రోజా పక్కన సెట్టైపోయిన సెలబ్రిటీ! నాగబాబును మరిపిస్తూ కొత్త కళ.. జబర్దస్త్‌ కిక్

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ వేదికపై రోజా పక్కన మెగాబ్రదర్ నాగబాబు చేసిన హంగామా అంతాఇంతా కాదు. దాదాపు ఏడేళ్ల పాటు ఆమె పక్కనే కూర్చొని బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిచ్చిన ఆయన ఇటీవలే ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కారణమేదైనా నాగబాబు లేనిలోటు కొద్దిరోజుల పాటు కనిపించింది. కానీ ఇన్నిరోజులకు రోజా పక్కన సరిగ్గా సూట్ అయ్యే మరో సెలబ్రిటీ దొరికాడనే టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఎవరా సెలబ్రిటీ? వివరాల్లోకి పోతే..

జానాల్లో సందేహాలు.. నాగబాబు- రోజా రేంజ్‌

జానాల్లో సందేహాలు.. నాగబాబు- రోజా రేంజ్‌

ఎప్పుడైతే జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకున్నాడో అప్పటినుంచి జబర్దస్త్ సంగతులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇన్నేళ్ల పాటు కడుపుబ్బా నవ్విస్తూ జబర్దస్త్ జడ్జ్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన నాగబాబు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఒకవేళ చేసినా నాగబాబు- రోజా రేంజ్‌లో, అతనితో రోజాకు సెట్ అవుతుందా? అనే సందేహాలు జానాల్లో నెలకొన్నాయి.

 రోజాతో నరేష్, పోసాని కృష్ణమురళి

రోజాతో నరేష్, పోసాని కృష్ణమురళి

ఈ మేరకు జబర్దస్త్ యాజమాన్యం కూడా నాగబాబు స్థానాన్ని ఫిల్ చేసేందుకు పకడ్బందీ ప్రయత్నాలే చేసింది. ఇందులో భాగంగా రోజా పక్కన సీనియర్ నటుడు నరేష్, పోసాని కృష్ణమురళి లాంటి వారిని కూర్చోబెట్టారు. అయినప్పటికీ నాగబాబు లేని లోటు స్పష్టంగా కనిపించింది.

కన్ఫ్యజన్‌లో పబ్లిక్.. జబర్దస్త్ టీమ్ ప్రయోగాలు

కన్ఫ్యజన్‌లో పబ్లిక్.. జబర్దస్త్ టీమ్ ప్రయోగాలు

రోజాను అలాగే ఉంచి ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో జడ్జ్‌తో ప్రయోగాలు చేసింది జబర్దస్త్ టీమ్. కొన్ని ఎపిసోడ్స్‌లో ఇలా వరుసగా జడ్జ్‌లు మారుతూ వస్తున్నారు. దీంతో ఇంతకీ నాగబాబు ప్లేస్ భర్తీ అయ్యేనా అనే కన్ఫ్యజన్‌లో పడిపోయారంతా.

జబర్దస్త్ వేదికకు పూర్వవైభవం.. రోజాతో ఆయన

జబర్దస్త్ వేదికకు పూర్వవైభవం.. రోజాతో ఆయన

సరిగ్గా ఈ తరుణంలో తాజాగా ప్రసారం అయిన ప్రోమోలో రోజా పక్కన ప్రముఖ సింగర్ మనో కనిపించారు. జబర్దస్త్ కమెడియన్స్ స్కిట్ చూస్తూ ఇద్దరూ నవ్వులతో జబర్దస్త్ వేదికకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. నాగబాబు లోటు కనిపించకుండా బాగా మేనేజ్ చేశారు మనో.

రోజా పక్కన సెట్.. జబర్దస్త్‌కు కిక్

రోజా పక్కన సెట్.. జబర్దస్త్‌కు కిక్

దీంతో ఇక జబర్దస్త్‌కు ఫుల్‌టైమ్ జడ్జ్ దొరికినట్లే అనే టాక్ వినిపిస్తోంది. సింగర్ గానీ గాక పలు టీవీ చానెల్స్‌లో పాటల పోటీలు, రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరించిన అనుభవం ఉన్న మనోకి ఉంది. పైగా వాయిస్‌తో పాటు, హావభావాలు పలికించడంలో మనో మహా దిట్ట. వీటన్నింటినీ, తాజా ప్రోమోను పరిగణలోకి తీసుకొని ఇక జబర్దస్త్‌కు కిక్కిచ్చే, రోజా పక్కన సెట్టయ్యే జడ్జ్ దొరికాడని అంటున్నారు జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X