ఆసియాతో జబర్ధస్త్ నూకరాజు బ్రేకప్: ఆ సమస్య వల్లే ఇద్దరి మధ్య దూరం.. సినిమాను తలపించే లవ్ స్టోరీ

తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే తమ సత్తాను నిరూపించుకుని వరుసగా ఆఫర్లను దక్కించుకోవడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సైతం సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో యంగ్ కమెడియన్ నూకరాజు ఒకడు. ప్రస్తుతం జబర్ధస్త్ షోలో టీమ్ లీడర్‌గా సందడి చేస్తోన్న అతడు.. ఆసియా అనే అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. చక్కగా సాగుతోన్న వీళ్ల స్టోరీలో అనుకోని చిక్కులు వచ్చాయి. దీంతో అతడు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

పటాస్‌ షోతో నూకరాజు ఎంట్రీ

పటాస్‌ షోతో నూకరాజు ఎంట్రీ

తెలుగు బుల్లితెరపై వచ్చిన విజయవంతమైన కార్యక్రమాలో 'పటాస్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో అలరించిన ఈ కుర్రాడు.. అందులో బెస్ట్ కమెడియన్‌ అనిపించుకున్నాడు. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుని వరుసగా ఆఫర్లను పట్టేశాడు.

జబర్ధస్త్‌లోకి వచ్చి ఫుల్ ఫేమస్

జబర్ధస్త్‌లోకి వచ్చి ఫుల్ ఫేమస్

'పటాస్' షో చాలా ఏళ్ల పాటు విజయవంతంగా ప్రసారం అయింది. అయితే, లాక్‌డౌన్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో నూకరాజు జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ సీరియర్ కమెడియన్లతో కలిసి పని చేసిన అతడు.. తనదైన శైలి కామెడీతో స్పెషల్ అనిపించుకున్నాడు. తద్వారా ఇందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయి.. ఫుల్ ఫేమస్ అయిపోయాడు.

ప్రత్యేకమైన ఇమేజ్.. లీడర్‌గా

ప్రత్యేకమైన ఇమేజ్.. లీడర్‌గా

జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి నూకరాజు మరింత హైలైట్ అయ్యాడు. సాదాసీదా ఆర్టిస్టుగానే ఇందులోకి వచ్చిన ఈ కుర్రాడు.. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ కూడా పొందాడు. అలాగే, సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

ఆసియాతో లవ్... జంటగానే

ఆసియాతో లవ్... జంటగానే

జబర్ధస్త్ కమెడియన్‌గా వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్న నూకరాజు.. 'పటాస్' షోలో చేస్తోన్న సమయం నుంచి తోటి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును నడుపుతున్నాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. అలా ఇద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ బాగా హైలైట్ అవుతోన్నారు.

ఆ సమస్యతో ఇద్దరూ బ్రేకప్

ఆ సమస్యతో ఇద్దరూ బ్రేకప్

జబర్ధస్త్ నూకరాజు, ఆసియా లవ్ స్టోరీ ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ విషయం ఇద్దరి కుటుంబాల్లో కూడా తెలుసు. దీంతో వీళ్లిద్దరి వివాహం కూడా జరగబోతుందని ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ఆసియా, నూకరాజు పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని తెలిసింది. ఫలితంగా ఈ జంట తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయిందని బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

ఆసియాకు నూకరాజు షాక్

ఆసియాకు నూకరాజు షాక్

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును పురస్కరించుకుని జీ తెలుగు ఛానెల్‌లో రెండు రోజుల ముందుగానే 'ఓ రెండు ప్రేమ మేఘాలు' అనే స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇందులోకి నూకరాజు, ఆసియా జంటగా వచ్చి అలరించారు. అలాగే, ఆమె పేరును ఏకంగా తన ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకుని చూపించాడు. దీంతో ఆసియా ఒక్కసారిగా షాకై కన్నీరు పెట్టుకుంది.

ఎమోషనల్ అవుతూ క్లారిటీ

ఆసియాతో బ్రేకప్ జరిగిందన్న వార్తలపై నూకరాజు సమాధానం ఇచ్చాడు. ఈ ఈవెంట్‌లో 'ఎన్నొచ్చినా.. ఏవోచ్చినా నీ చేయి అయితే వదలను. మనం నిజంగా ప్రేమించిన అమ్మాయి. మనకు కాకుండా దూరం అయితే తట్టుకోలేము. ఇటు ఫ్యామిలీ కావాలి.. అటు అమ్మాయి కావాలి. ఈ బాధలు గుర్తొస్తే' అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. మొత్తంగా తాము ప్రేమలోనే ఉన్నామని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X