రోజా ముందే షర్ట్ విప్పేసిన సీనియర్ హీరో.. అనసూయ ఫీలింగ్స్! వైరల్ వీడియో

జబర్దస్త్ కామెడీ షో.. ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తున్న ఈ షో టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చిన్ని తెరపై ఇంటింటా జబర్దస్తీ చేస్తూ భారీ టీఆర్ఫీ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. ప్రతీ పండగకు ఏదో ఒక స్పెషల్ ఎపిసోడ్‌తో కిక్కిచ్చే ఈ కామెడీ షో.. సంక్రాంతికి సరిపోయేంత ఫన్ క్రియేట్ చేయబోతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. వివరాల్లోకిపోతే..

సీనియర్ హీరో జబర్దస్తీ.. రోజా, అనసూయ కిక్

సీనియర్ హీరో జబర్దస్తీ.. రోజా, అనసూయ కిక్

జబర్దస్త్ షోలో అప్పుడప్పుడు కొందరు టాలీవుడ్ నటులు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా పండగల సమయంలో ఇలా వెండితెర నటులతో కూడా స్కిట్స్ చేయించి నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతోంది జబర్దస్త్ మేనేజ్‌మెంట్. ఇదే బాటలో వచ్చేవారం ఓ సీనియర్ హీరో జబర్దస్త్ షోలో సందడి చేయబోతున్నాడు.

సంక్రాంతి సెలవుల్లో సంబరాలు..

సంక్రాంతి సెలవుల్లో సంబరాలు..

సంక్రాంతి సెలవుల్లో ప్రతీ తెలుగింటా సంబరాలు నింపేలా జనవరి 16న ఈ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో వీడియో విడుదల చేసి.. ఆ రోజు కోసం ఆతృతగా ఎదురుచూసేలా చేసింది జబర్దస్త్ టీం. ఈ వీడియోలో సీనియర్ హీరో పృథ్వీ సందడి కనిపించింది.

రోజా ముందే షర్ట్ విప్పేసి హీరో హల్చల్

రోజా ముందే షర్ట్ విప్పేసి హీరో హల్చల్

తన ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్ ''రుక్కు.. రుక్కు.. రుక్కుమని..'' సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ.. పోలీస్ గెటప్‌లో పంచ్ డైలాగులతో ఇరగదీశాడు. అంతేకాదు షర్ట్ సిప్పేసి తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ హల్చల్ చేశాడు. రోజా ముందే ఆయన ఇలా షర్ట్ విప్పడం చూపరులకు షాకిస్తోంది.

 ఒకానొక సమయంలో రోజాతో ఆ హీరో..

ఒకానొక సమయంలో రోజాతో ఆ హీరో..

ఒకానొక సమయంలో తెలుగులో చాలా సినిమాలు చేసి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీ. అప్పట్లో వచ్చిన 'పెళ్లి' సినిమాలో పృథ్వీ నటనను అంతా మెచ్చుకున్నారు. రోజాతో కూడా ఈ హీరో కొన్ని సినిమాల్లో నటించాడు. అదే హీరో ఇప్పుడు ఏకంగా రోజా ముందే ఇలా షర్ట్ విప్పేసి సిక్స్ పాక్ చూపించడం ఆసక్తికరంగా మారింది.

పృథ్వీ ఫ్రీ షో.. రోజా, అనసూయ ఫీలింగ్స్

పృథ్వీ ఫ్రీ షో.. రోజా, అనసూయ ఫీలింగ్స్

ఇక జబర్దస్త్ వేదికపై పృథ్వీ చేసిన ఈ ఫ్రీ షో చూసి రోజా నవ్వు ఆపుకోలేకపోయింది. మరోవైపు అనసూయాది కూడా అదే పరిస్థితి. ఇద్దరూ సిగ్గు మొగ్గలు వేస్తూ తెగ నవ్వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ రేంజ్‌లో వాళ్ళ ముందు.. హాట్ టాపిక్

ఈ రేంజ్‌లో వాళ్ళ ముందు.. హాట్ టాపిక్

రోజా పక్కన ఎప్పటిలా నాగబాబు కూడా లేడు. యాంకర్, జడ్జ్ ఇద్దరూ లేడీసే. ఇలాంటి వేదికపై మనోడు ఇలా ఫ్రీ షో చేయడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. మరీ ఈ రేంజ్‌లో వాళ్ళ ముందు సిక్స్ ప్యాక్ చూపించడాలు మాత్రం కాస్త ఓవర్ అయ్యాయని అంటున్నారు ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.

Recommended Video

Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu

మరోవైపు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది

ఈ ప్రోమో వీడియోలో ఒక్క పృథ్వీ హంగామానే గాక సుడిగాలి సుధీర్, హైపర్ ఆది పంచులు కూడా చూపించి మరింత ఆసక్తి కలిగించారు. దీంతో జనవరి 16న ఈ షో చూసి ఎంజాయ్ చేయాలని కుతూహలంగా ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X