రాఖీతో షాకిచ్చిన జబర్ధస్త్ కమెడియన్ లవర్.. పెళ్లి అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి!
తెలుగు బుల్లితెరపై టాలెంట్ ఉన్న ఎంతో మంది కుర్రాళ్లు సందడి చేస్తున్నారు. కానీ, వారిలో విలక్షణమైన నటనతో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను సైతం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం నూకరాజు ఒకడు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన అతడు.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో ఆసియాతో లవ్ ట్రాక్‌ను కూడా నడుపుతున్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా వీళ్లిద్దరూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అసలేమైందో మీరే చూసేయండి!
పటాస్ షోతో.. జబర్ధస్త్‌గానే
తెలుగు టెలివిజన్‌పై ప్రసారమైన సక్సెస్‌ఫుల్ షోలలో 'పటాస్' ఒకటన్న విషయం తెలిసిందే. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. చాలా చిన్న ఏజ్‌లోనే అద్భుతమైన టాలెంట్‌తో అలరించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి వచ్చాడు. ఇందులో బాగా రాణించి టీమ్ లీడర్‌గానూ ఎదిగి అప్పటి నుంచి సత్తా చాటుతున్నాడు.

ఆల్‌రౌండర్‌గా రాణిస్తాడు
'పటాస్'లో కంటే జబర్ధస్త్ షోలో చేయడం వల్ల నూకరాజు మరింతగా పాపులర్ అయ్యాడు. వాస్తవానికి సాదాసీదా ఆర్టిస్టుగా ఇందులోకి వచ్చిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే సెకెండ్ లీడ్‌గా ఎదిగిపోయాడు. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ సినిమాల్లోనూ వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు.
ఆమెతో ప్రేమాయణంతో
జబర్ధస్త్ కమెడియన్‌గా తిరుగులేకుండా దూసుకుపోతోన్న నూకరాజు.. 'పటాస్' షోలో చేస్తోన్న సమయం నుంచి తోటి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును సాగిస్తున్నాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట కలిసే ఉంటున్నారు. అలా ఇద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటున్నారు.

పెళ్లికి రెడీ.. ఎప్పుడంటే
జబర్ధస్త్ కమెడియన్ నూకరాజు, ఆసియా చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులను సైతం వీళ్లు ఒప్పించుకున్నారు. అప్పటి నుంచి నూకరాజు, ఆసియా పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీళ్లిద్దరూ మాత్రం పెళ్లికి ఇంకాస్త టైం తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
రాఖీతో షాకిచ్చిన జంట
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ చేస్తోన్న నూకరాజు, ఆసియా.. త్వరలో రాబోయే రాఖీ పండుగ కోసం ఓ పాటను రూపొందించారు. ఇందులో వీళ్లిద్దరూ అన్నా చెల్లిలా కనిపించారు. అంతేకాదు, ఇందులో ఆసియా పెద్దలను ఎదురించిన అమ్మాయిగా.. నూకరాజు ఆమె అన్నగా చేశాడు. చివరికి ఆమె చనిపోవడాన్ని ఎమోషనల్‌గా చూపించారు.
తిట్టిపోస్తున్న నెటిజన్లు
రాఖీ పండుగ సందర్భంగా నూకరాజు, ఆసియా అన్నాచెల్లిగా మారి చేసిన కవర్ సాంగ్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. 'పెళ్లి చేసుకునే మీ ఇద్దరూ అన్నా చెల్లిగా చేయడం ఏంటి', 'మీకు సిగ్గుందా? లవర్స్ అన్నా చెల్లిలా చేస్తారా', 'కాబోయే భార్యతో ఎవడైనా రాఖీ కట్టించుకుంటాడా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











