శివాజీ పెద్ద ఆటగాడు .. ఆ హీరోయిన్ల కోసమే షూటింగ్‌కి , జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
దాదాపు దశాబ్ధానికి పైగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్. ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో.. కామెడీ కార్యక్రమాలలో నేటికీ నెంబర్‌వన్‌గా దూసుకెళ్తోంది. దీనిని కాపీ కొట్టి పలు ఛానెల్స్‌లో ఇదే తరహాలో కార్యక్రమాలు వచ్చినా అవేవీ జబర్దస్త్‌ను టచ్ చేయలేకపోయాయి. నేటికీ భారీ టీఆర్పీలతో జబర్దస్త్ దూసుకెళ్తూ ఈటీవీకి ప్లస్‌గా మారింది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు పరిచయమయ్యారు.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. టాలెంట్ ఉండి దానిని ఎలా నిరూపించుకోవాలో తెలియని ఎంతో మందికి ఈ కార్యక్రమం ఓ ఫ్లాట్‌ఫాంలా నిలిచింది. జబర్దస్త్ ద్వారా ధనరాజ్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాకింగ్ రాకేష్ వంటి నటులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, హీరోలగాను నటించారు.. ఇంకా నటిస్తున్నారు. తొలి నుంచి ఈ షోలో ఉన్న కమెడియన్లు ఇప్పుడు లేరు.. అయినప్పటికీ జబర్దస్త్ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. తొలుత రాకెట్ రాఘవ కట్టప్ప గెటప్‌లో, తన టీమ్ మెట్‌తో ఎంట్రీ ఇస్తాడు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్, రాఘవ చేసిన ట్రాక్ నవ్వులు తెప్పించింది. నూకరాజు ట్రావెలర్‌గా ఎంట్రీ ఇచ్చి నమస్కారం అని చెప్పగానే.. ఆయనో ఆటగాడు, మామూలు ఆటగాడు కాదని శివాజీ పంచ్‌లు వేస్తాడు. నా కంటే మీరే పెద్ద ఆటగాడని బయట టాక్ అని నూకరాజు చెప్పగా అంతా నవ్వుతారు. శివాజీకి ఒకేసారి సినిమా షూటింగ్, జబర్దస్త్ షూటింగ్ ఉంటే, ఎటు వైపు వెళ్తారు? అని నూకరాజును మరో కమెడియన్ అడగ్గా.. ఖచ్చితంగా జబర్దస్త్ కే వస్తారు. అక్కడైతే ఒక్కరే హీరోయిన్. ఇక్కడైతే షెడ్యూల్ కో హీరోయిన్ అంటూ పంచ్‌లు వేయడంతో అంతా నవ్వేస్తారు.
తర్వాత ఆటోరామ్ ప్రసాద్, దొరబాబు, సన్నీలు ఫ్యాక్షనిస్ట్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన వేసిన పంచ్‌లు బాగా పేలాయి. అనంతరం ఇమ్మాన్యుయేట్ , ఢీ పండు కలిసి ఉపేంద్ర గెటప్‌లో, కెవ్వు కార్తీక్ మాంత్రికుడి గెటప్‌లో నవ్వించారు. అనంతరం బుల్లెట్ భాస్కర్ రావడం రావడంతోనే జడ్జి ఖుష్బూను చందమామతో పోల్చుతూ ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు. కర్త , కర్మ, క్రియలకు ఉదాహరణ ఎవరని అడగ్గా సందు దొరికిందే ఆలస్యం రష్మిపై పంచ్‌లు విసిరాడు బుల్లెట్ భాస్కర్.
ఇంత పెద్ద షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మి కర్త.. 11 ఏళ్లుగా ఈ పోస్ట్‌లో ఉండటం క్రియ, ఇన్నేళ్లు మనం చూడటం మన కర్మ అనడంతో అంతా పకపక నవ్వుతారు. ఇక నేను కిటికీల జాకెట్ కుట్టించుకుంటానని.. మంచి డిజైనర్ ఎవరైనా ఉన్నారా అని సత్య అడగ్గా .. ఎక్కడిదాకో ఎందుకో మన జబర్దస్త్ వర్ష ఉందిగా అంటాడు. తను కిటికీలు బాగా కుట్టిస్తదా అని ఆమె అడగ్గా.. కిటికీలేం కర్మ పెద్ద పెద్ద తలుపులే పెట్టేస్తుందని భాస్కర్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఈ షో ఎలా జరిగింది? ఎవరిపై ఎలాంటి పంచ్‌లు పడ్డాయి తెలియాలంటే రెండ్రోజులు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications











