‘గురిపెడితే ఏ అమ్మాయైనా పడాల్సిందే... ఆమెతో డేటింగ్ ఇలా ’

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన వారిలో నూకరాజు కూడా ఒకరు. సినిమాలపై పిచ్చితో గవర్నమెంట్ జాబ్ వదులుకుని యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. బంగారం లాంటి గవర్నమెంట్ జాబ్‌ని వదిలేయడంతో నాన్న ఎంతో బాధపడ్డారు. కామెడీ కిలాడీలు అనే కార్యక్రమంలో అవకాశం వచ్చినప్పటికీ రెండో షెడ్యూల్‌కే ఆపేయడంతో నూకరాజు పరిస్థితి దారుణంగా తయారైంంది. ఇంటి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో హైదరాబాద్‌లో కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ దశలో టీవీ ప్లస్‌లో వచ్చే పిట్టగోడ కామెడీ షో ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పటాస్ కామెడీ షోలో అవకాశం రావడంతో నూకరాజు జీవితం మారిపోయింది.

ఈ షోలో నూకరాజు- ఆసియా జంట చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఒకానొక దశలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆసియాతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలతో మరింత పాపులర్ అయ్యాడు నూకరాజు. జబర్దస్త్‌లోనూ అవకాశం దక్కించుకుని తన పంచ్‌లు, కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. పలుమార్లు బిగ్‌బాస్‌కి వెళ్లే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లోనూ నూకరాజు పేరు వినిపించింది.

Jabardasth Nukaraju Opens Up About 8-Year Love Story With Asiya Ahead of Made For Each Other Show

ఇదిలాఉండగా.. స్టార్ మాలో త్వరలో లాంచ్ కానున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీలో షోలో నూకరాజు- ఆసియా జంట పాల్గొననుంది. బిగ్‌బాస్ మాదిరిగా ఇది సింగిల్స్ పాల్గొనే షో కాదు.. జంటలు పాల్గొనే షో. అది కూడా పెళ్లయిన వారికి మాత్రమే ఎంట్రీ. 10 వారాల పాటు 10 జంటలని ఒక మ్యాన్షన్‌లో ఉంచుతారు. చివరి వరకు ఏ జంట అయితే ఉంటుందో వారే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో విజేతగా నిలుస్తారు. స్టార్ యాంకర్ శ్రీముఖి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ నటి రాధ, లయలు జడ్జీలుగా వ్యవహరించనున్నారు.

ప్రియాంక జైన్ - శివకుమార్, నూకరాజు - ఆసియా, వాసంతి- పవన్ కళ్యాణ్, జాను - భాను, బ్రిట్టో- సంధ్య, సోనియా - సిద్ధూ, సాండ్రా - మహేశ్, నీతూ- నటరాజ్, హరిత- హరీష్‌, అంజలి - పవన్‌లు ఎంట్రీ ఇచ్చారు. మార్చి 15న ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనే జంటలు ఒక్కొక్కరుగా ఇంటర్వ్వూలు ఇస్తున్నారు. తాజాగా నూకరాజు తన ప్రియురాలు ఆసియాతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ షోలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది.. చాలా టెన్షన్‌గా కూడా ఉంది. ఇలాంటి షోలకు వెళ్లడం మేం ఫస్ట్ టైం.. ఎలా ఉండబోతుందా? అని ఎగ్జయిటింగ్‌గా ఉంది, ఎలా ఆడతామోనని టెన్షన్. ఇదంతా ఒక ఉగాది పచ్చడిలా ఉంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్క జంటకి గొడవలు ఉంటాయి. లేని జంట అంటూ ఉండదు. కొట్టుకుని విడిపోయేంత గొడవైతే ఎప్పుడు జరగలేదు. ఎనిమిదేళ్ల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఎనిమిదేళ్లలో రెండేళ్లు ఆసియాకు ప్రపోజ్ చేయడానికి, ఆమె వెనుక పడటానికి టైం పట్టింది. ఆ తర్వాత ఆరేళ్ల నుంచి లవ్ జర్నీ కంటిన్యూ అవుతోంది. మనం ఒకసారి గురిపెడితే పడాల్సిందే. కాళ్ల మీద పడిపోయా.. బాత్రూమ్‌కి వెళ్లి ఏడ్చా. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏడుస్తా, కాళ్ల మీద పడతా ఒప్పుకోకపోతే. మన రుబాబు అట్లా ఉంటది. మన ఇమ్మాన్యుయేల్ కూడా రాయబారాలు నడిపాడు. నాలో లేని మంచితనం మొత్తం వాడే చెప్పేవాడని నూకరాజు పేర్కొన్నారు.

ఇతనిలో హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎన్నిసార్లు తిట్టినా, కొట్టినా సరే తనలో కేరింగ్ మాత్రం తగ్గలేదు. దాంతో ఆ అబ్బాయి ఏంటీ మనం వద్దు అని అవాయిడ్ చేస్తున్నా కూడా నేనే కావాలని వస్తున్నాడు అని కొంచెం ఆలోచించి, టైం తీసుకుని యాక్సెప్ట్ చేశానని ఆసియా చెప్పింది. ఆయనతో వేరే అమ్మాయి మాట్లాడితే నచ్చేది కాదు. స్టార్టింగ్‌లో ఈ ఇబ్బంది ఉండేది. వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడున్నాడు.. నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలి అని ఉండేది. ఈయన అందరితోనూ సరదాగా మాట్లాడతాడు. స్టార్టింగ్‌లో అసూయగా ఉండేది. తర్వాత అర్ధం చేసుకున్నానని ఆసియా పేర్కొన్నారు.

మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చాలామంది ట్రై చేశారు. కొంతమంది విడగొట్టాలని ట్రై చేస్తారు. కొంతమంది మాత్రం జెన్యూన్‌గా ప్రాబ్లమ్స్ చెబుతారు. ఒకటి ఏంటంటే మాది ఇంటర్‌కాస్ట్. దాని వల్ల వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏంటీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్లు. మేం విడిపోతే హ్యాపీగా నవ్వుకున్నవాళ్లు ఉన్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడి వరకు తీసుకురావాలో అంతవరకు తీసుకుని మేం మూవ్ అయ్యాం. ఈ ఇయర్ ఎండింగ్‌లో పెళ్లి చేసుకుంటామని నూకరాజు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ షోలో విజయం సాధించాలని నూకరాజు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X