అందరికీ ఇంద్రజను ఇమిటేట్ చేసేలా మాట్లాడడం.. ఇంద్రజ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ.. పగలబడి హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X