ఆసియాకు నూకరాజు షాక్: గదిలో ఆమెతో కలిసి.. అడ్డంగా బుక్కైపోయిన కమెడియన్

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షో ఏదంటే.. టక్కున గుర్తొచ్చే పేరు జబర్ధస్త్ మాత్రమే. అంతలా ఈ కార్యక్రమం దాదాపు పదేళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్‌ను ఇచ్చింది. ఇలా దీని ద్వారా హైలైట్ అయిన వారిలో నూకరాజు ఒకడు. చాలా చిన్న వయసులోనే విశేషమైన టాలెంట్లతో మెప్పించిన అతడు.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో ఆసియా అనే అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. తాజాగా ఆమెకు నూకరాజు షాక్ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ వివరాలను మీరే చూడండి!

అలా ఫేమస్ అయిన నూకరాజు:తెలుగు బుల్లితెరపై ప్రసారమైన సక్సెస్‌ఫుల్ షోలలో 'పటాస్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో అలరించిన ఈ కుర్రాడు.. అందులో బెస్ట్ కమెడియన్‌గా పేరు సంపాదించాడు. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుని వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు.

Jabardasth Nookaraju Gives Shock to Girlfriend Asia

జబర్ధస్త్‌లోకి వచ్చి పాపులారిటీ:సుదీర్ఘ కాలం పాటు 'పటాస్' షో విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, గత లాక్‌డౌన్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో నూకరాజు జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ హేమాహేమీ కమెడియన్లతో పాటు పని చేసిన అతడు.. తనదైన శైలి కామెడీతో అలరించాడు. తద్వారా ఇందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయి.. ఫుల్ పాపులారిటీ సంపాదించాడు.

Jabardasth Nookaraju Gives Shock to Girlfriend Asia

ఏకంగా టీమ్ లీడర్‌గా మారాడు:జబర్ధస్త్‌ షోలో చేయడం వల్ల నూకరాజు మరింతగా ఫేమస్ అయిపోయాడు. సాదాసీదా ఆర్టిస్టుగా ఇందులోకి వచ్చిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే సెకెండ్ లీడ్‌గా ఎదిగిపోయాడు. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు టీమ్ లీడర్‌గానూ మారిపోయాడు.

Jabardasth Nookaraju Gives Shock to Girlfriend Asia

ఆసియాతో నూకరాజు డేటింగ్:బుల్లితెరపై కమెడియన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నూకరాజు.. 'పటాస్' షోలో చేస్తోన్న సమయం నుంచి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును నడుపుతున్నాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. అలా ఇద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు.

రాఖీ పండుగ గురించి అడగ్గా:మామూలు కమెడియన్‌గా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన నూకరాజు ఇప్పుడు టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిపోయాడు. గురువారం ప్రసారం అయ్యే జబర్ధస్త్‌లో అతడు పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇక, వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం యాంకర్ సౌమ్య రావు.. నూకరాజుకు రాఖీ కడతానని అడగ్గా.. అతడు ఊహించని షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Jabardasth Nookaraju Gives Shock to Girlfriend Asia

ఇంద్రజ అలా ప్రశ్నించగానే:వచ్చే ఎపిసోడ్‌లో యాంకర్ సౌమ్య 'రాఖీ పండుగ కాబట్టి.. ఇక్కడ నాకు మంచి రక్ష కావాలి' అంటూ నూకరాజుకు రాఖీ కట్టబోయింది. దీనికి అతడు 'నీకు రక్ష కావాలి కానీ.. మాకు శిక్ష కాకూడదు' అన్నాడు. దీంతో ఇంద్రజ 'చంపుతా.. ఆసియాను పక్కన పెట్టుకుని నీకు కట్టుకోడానికి ఏంట్రా' అని అంది. దీంతో నూకరాజు 'గుండెలో నాలుగు గదులు ఉంటాయి మేడం.. ఒక గదిలో అది ఉంటాది. మిగిలిన గదుల్లో వీళ్లు ఉంటారు' అని షాకిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X